హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుంతలు లేని రోడ్ల కోసం వ్యూహాత్మక ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పదేండ్లు రోడ్లను నిర్లక్ష్యం చేసిందని, రాష్ట్ర రహదారులను నిర్మించలేదని, జాతీయ రహదారుల మంజూరుకు ప్రయత్నించలేదన్నారు.
గాలికి దీపంపెట్టి దేవుడా అని మొక్కినట్లు కేసీఆర్ రూలింగ్ చేశారని, తాము ఇప్పుడు రహదారుల మరమ్మత్తుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నామన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ అందిపుచ్చుకోవడానికి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో 9 వేల కిలో మీటర్ల మేర రహదారులపై గుంతలు పూడుస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment