అసెంబ్లీలో టీడీపీ వికృత చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు. సంక్షోభంలో సంక్షేమం అంటున్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ‘సన్’క్షేమం (తన కొడుకు క్షేమం) కోసం పాటుపడ్డారు. అందుకోసం అధికారాన్నంతా ఉపయోగించారు.
ఈ విషయం గ్రహించిన ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీని పక్కనపెట్టారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసింది చంద్రబాబు కాదా?, కిలో బియ్యం రూ.2 నుంచి రూ.5.50కి పెంచింది బాబు కాదా? వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ పథకాలను మా ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంటే సంక్షేమం సంక్షోభమని ఆరోపిస్తారా? వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలే అజెండాగా ఎల్లో మీడియాలో ప్రచారం చేసినంత మాత్రాన నిజమైపోదు.
టీడీపీ వికృత చేష్టలు ప్రజలు చూస్తున్నారు
Published Wed, Sep 21 2022 4:45 AM | Last Updated on Wed, Sep 21 2022 4:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment