తూర్పుగోదావరి: సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.
మంత్రి వేణు మాట్లాడుతూ జక్కంపూడి ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో ఏడుగురు పని చేస్తామని తనతో పాటు తన ఇద్దరు కుమారులు, జక్కంపూడి కుటుంబంలోని నలుగురు కలిపి మొత్తం ఏడుగురు ఈ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అబివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహనరావు విశేష కృషి చేశారన్నారు.
డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నక్కా రాజబాబు, కడియం మండల జేసీఎస్ అధ్యక్షుడు తడాల చక్రవర్తి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యా ల పోసికుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, వైఎస్సార్ సీపీ నాయకులు దేశెట్టి హరిప్రసాద్, డాక్టర్ తోరాటి ప్రభాకరరావు, సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment