Jakkampudi Ramamohan Rao
-
ఒక్క ఓటుతో ఏడుగురం పనిచేస్తాం! : మంత్రి వేణు
తూర్పుగోదావరి: సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ప్రజా హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని జిల్లా ఇన్చార్జి మంత్రి, వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ధవళేశ్వరం పోలీస్‌స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. మంత్రి వేణు మాట్లాడుతూ జక్కంపూడి ఈ నియోజకవర్గం అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ఒక ఓటుతో ఏడుగురు పని చేస్తామని తనతో పాటు తన ఇద్దరు కుమారులు, జక్కంపూడి కుటుంబంలోని నలుగురు కలిపి మొత్తం ఏడుగురు ఈ నియోజవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత అబివృద్ధి కోసం జక్కంపూడి రామ్మోహనరావు ఏ విధంగా పనిచేశారో అదే విధంగా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కూడా పనిచేస్తారని తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ కో–ఆర్డినేటర్ గూ డూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి జక్కంపూడి రామ్మోహనరావు విశేష కృషి చేశారన్నారు. డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ విధేయత, విశ్వసనీయతకు మారుపేరు జక్కంపూడి కుటుంబం అని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు నక్కా రాజబాబు, కడియం మండల జేసీఎస్ అధ్యక్షుడు తడాల చక్రవర్తి, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ముద్దాల అను, వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ముత్యా ల పోసికుమార్, జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ షట్టర్ బాషా, వైఎస్సార్ సీపీ నాయకులు దేశెట్టి హరిప్రసాద్, డాక్టర్ తోరాటి ప్రభాకరరావు, సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలంటీర్లకు గుడ్ న్యూస్.. నేడు నగదు పురస్కారాలు -
జక్కంపూడి స్ఫూర్తితో ముందడుగు: మంత్రి దాడిశెట్టి రాజా
సాక్షి, రాజమహేంద్రవరం రూరల్: దివంగత మాజీమంత్రి జక్కంపూడి రామ్మోహనరావు రాజకీయ లక్షణాలను స్ఫూర్తిగా తీసుకుని తాను రాజకీయంగా ఎదిగానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గం తుని వెళ్తున్న ఆయనకు వేమగిరి నుంచి కంబాలచెరువు సెంటర్ వరకూ భారీగా మోటా ర్ సైకిళ్లు, కార్లతో ఘన స్వాగతం పలికారు. మంత్రి తొలుత బొమ్మూరులోని ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి ఇంటికి చేరుకున్నారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, శ్రీనివాసులురెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన గొందేశి పూర్ణచంద్రారెడ్డి చిత్రపటానికి దాడిశెట్టి రాజా పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీ ఐఎల్టీడీ ఫ్లై ఓవర్, రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడ మంత్రి దాడిశెట్టి రాజాను రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం పలికారు. కందుకూరి వీరేశలింగం జయంతి సందర్భంగా ఆ మహనీయునికి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేతల సహకారంతో ముందుకు తర్వాత స్టేడియం రోడ్డు మీదుగా ర్యాలీ తాడితోట, కంబాల చెరువు సెంటర్‌కు చేరుకుంది. అక్కడ దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు విగ్రహానికి మంత్రి దాడిశెట్టి రాజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్అండ్బీ మంత్రిగా రామ్మోహనరావు విశేష సేవలందించారన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ఎంపీ వంగా గీత, సోదరులు జక్కంపూడి రాజా, గణేష్, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ఉమ్మడి జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. కాకినాడ ఎంపీ వంగా గీత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్సార్ సీపీ రూరల్ కో ఆర్డినేటర్ చందన నాగేశ్వర్, మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, మానే దొరబాబు, నగర ఎస్సీసెల్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్, అడపా అనిల్, ముద్దాల అను, కోడికోట, ఆరిఫ్, జేకే అరుణ్, కేఆర్జే రాజేష్, గన్నవరపు సంజయ్, కనకాల రాజా తదితరులు పాల్గొన్నారు. మంత్రి ర్యాలీకి వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యం వహించారు. -
జక్కంపూడికి సీఎం జగన్ నివాళి
సాక్షి, అమరావతి : దివంగత నేత, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జక్కంపూడి తనయుడు ఎమ్యెల్యే జక్కంపూడి రాజా, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
జననేత జక్కంపూడి
సాక్షి, రాజమండ్రి :పేద ప్రజల సమస్యలపై స్పందించి వారికి అండగా నిలిచిన జననేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు అని పలువురు వక్తలు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జక్కంపూడి రామ్మోహనరావు 61వ జయంతిని బుధవారం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. నాడు వైఎస్ రాజశేరరెడ్డి పిలుపుమేరకు తమ తండ్రి ఏవిధంగా స్పందించి ప్రజా ఉద్యమాల్లో ముందున్నారో, అదే విధంగా నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చినా తమ కుటుంబం యావత్తూ ముందుండి నడిపిస్తుందని రామ్మోహనరావు కుమారుడు జక్కంపూడి రాజా అన్నారు. కంబాలచెరువు జక్కంపూడి చౌక్ వద్ద ఉన్న జక్కంపూడి విగ్రహం వద్ద ఆయన ఇద్దరు కుమారులు రాజా, గణేష్‌ల ఆధ్వర్యంలో జక్కంపూడి జయంతి నిర్వహించారు. పలువురు పార్టీ నేతలతో కలిసి జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం 61 కిలోల భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచారు. పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సుంకర చిన్ని, నగరపాలక సంస్థలో పార్టీ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలా రెడ్డి, కార్పొరేటర్లు మింది నాగేంద్ర, బొంతా శ్రీహరి, మజ్జి నూకరత్నం, పార్టీ స్టీరింగ్ కమిటీ సభ్యులు లంకా సత్యనారాయణ, ఎండీ ఆరిఫ్, యువజన విభాగం కన్వీనర్ గుర్రం గౌతం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గెడ్డం రమణ ఆధ్వర్యంలో రాజమండ్రి స్వర్ణాంధ్ర వృద్ధుల ఆశ్రమంలో స్వీట్లు పంచిపెట్టారు. జిల్లాలో ఘనంగా వేడుకలు మండపేటలో వైఎస్సార్ సీపీ వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు ఆధ్వర్యంలో పార్టీనేతలు అల్లూరి రామకృష్ణ, మేడిశెట్టి సూర్యభాస్కరరావు తదితరులు జక్కంపూడికి ఘనంగా నివాళులు అర్పించారు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరులో కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ధవళేశ్వరంలో విప్పర్తి వేణుగోపాల రావు ఇంటి వద్ద జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ధవళేశ్వరం బస్టాండ్‌సెంటర్‌లో, రాజమండ్రి రూరల్ మండలం తొర్రేడు, శాటిలైట్ సిటీ వద్ద జరిగిన కార్యక్రమాల్లో పార్టీ నేతలు కార్యకర్తలు జక్కంపూడికి ఘనంగా నివాళులు అర్పించారు. కడియం మండలం బుర్రిలంకలో పార్టీ నేతలు రావిపాటి రామచంద్రరావు, కొత్తపల్లి మూర్తి తదితరులు జక్కంపూడిని స్మరించుకున్నారు. కాకినాడ రూరల్ తిమ్మాపురంలోని గ్రీన్ ఫీల్డు అంధుల పాఠశాలలో వైఎస్సార్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు లింగం రవి తదితరులు పళ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. రాయుడుపాలెం వద్ద వద్ద పార్టీ నేత నాగరాణి ఇతర కార్యకర్తతో కలిసి వృద్ధులకు పళ్లు పంపిణీ చేశారు. ఏలేశ్వరంలో జేవీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో జువ్విన వీర్రాజు నేతృత్వంలో ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు రొట్టెలు, పాలు పంపిణీ చేశారు. కోరుకొండలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చింతపల్లి చంద్రం ఆధ్వర్యంలో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. రాజానగరం మండ లం రామస్వామిపేటలో గొర్రెల శివప్రసాద్ తన కుమార్తె సత్యకాంతతో కలిసి ఇంటిలోనే జక్కంపూడి జయంతి నిర్వహించి చుట్టుపక్కల వారికి స్వీట్లు పంపిణీ చేశారు. రంగా మిత్రమండలి ఆధ్వర్యంలో అమలాపురంలో కాటన్ పార్కు వద్ద ఉన్న జక్కంపూడి విగ్రహానికి పూలమాల వేసి నివాళుల అర్పించారు. బోడసకుర్రు-పాశర్లపూడి వంతెనకు జక్కంపూడి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు, పార్టీ జిల్లా కో ఆర్డినేటర్ మిండగుదిటి మోహన్, పట్ణణ పార్టీ యూత్ కన్వీనర్ గనిశెట్టి రమణ్‌లాల్, రంగా మిత్రమండలి అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రావులపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రామ్మోహనరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించాయి. మామిడికుదురు, పి.గన్నవరం తదితర ప్రాంతాల్లో జక్కంపూడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యుల జక్కంపూడి తాతాజీ స్వీట్లు పంచారు. సఖినేటిపల్లిలో కేక్ కట్ చేసి అందరికీ పంచారు.