
సాక్షి, తూర్పు గోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. అలాగే, టీడీపీ అధినేత చంద్రబాబు శకం ముగిసింది వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలపై పవన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
కాగా, మంత్రి చెల్లుబోయిన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రాజకీయ విలువలకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు, ఏపీలో టీడీపీతో పొత్తు దేనికి సంకేతం. పవన్‌ను టీడీపీ ఒక వస్తువుగా వాడుకుంటోంది. కాపు సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పవన్ ప్రయత్నం చేస్తున్నారు. ముద్రగడను చంద్రబాబు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. మరోసారి కాపు సామాజిక వర్గాన్ని మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు మోసానికి కాపులు నష్టపోతారని పవన్ గ్రహించాలి
రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది. చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నాడు. దేశంలో చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో ఉన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు నేడు బెయిల్ రావడం లేదు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్‌న ఏమీ చేయలేరు. జనం మనసులో జగనన్న ఉన్నాడు.. సీఎం జగన్ మనసులో జనం ఉన్నారు. జగన్, జనం బంధాన్ని ఎవరూ విడదయలేరు’ అని అన్నారు.
ఇది కూడా చదవండి: ‘మాధవీరెడ్డి.. నోరు అదుపులో పెట్టుకో.. విమర్శిస్తే సహించం’