సాక్షి, అమరావతి: సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. సీఎం నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోందని.. దేశంలో అధిక పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు.
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రోత్సాహం
ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. పరిపాలన సంస్కరణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. డీబీటీ ద్వారా రూ.1.98 లక్షల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వంపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
‘ఏపీ జీఎస్.డిపి 11.43 శాతంగా ఉంటే.. దేశ జీఎస్.డిపీ 8.7 % శాతం ఉంది. దేశ జీఎస్.డీపీ కంటే ఏపీ జీఎస్.డీపీ 2.73% శాతం ఎక్కువ. కోవిడ్ సమయంలో దేశం వృద్ది రేటు మైనస్ 6.60% ఉంది. మన రాష్ట్రం 0.08% శాతం వృద్దిరేటు ఉంది. దేశంలోనే తలసరి ఆదాయంలో ఏపీ 6వ స్థానంలో ఉంది. చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36 శాతమే. వైఎస్ జగన్ సీఎం సీఎం అయ్యాక వృద్ధి రేటు 11.43 శాతానికి చేరింది. వృద్ధి రేటు పెరిగితే అది అభివృద్ధి కాదా?
పరిశ్రమల స్థాపనలో ఏపీ మూడో స్థానం
డీపీఐఐపీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2022 జూలై చివరి నాటికి లక్షా 71వేల 285 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అందులో 40,361 కోట్ల పెట్టుబడులు ఏపీ సాధించింది. 2022 డిసెంబర్‌లో జగన్ పాలనలో 23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐ.పీబీ ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులు సాధించడంలో ఏపీది 5 వ స్థానం. పరిశ్రమల స్థాపనలో ఏపీది 3వ స్థానం. దక్షిణాదిరాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయాడు.
చదవండి: ‘సీబీఎన్’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్‌సీపీ నేత కొండా రాజీవ్
ఏపీ అగ్రస్థానం
పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీనే నెంబర్ 1. 2022 జూన్‌లో బీఆర్ఏపీ ఇచ్చిన రేటింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్ కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ పోటీ పడితే వెయ్యికోట్ల గ్రాంట్ ఏపీకి దక్కింది. ఎంఎస్ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యతను కల్పించాం. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీని పొడిగించాం
రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ. అమూల్ సహకారంతో పాడి రైతులు నష్టపోకుండా చూశాం. తన పరిపాలన కాలంలో అవాస్తవాలతో చంద్రబాబు పబ్బం గడుపుకున్నాడు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏపీకి ఏం కావాలో చంద్రబాబు చెప్పాడా. కనీసం చర్చల్లో పాల్గొన్నాడా? అనువైన ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేయలేదు.’ అని మంత్రి విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment