developements
-
హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు.. కేటాయింపులు ఇలా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురువారం తొలిసారి అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ బడ్జెట్‌ను రూ. 2,91,159 కోట్లుగా ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్ర అప్పు 6 లక్షల 71 వేల 757 కోట్లుగా ఉందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ. 35,118 కోట్ల అప్పు తీసుకోగా , రూ. 42 వేల కోట్ల బకాయిలు చెల్లించినట్లు వెల్లడించారు.రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు భారీగా రూ. 10 వేల కోట్లు కేటాయించారు. ఇందులో మెట్రో వాటర్ వర్స్ కోసం రూ. 3,385 కోట్లు, జీహెచ్ఎంసీకి రూ. 3,065కోట్లు, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం రూ.1500 కోట్లు, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రూ.1,525 కోట్లు.పాతబస్తీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డుకు రూ.200 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు, శంషాబాద్ విమానాశ్రయం కోసం రూ. 100 కోట్లు, హెచ్ఎండీేఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, హైడ్రా సంస్థకు రూ.200 కోట్లు కేటాయించారు. మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు, ఎంఎంటీఎస్ రూ. 50 కోట్లు కేటాయించారు.ఈ సందర్భంగా మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న చారిత్రాత్మక నగరం హైదరాబాద్‌ను మరింత ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర ప్రాధాన్యం దృష్ట్యా నగరాభివృద్ధికి మరింత పెద్దపీట వేశామని తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి మరింత వేగంగా జరగబోతోందని, అందుకే బడ్జెట్ ఫోకస్ ఎక్కువగా సిటిపై పెట్టామని అన్నారు. -
దక్షిణాదిలోనే విశాఖ ఇనార్బిట్ మాల్ అతిపెద్దది
Updates: ► ఏయూ నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు బయల్దేరిన సీఎం వైఎస్ జగన్. ► ఆంధ్ర యూనివర్సిటీలో నూతన భవనాలను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజిని, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ ప్రసాద్ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే కన్నబాబు రాజు పాల్గొన్నారు. ►జీవీఎంసీ పరిధిలో రూ. 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు.\ ఇనార్బిట్ మాల్తో 8 వేల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. 13 ఎకరాల్లో విశాలంగా ఇనార్బిట్ మాల్ తయారు కాబోతుందని తెలిపారు. దక్షిణాదిలోనే విశాఖ మాల్ అతిపెద్దదని... రెండున్నర ఎకరాలను ఐటీ కోసం కేటాయిస్తారని పేర్కొన్నారు. విశాఖ అభివృద్ధికి ఈ మాల్ దోహదపడుతుందని.. మాల్ నిర్మాణంతో రాబోయే రోజుల్లో విశాఖ రూపురేఖలు మారిపోతాయని పేర్కొన్నారు. ►విశాఖలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయే ప్రాజెక్టు ఇనార్బిట్ మాల్: సీఎం జగన్ ► ఫైవ్ స్టార్ హోటల్ కూడా నిర్మించాలని రహేజా గ్రూప్ ఆసక్తిగా ఉంది. ► రహేజా గ్రూప్‌కు అన్ని విధాలుగా సపోర్టు ఇస్తాం. ► ఒక్క ఫోన్‌కాల్‌తో అందుబాటులో ఉంటాం. 👉విశాఖలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేశారు. రూ. 600 కోట్లతో 15 ఎకరాల స్థలంలో మాల్‌ను నిర్మిస్తున్నారు. జీవీఎంసీ చేపట్టిన రూ. 136 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు. 👉విశాఖపట్నం చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు పూల వర్షంతో విశాఖ వాసులు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఆయనకు ధన్యవాదాలు తెలిపేందుకు మహిళలు భారీగా తరలి వచ్చారు. 👉 గన్నవరం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలలో సీఎం పాల్గొననున్నారు. సాక్షి, అమరావతి: దేశంలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్‌కు విశాఖ వేదిక కానుంది. 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో కె.రహేజా గ్రూపు అభివృద్ధి చేయనున్న ఇనార్బిట్ మాల్ తొలి దశ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. దీనికి అదనంగా పార్కింగ్ కోసం ఏకంగా నాలుగు లక్షల చదరపు అడుగులను అభివృద్ధి చేయనున్నారు. 2026 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలని రహేజా గ్రూపు నిర్దేశించుకుంది. 250కిపైగా అంతర్జాతీయ బ్రాండ్లకు వేదికగా మారనున్న ఈ మాల్ ద్వారా 8,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మాల్ నిర్మాణం కోసం పోర్టు అథారిటీకి చెందిన 17 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. రెండో దశలో ఐటీ క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తారు. 3,000 మంది పనిచేసే విధంగా సుమారు 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను 2027 నాటికి అందుబాటులోకి తెస్తారు. మూడో దశలో ఫోర్ స్టార్ లేదా ఫైవ్ స్టార్ హోటల్‌ను 200 గదులు, బాంకెట్ హాళ్లతో నిర్మిస్తారు. పూర్తి పర్యావరణహితంగా భవనాన్ని నిరి్మంచనున్నట్లు రహేజా గ్రూపు వెల్లడించింది. నేడు ఏయూలో పలు ప్రారంభోత్సవాలు విశాఖ పర్యటన సందర్భంగా మొత్తం రూ.864.88 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు నిర్వహించనున్నారు. రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు ఎనెక్స్ సెంటర్స్, ప్రోటోటైపింగ్/మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్ మానిటరింగ్ హబ్‌ను సీఎం ప్రారంభిస్తారు. చదవండి: ఈనాడు బురద రాతలు.. వరద సహాయక చర్యలపైనా అక్కసు డిజిటల్ క్లాసులు, డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్ ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ అవంతి ఆక్వా కల్చర్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు. వీటిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి విద్యార్థులతో సంభాషిస్తారు. నూతన భవనాల ద్వారా 2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద ఇంక్యుబేటర్ హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్‌ను నమోదు చేస్తుందని అంచనా. ఈ హబ్స్ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆరి్థక వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది. భారీ మానవహారంతో స్వాగతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 10.45 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని రోడ్డుమార్గంలో సాలిగ్రామపురం వెళతారు. అక్కడ రూ.600 కోట్ల వ్యయంతో రహేజా గ్రూప్స్ ఇనార్బిట్ మాల్‌కు భూమి పూజ చేస్తారు. అనంతరం నగరంలో జీవీఎంసీ చేపడుతున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, స్మార్ట్ రోడ్డు, యూరోపియన్ తరహా ఈట్ స్ట్రీట్స్, అమృత్ 2.0లో భాగంగా చెరువుల అభివృద్ధి లాంటి రూ.135.88 కోట్ల విలువైన 50 పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. చదవండి: నారీ శక్తికి 'చేయూత' అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్ చేరుకొని విద్యార్థులకు కొత్త కోర్సులు, ఉపాధి అవకాశాలు, స్టార్టప్‌లకు చేయూతనందించేలా రూ.129 కోట్లతో నిరి్మంచిన ఐదు భవనాలను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు బీచ్ రోడ్డు నుంచి బయలుదేరి 1.40కి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 1.50 గంటలకు విశాఖ నుంచి తిరుగు పయనమవుతారు. విశాఖ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌కు ఘన స్వాగతం పలికేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్మాల్ను నిర్మించే సాలిగ్రామపురం వరకు దాదాపు 9 కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మానవహారంగా ఏర్పడి సీఎం జగన్‌కు స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను నెడ్‌క్యాప్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త కేకే రాజు పర్యవేక్షిస్తున్నారు. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సరికొత్తగా విశాఖ పోర్టు.. ‘ల్యాండ్ లార్డ్ పోర్టు’ దిశగా అడుగులు
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విశాఖపట్నం పోర్టు అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. దేశంలోని మేజర్ పోర్టుల్లో 4వ స్థానానికి ఎగబాకిన విశాఖ పోర్టు అథారిటీ.. నంబర్ వన్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేస్తోంది. రూ.755 కోట్ల వ్యయంతో పోర్టు ఆధునికీకరణ పనులను చేపట్టింది. బెర్తుల ఆధునికీకరణ, సామర్థ్య విస్తరణతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వివిధ జెట్టీల ద్వారా మాంగనీస్, బొగ్గు, జిప్సం, బాక్సైట్ తదితర ఖనిజాలు, ఇతర ప్రధాన ఉత్పత్తుల రవాణా జరుగుతోంది. భవిష్యత్‌లో వీటి రవాణా సామర్థ్యం పెరిగే అవకాశం ఉన్నందున జెట్టీల సామర్థ్యాన్ని విశాఖ పోర్టు అధికారులు పెంచుతున్నారు. అలాగే రైల్వేల ద్వారా కార్గో హ్యాండ్లింగ్‌ను వేగవంతం చేసేందుకు కూడా వివిధ పనులు చేపట్టారు. పోర్టులోని ఆర్అండ్డీ యార్డులో వ్యక్తిగత క్యాబిన్ల నిర్మాణం, ప్యానెల్ ఇంటర్‌లాకింగ్ ద్వారా యార్డును రైల్వే ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేస్తున్నారు. రాత్రి సమయంలో కూడా జనరల్ కార్గో బెర్త్ వద్ద కేప్ సైజ్ షిప్‌లను సైతం నిలుపుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇన్నర్ హార్బర్, ఔటర్ హార్బర్లో సింగిల్ బీమ్ ఎకో సౌండర్ను మల్టీబీమ్‌గా అప్‌గ్రేడ్ చేశారు. పోర్టులో మొత్తం 29 బెర్తులుండగా.. ఇందులో 8 బెర్తులు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నడుస్తున్నాయి. త్వరలో మరో 3 బెర్తులను కూడా పీపీపీ కింద ఇచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయి. ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా అంతర్గత నౌకాశ్రయంలోని డబ్ల్యూక్యూ–7, డబ్ల్యూక్యూ–8, ఈక్యూ–7, ఈక్యూ–6 బెర్త్‌ల యాంత్రీకరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. చమురు రవాణాకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో చేపట్టిన ఇన్నర్ హార్బర్లోని ఓఆర్–1, 2 బెర్తుల అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. అలాగే వివిధ మౌలిక వసతులతో మూడు స్టోరేజీ షెడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. -
సీఎం జగన్ నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు: మంత్రి వేణు
సాక్షి, అమరావతి: సంక్షేమం ,అభివృద్దిని రెండు కళ్లలా ప్రభుత్వం పరిపాలన చేస్తోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని కొనియాడారు. సీఎం నేతృత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు తీస్తోందని.. దేశంలో అధిక పెట్టుబడులను సాధించిన రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్నారు. ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రోత్సాహం ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని మంత్రి తెలిపారు. పరిపాలన సంస్కరణలో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యమని పేర్కొన్నారు. డీబీటీ ద్వారా రూ.1.98 లక్షల కోట్లు అందించామన్నారు. ప్రభుత్వంపై టీడీపీ అవాస్తవాలను ప్రచారం చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ‘ఏపీ జీఎస్.డిపి 11.43 శాతంగా ఉంటే.. దేశ జీఎస్.డిపీ 8.7 % శాతం ఉంది. దేశ జీఎస్.డీపీ కంటే ఏపీ జీఎస్.డీపీ 2.73% శాతం ఎక్కువ. కోవిడ్ సమయంలో దేశం వృద్ది రేటు మైనస్ 6.60% ఉంది. మన రాష్ట్రం 0.08% శాతం వృద్దిరేటు ఉంది. దేశంలోనే తలసరి ఆదాయంలో ఏపీ 6వ స్థానంలో ఉంది. చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36 శాతమే. వైఎస్ జగన్ సీఎం సీఎం అయ్యాక వృద్ధి రేటు 11.43 శాతానికి చేరింది. వృద్ధి రేటు పెరిగితే అది అభివృద్ధి కాదా? పరిశ్రమల స్థాపనలో ఏపీ మూడో స్థానం డీపీఐఐపీ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 2022 జూలై చివరి నాటికి లక్షా 71వేల 285 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అందులో 40,361 కోట్ల పెట్టుబడులు ఏపీ సాధించింది. 2022 డిసెంబర్లో జగన్ పాలనలో 23,985 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐ.పీబీ ఆమోదం తెలిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే పెట్టుబడులు సాధించడంలో ఏపీది 5 వ స్థానం. పరిశ్రమల స్థాపనలో ఏపీది 3వ స్థానం. దక్షిణాదిరాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయాడు. చదవండి: ‘సీబీఎన్’ అంటే కొత్త అర్థం చెప్పిన వైఎస్సార్సీపీ నేత కొండా రాజీవ్ ఏపీ అగ్రస్థానం పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయి. నాలుగేళ్ల నుంచి ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీనే నెంబర్ 1. 2022 జూన్‌లో బీఆర్ఏపీ ఇచ్చిన రేటింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్ కోసం దక్షిణాది రాష్ట్రాలన్నీ పోటీ పడితే వెయ్యికోట్ల గ్రాంట్ ఏపీకి దక్కింది. ఎంఎస్ఎంఈలకు మార్కెట్లో విస్తృత ప్రాధాన్యతను కల్పించాం. కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీని పొడిగించాం రైతులను ఆదుకోవడానికి ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. రైతులు మోసపోకుండా చర్యలు తీసుకున్న ఏకైక రాష్ట్రం ఏపీ. అమూల్ సహకారంతో పాడి రైతులు నష్టపోకుండా చూశాం. తన పరిపాలన కాలంలో అవాస్తవాలతో చంద్రబాబు పబ్బం గడుపుకున్నాడు. రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఏపీకి ఏం కావాలో చంద్రబాబు చెప్పాడా. కనీసం చర్చల్లో పాల్గొన్నాడా? అనువైన ప్రాంతాన్ని చంద్రబాబు రాజధానిగా ఎంపిక చేయలేదు.’ అని మంత్రి విమర్శించారు. -
ఎయిర్పోర్ట్ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఇవీ సదుపాయాలు..
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ హంగులను సంతరించుకుంటున్న నగరంలో మరో అద్భుతమైన కట్టడం ఆవిష్కృతం కానుంది. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం తరహాలో అందుబాటులోకి రానుంది. 1870లలో నిర్మించిన రైల్వే స్టేషన్ కళాత్మకతకు ఏ మాత్రం విఘాతం కలగకుండా దీని పునరభివృద్ధికి దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. వాస్తవానికి ఒకటిన్నర దశాబ్దం క్రితమే సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో పునరభివృద్ధికి నిర్మాణ సంస్థలను ఆహా్వనించినప్పటికీ ప్రైవేట్ సంస్థలు నిరాసక్తత వ్యక్తం చేశాయి. దీంతో దక్షిణమధ్య రైల్వే స్వయంగా ఈ ప్రాజెక్టును చేపట్టింది. రానున్న 36 నెలల్లో పునరభివృద్ధి చేసేవిధంగా కాంట్రాక్ట్‌కు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సికింద్రాబాద్ స్టేషన్ వద్ద భూసార పరీక్షలను సైతం నిర్వహించారు. సుమారు రూ.653 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులకు ఈ నెల 19న ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రయాణికుల సేవలో.. నాన్ సబర్బన్ గ్రేడ్ –1 (ఎన్ఎస్జీ1) కేటగిరీకి చెందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణం చేస్తారు. రోజుకు 200 రైళ్లు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. పండుగలు, వేసవి సెలవులు, ఇతర ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల రద్దీ 2.3 లక్షల వరకు చేరుకుంటుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు ముఖద్వారంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్ నుంచి దక్షిణమధ్య రైల్వేకు ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. 2008లోనే వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. వరుసగా బడ్జెట్లలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినప్పటికీ నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో తీవ్రమైన జాప్యం చోటుచేసుకుంది. మూడేళ్ల క్రితం ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. కానీ ముందుకు సాగలేదు. దీంతో దేశవ్యాప్తంగా ప్రధాన స్టేషన్ల పునరభివృద్ధిలో భాగంగా ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధికి కార్యాచరణ మొదలైంది. స్టేషన్ భవనాలను, మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సేవలన్నింటినీ ఆధునికీకరించి ఎయిర్‌పోర్టు తరహాలో ప్రయాణికులకు సీమ్‌లెస్ సర్వీసులను అందజేయడం ఈ సమీకృత స్టేషన్ పునరభివృద్ధిలో భాగం.ఈపీసీ మొడల్‌లో టెండర్లను ఖరారు చేశారు. ఇవీ సదుపాయాలు.. - ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా సాఫీగా ప్రయాణం చేసేలా స్టేషన్ పునరభివృద్ధి చేపట్టనున్నారు. సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో తదితర ప్రజారవాణా మార్గాల్లో ప్రయాణికులు స్టేషన్‌కు రాకపోకలు సాగించేలా కనెక్టివిటీని పెంచడం ప్రధాన లక్ష్యం. పార్కింగ్ ఇబ్బందులను తొలగిస్తారు. - స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్‌మాల్స్,ఇతర వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేస్తారు. కొత్త స్టేషన్ భవనంలో ఉత్తరం వైపు జీ+3 అంతస్థులు, దక్షిణం వైపు జీ+3 అంతస్తుల భవనాలను నిర్మిస్తారు. లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తారు. ఉత్తరం వైపు మలి్టలెవల్ పార్కింగ్ సదుపాయం ఉంటుంది, దక్షిణం వైపు అండర్‌గ్రౌండ్ పార్కింగ్ ఏర్పాటు చేయనున్నారు. - రెండు వైపులా రాకపోకలు సాగించే విధంగా 7.5 మీటర్ల వెడల్పుతో 2 నడక దారులను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్ వెస్ట్ మెట్రో స్టేషన్లకు చేరుకొనేందుకు స్కైవేలను అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లకు పూర్తిగా పైకప్పులు వేస్తారు. స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి వెళ్లేందుకు వేరు వేరు ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. మరోవైపు స్టేషన్లో సుమారు 5000 కిలోవాట్స్ పవర్ సామర్థ్యం కలిగిన సోలార్ పవర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
Hyderabad: చారిత్రక సంపదకు నయా నగిషీలు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిజాం హయాంలో నిర్మించిన ఆనేక కట్టడాలకు నగిషీలు చెక్కడం ద్వారా భావితరాలకు చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, క్లాక్‌టవర్లు, బన్సీలాల్‌పేట బావిని పునరుద్ధరించిన పురపాలక శాఖ.. తాజాగా ముర్గీ చౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్‌లకు నయా సొబగులను అద్దాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా చెప్పుకునే చార్మినార్, దాని పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ మూడింటిని పునరుద్ధరించే పనులను చకచకా చేస్తోంది. కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. వడివడిగా మీరాలంమండి పనులు నగర ప్రజల కూరగాయ అవసరాలను తీర్చడానికి 1805లో అప్పటి ప్రధాని నవాబ్ మీర్ అలం యార్జంగ్ మీరాలం మండిని ప్రారంభించారు. హైదరాబాద్ తొలి మార్కెట్‌గా చెప్పుకొనే ఈ మండి.. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాల్లేక.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.16.45 కోట్లను కేటాయించారు. మార్కెట్‌ను మూడు విభాగాలు విభజించి.. దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. సర్దార్ మహల్ పునరుద్ధరణ.. 1900లో యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించిన సర్దార్ మహల్ చారిత్రక కట్టడం. నిర్వహణ లేక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వ వైభవం తేవడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. భవనం శైలి దెబ్బ తినకుండా ఆధునికీకరించనున్నారు. ఈ భవనంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పురపాలకశాఖ.. అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయించింది. చదవండి: ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి శిథిలావస్థలో ముర్గీచౌక్.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కోళ్ల మండి (ముర్గీ చౌక్)ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో ఏర్పడింది. చికెన్‌తో పాటు మాంసాన్ని సైతం ఇక్కడ విక్రయించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. కాల గమనంలో ఈ మండి శిథిలావస్థకు చేరింది. పురాతన కట్టడాలు పెచ్చులు ఊడిపోయి, రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ముర్గీచౌక్ అధ్వానంగా తయారైంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని ‘కుడా’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.36 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రౌండ్ ప్లస్ భవనాన్ని నిర్మించాలని, దిగువన మార్కెట్.. పై అంతస్తులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్కెట్‌ను అక్కడి నుంచి సమీపంలోని మైదానంలోకి షిఫ్ట్ చేసింది. దీన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్వ వైభవం తెస్తాం.. నిజాం పాలన హయాంలో నిర్మించిన కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రణాళిక రూపొంచింది. చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల సలహాలు, సూచనలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. తొలుత ముర్గీచౌక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. మీరాలంమండి, సర్దార్ మహల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. – బాదావత్ సంతోష్, కుడా అడ్మినిస్ట్రేటర్ గడువులోగా పనులు పూర్తి చేస్తాం.. ముర్గీచౌక్ మార్కెట్ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్లోని వ్యాపారులను సమీప మైదానంలోకి తరలించాం. టెండర్ ప్రక్రియ ద్వారా పనులను కేటాయించాం. ఉన్నత అధికారుల ఆదేశాలు.. ప్లాన్ ప్రకారం పనులు అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నాం. నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. – జి.గురువీర, కుడా సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ చదవండి: తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? -
కోమరంభీం జిల్లాలో టీఆర్ఎస్కు షాకిచ్చిన నేతలు... లేఖలో ఆవేదన
సాక్షి, కొమరంభీం జిల్లా: కోమరంభీం జిల్లాలోని బెజ్జూర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మండలంలోని పలు అభివృద్ధి పనులు జరగడం లేదని పలువురు ప్రజా ప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇచ్చిన హమీలు నేరవేయడం లేదని ముగ్గురు సర్పంచ్‌లు, జడ్పీటీసీ పుష్పలత, ఎంపీటీసీతో పాటు కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్, బెజ్జూర్ సహాకర సంఘం డైరెక్టర్ రాజీనామా చేశారు. ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించకపోడవం వల్లే రాజీనామా చేశామని సదరు ప్రజా ప్రతినిధులు తెలిపారు. ఈమేరకు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికి లేఖ రాశారు. -
శతమానం భారతి: ప్రగతి పథంలో పరుగుతు తీస్తున్న జమ్మూకశ్మీర్
మూడేళ్ల క్రిందట ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం.. దశాబ్దాల అంతరాన్ని అంతం చేస్తూ ప్రగతిలో వెనుకబడి ఉన్న జమ్ము, కశ్మీర్, లద్దాఖ్ లకు ఆర్టికల్ 370 నుంచి విముక్తి కల్పిం చింది. దీంతో ‘ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్’ భావన మరింత బలం పుంజుకుంది. జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని ఇస్తున్న రాజ్యాంగం లోని 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం అంటే, స్వతంత్ర భారతదేశానికి పునరేకీకరణ శక్తిని ఇవ్వడమే. ఈ నేపథ్యంలో గడిచిన మూడేళ్లుగా జమ్ము కశ్మీర్ ప్రగతి పథంలో శరవేగంతో పరుగులు తీస్తోంది. అక్కడి ఉపాధి, సౌభాగ్యాలకు కొత్త ఉత్తేజం లభించింది. జమ్ము కశ్మీర్‌కు 7 కొత్త వైద్య కళాశాలలు, 5 కొత్త నర్సింగ్ కళాశాలు మంజూరు అయ్యాయి. వైద్య కోర్సులలో సీట్ల సంఖ్య 500 నుంచి దాదాపుగా రెట్టింపు అయింది. జల విద్యుత్ ప్రాజక్టులు ఉద్పాదన ప్రారంభించాయి. వాటి ద్వారా పరిశ్రమ లకు ప్రయోజనంతో పాటు ఆ ప్రాంతాల రాబడీ పెరుగుతోంది. వ్యవసాయ రంగ ప్రగతితో కూడా ఆదాయం పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తోంది. జమ్ము, కశ్మీర్లో కొత్తగా అమలవుతున్న ‘ఒకే దేశం.. ఒకే రేషన్ కార్టు’ పథకం సగటు ప్రజల జీవితాలను సులభతరం చేసింది. జమ్ముకశ్మీర్‌లో ఉజ్వల, డి.బి.టి., సౌభాగ్యం వంటి అనేక పథకాలు 100 శాతం అమలవుతున్నాయి. 2024 కల్లా ఆ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ సురక్షిత తాగునీరు అందించాలని సంకల్పించిన ప్రభుత్వం.. రెండేళ్ల ముందుగానే ఈ ఆగస్టు 15 కల్లా పూర్తి లక్ష్యాన్ని నెరవేర్చనుంది! దేశంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద ప్రతి వ్యక్తీ లబ్ది పొందిన ఏకైక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతం.. జమ్ము కశ్మీర్ మాత్రమే కావడం విశేషం. -
తెలంగాణ అవతరణ దినోత్సవం.. ఎనిమిదేళ్ల అసంతృప్తి
సబ్బండ వర్ణాల పోరాటం, ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎనిమిదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి మొదటిసారి జిల్లా ప్రజాపరిషత్ విజయాన్ని అందించి నిజామాబాద్ జిల్లా ఊపిరిలూదింది. ఇలాంటి జిల్లా వ్యవసాయంలో అగ్రభాగంలో ఉండి తలమానికంగా నిలుస్తోండగా.. అనుబంధ పరిశ్రమలు, యూనిట్ల ఏర్పాటు ముందుకు కదలడం లేదు. ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించే అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడడం లేదు. జిల్లాలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కనిపించడం లేదు. దీంతో జిల్లా ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, నిజామాబాద్: ప్రసిద్ధి గాంచిన బోధన్‌లోని నిజాంషుగర్స్ ఫ్యాక్టరీ జిల్లాలో ఎకానమీకి గతంలో మంచి ఊతం ఇస్తూ వచ్చింది. అయితే 2015లో ఫ్యాక్టరీ మూతపడింది. దీన్ని ఇప్పటి వరకు తెరిపించడం లేదు. దీంతో గతంలో 60వేల ఎకరాల్లో చెరుకు సాగు చేసిన రైతులు అనివార్యంగా వరి పంట వేయాల్సి వస్తోంది. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించే ఫ్యాక్టరీని తెరిపించాలని అన్నివర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పాటు సారంగాపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీని సైతం తెరవాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఇథనాల్‌కు డిమాండ్ ఉన్న నేపథ్యంలో వాటిని తెరిపిస్తే మేలంటున్నారు. ఉమ్మెడ వంతెనకు అప్రోచ్ రోడ్ ఎప్పుడో.. నిర్మలౖ–నిజామాబాద్ జిల్లాలను కలిపే మహారాష్ట్ర వెళ్లే రహదారిపై నందిపేట మండలం ఉమ్మెడ–పంచగుడ మధ్య గోదావరిపై వంతెన నిర్మించారు. అయితే వంతెనకు అటువైపు డబులై రోడ్డు పూర్తయి ఏళ్లు గడుస్తున్నాయి. గత ఐదేళ్లుగా ఇటువైపు నందిపేట మండలంలో వంతెన పైకి వెళ్లే అప్రోచ్∙రోడ్డు పనులు నిలిపోయాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఈ కొద్దిమేర రోడ్డు పూర్తయితే లక్కంపల్లి సైతం మరింత ఊతం లభిస్తుంది. రాకపోకలు పెరిగి ఈ ప్రాంతంలో వ్యాపారాలు పెరిగే అవకాశాలున్నాయి. శ్రీరాంసాగర్ జలాశయం పునరుజ్జీవం అటకెక్కింది. గతంలో 120 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయం ప్రస్తుతం 80 టీఎంసీల లోపునకు పడిపోయింది. మరోవైపు శ్రీరాంసాగర్ బ్యాక్ వాటర్ నుంచి నందిపేట మండలంలోని గ్రామాల వద్ద కాటేజీలు నిర్మించడంతో పాటు, బాసర వరకు బోటింగ్ సౌకర్యం కల్పించాలనే ప్రతిపాదనలు అటకెక్కాయి. అంచనాలు పెంచడమేనా.. నిజామాబాద్ నగరం విషయానికి వస్తే ఇక్కడ రూ. వందల కోట్ల పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.240 కోట్ల విలువైన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ఏళ్లతరబడి నత్తనడకను తలపిస్తున్నాయి. రూ.4 కోట్ల నుంచి రూ.22 కోట్లకు అంచనాలు పెంచుతూ వచ్చిన బొడ్డెమ్మ చెరువు పనులు ఇప్పటివరకు పూర్తి కాలేదు. హైదరాబాద్ రోడ్డులో కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. జక్రాఉ పల్లి వద్ద విమానాశ్రయం కోసం కేంద్రం నుంచి అనుమతులు వచ్చినపటికీ దాని ఊసే లేదు. ఇదిలా ఉండగా నగరంలో వరద నీరు వెళ్లేందుకు సహజసిద్ధంగా ఏర్పడిన పులాంగ్ వాగును అధికార పార్టీ నేతలే అనేక చోట్ల కబ్జాలు చేయడంతో అది కాస్తా పిల్లకాలు వలాగా మారిపోయింది. దీంతో నగరం భవిష్యత్తులో వరద ముంపునకు మరింత గురయ్యే అవకాశాలున్నట్లు పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లెదర్ పార్క్ భవనంతో సరి.. ఆర్మూర్ యానంగుట్ట వద్ద లెదర్ పార్క్ కోసం గతంలో జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో 24 ఎకరాలు కేటాయిం^éరు. భవనం కట్టి వదిలేశారు. మరోవైపు వేల్పూరు మండలం పడగల్ వద్ద స్పైసెస్ పార్క్ కోసం సేకరింన 70 ఎకరాల భూమిలో ప్రహరీ కట్టి వదిలేశారు. ఆ తరువాత ఇది అటకెక్కింది. ధర్పల్లిలో 2008లో పసుపు పరిశోధన కేంద్రం పేరిట కట్టిన భవనం అలాగే వదిలేశారు. ఇక భీమ్ గల్లో గతంలో ఉన్న బస్ డిపో ఎత్తేశారు. ● క్కంపల్లి సెజ్‌లో.. నందిపేట మండలం లక్కంపల్లి వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో 378 ఎకరాల్లో సెజ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక పరిశ్రమ లకు అవకాశాలున్నప్పటికీ ఆ దిశగా ప్రయత్నాలు జరుగలేదు. కనీసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సైతం అవకాశాలు రాలేదు. దీంతోయువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. -
ఆగేదే లే! ముందుకెళ్లాల్సిందే.. మంత్రి కేటీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాన సమస్యలకు ప్రధాన కారణమైన నాలా పనులపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. వానొలొచ్చినప్పుడు ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించేందుకు వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) కింద పనులు చేసేందుకు రూ.858 కోట్లు మంజూరు చేసింది. వివిధ కారణాలతో ఇటీవలి కాలం వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. వర్షాకాలంలోగా ఆ పనుల్ని పూర్తి చేయాల్సి ఉంది. అంటే నాలుగు నెలల్లోగా పనులు జరగాలి. అన్నీ అసాధ్యం కావడంతో అత్యంత సమస్యాత్మక, కీలక ప్రాంతాల్లోని పనులు ప్రాధాన్యతతో చేపడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనులకు టెండర్లు ఖరారయ్యాక అంగీకార పత్రం (ఎల్ఓఏ) కోసం కమిషనరేట్ ఆఫ్ టెండర్స్‌కు (సీఓటీ) పంపించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. అక్కడి నుంచి ఎల్ఓఏ వచ్చాకే కాంట్రాక్టర్లు పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ తతంగమంతా జరగడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టనుండటం, వర్షాకాలానికి ఇక ఎంతో సమయం లేకపోవడంతో, ఎల్‌ఓఏలు వచ్చేంతదాకా ఆగకుండా టెండర్లు ఖరారైన కాంట్రాక్టర్లతో పనులు చేయించాలని అధికారులకు మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. నాలా పనుల పురోగతిపై తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న మంత్రి దృష్టికి ఈ అంశం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్ఓఏ రాకముందే డీమ్డ్ అప్రూవల్‌గా భావించి పనులు చేయించాల్సిందిగా అధికారులకు సూచించినట్లు తెలిసింది. వేసవి కాలంలోగా వీలైనన్ని పనుల్ని పూర్తిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: పేద విద్యార్థినుల కల నిజం చేసిన కేటీఆర్ దీంతోపాటు పనుల్ని త్వరితంగా చేసేందుకు టెండర్ల సమయాన్ని సైతం రెండు వారాల బదులు ఒకవారం గడువుతో పిలవాలని సూచించినట్లు సమాచారం. ఇంజినీరింగ్ నిబంధనల మేరకు అత్యవసర పనులకు వారం రోజుల వ్యవధితో స్వల్పకాలిక టెండర్లు పిలవవచ్చు. నాలా పనులు సైతం అత్యవసరమైనవే అయినందున వారం గడువుతో స్వల్పకాలిక టెండర్లు పిలవాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టేందుకు 55 ప్యాకేజీలుగా పనుల్ని ఖరారు చేయగా, వాటిల్లో 27 ప్యాకేజీల అంచనా వ్యయం రూ.10 కోట్లకు పైగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. -
2020–21 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో చేసిన పనులివే
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం కరోనా మహమ్మారి, లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో సైతం జీహెచ్ఎంసీ బాగా పనిచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను అనువుగా మలచుకొని రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేశారని ప్రశంసించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చేయబోయే పనుల్లో నగరానికి వరదముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.858.32 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనుల్ని 15 ప్యాకేజీల కింద చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.240 కోట్లతో జవహర్‌నగర్‌లో చెత్త నుంచి వెలువడే హానికర ద్రవాల (లీచెట్) శుద్ధి పనుల్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 11 కి.మీ.లింక్ రోడ్లు (రూ.275 కోట్లు)18 ఎఫ్‌ఓబీలు పూర్తికాగలవని పేర్కొన్నారు. 90 చెత్త సేకరణ, తరలింపు కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన మునిసిపల్ శాఖ వార్షిక నివేదికలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీలో చేసిన పనుల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.... ► రూ.184 కోట్లతో దుర్గంచెరువుపై కేబుల్ బ్రిడ్జి. ►ప్రాజెక్టు పనుల కింద రూ.503.28 కోట్ల విలువైన 10 రోడ్డు ప్రాజెక్టులు పూర్తి . ►జీడిమెట్లలో రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణ, వ్యర్థాల కూల్చివేతల ప్లాంట్ ఏర్పాటు. ►దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా 19.8 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని ద్వారా ఇప్పటి వరకు 109.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ►జవహర్‌నగర్‌లో 135 ఎకరాల్లోని 12 మిలియన్ టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా క్యాప్ చేయడం జరిగింది. దీని వ్యయం రూ.144 కోట్లు. ►టీడీఆర్ ద్వారా జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం తగ్గింది. 2020–21లో 129 టీడీఆర్ ధ్రువపత్రాలు జారీ. ►టీఎస్ బీపాస్ ద్వారా బల్దియా పరిధిలో 11,538 భవనాలకు నిర్మాణ అనుమతుల ద్వారా రూ.797.13 కోట్ల ఆదాయం వచి్చంది. ►అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా 2.53 కోట్ల భోజనాల పంపిణీ. ►16 గ్రీన్‌ఫీల్డ్ లింక్‌రోడ్లు (13.56 కి.మీ.) వినియోగంలోకి వచ్చాయి. వ్యయం రూ.154 కోట్లు. ►నాలా నెట్వర్క్ బలోపేతానికి ఎస్ఎన్డీపీ ఏర్పాటు. ►కరోనా..లాక్ డౌన్ సమయాన్ని సది్వనియోగం చేసుకొని 9 నెలల్లో జరగాల్సిన పనులు 2–3 నెలల్లోనే పూర్తి. ►సీఆర్ఎంపీ ద్వారా 383.44 కి.మీ.ల రోడ్ల రీకార్పెటింగ్. అందుకైన వ్యయం రూ.457 కోట్లు. ►ఇతరత్రా నిర్వహణ పనులు 10,670 మంజూరుకాగా, 5850 పనుల్ని రూ.1020.41 కోట్లతో పూర్తిచేసినట్లు తెలిపారు. ► ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్ వద్ద మూడు ఎఫ్‌ఓబీలు పూర్తి. జలమండలి పరిధిలో.. ►2 వేల చ.కి.మీ పరిధిలో విస్తరించిన నగరానికి నిత్యం జలమండలి 522.87 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ►నగరంలో నిత్యం వెలువడుతున్న 1950 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని సమర్థవంతంగా శుద్ధి చేస్తోంది. ► జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు ఇప్పటివరకు 4.1 లక్షల మంది తమ ఆధార్ కార్డులను క్యాన్నెంబర్లకు అనుసంధానం చేసుకున్నారు. ఈ పథకంతో 9.7 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. ►వేసవిలో కృష్ణా మూడు దశల పథకాలకు అవసరమైన తాగునీటిని సేకరించేందుకు రూ.1450 కోట్లతో సుంకిశాల భారీ ఇన్‌టేక్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టారు. ►సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ కింద నగరవ్యాప్తంగా 62 ఎస్టీపీలు నిర్మించాలని సంకలి్పంచారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1257 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యంతో 31 ఎస్టీపీలను ప్రతిపాదించారు. తొలివిడతగా రూ.1280 కోట్ల అంచనావ్యంతో 17 ఎస్టీపీల నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో కూకట్పల్లి,కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు మురుగు కష్టాలు తీరనున్నాయి. మెట్రోరైలు.. ►నగరంలో 69 కి.మీ మార్గంలో రూ.21 వేల కోట్ల అంచనావ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేశారు. గత నాలుగేళ్లుగా సుమారు రూ.18.34 కోట్ల మంది మెట్రో రైళ్లలో జరీ్నచేశారు. నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో మెట్రో సేవలు అందిస్తోంది. డిజిటల్ టెక్నాలజీని మెట్రో సమర్థవంతంగా అమలు చేస్తోంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ►రూ.34 లక్షల వ్యయంతో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు,హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55 కి.మీ మూసీ ప్రవాహ మార్గంలో నది సరిహద్దులు,బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా సర్వే పూర్తిచేశారు. ►రూ.4.59 కోట్లతో నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు. ►మూసీ తీరాల వెంట రూ.95 లక్షలు ఖర్చు చేసి ఫాగింగ్ చేపట్టారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో.. ►పీపీపీ విధానంలో బాటసింగారంలో 40 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పార్కును నిర్మించారు. సుమారు 500 ట్రక్కులకు పార్కింగ్ వసతి, డార్మెటరీలు ఏర్పాటు చేశారు. ►కోకాపేట్లో 533 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డు డెవలప్ మెంట్ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు రూ.265 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. ►రూ.61.8 కోట్ల వ్యయంతో ఉప్పల్, మెహిదీపట్నంలలో స్కైవాక్‌ల నిర్మాణం పురోగతిలో ఉంది. ►ఉప్పర్‌పల్లి పీవి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అప్ అండ్ డౌన్ ర్యాంప్ నిర్మాణాన్ని రూ.36 కోట్లతో పూర్తిచేశారు. ►బాలానగర్ వద్ద రూ.387 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్‌ను పూర్తిచేశారు. ►ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్ వద్ద 3 ఫుట్ఓవర్ బ్రిడ్జీల పనులు పూర్తిచేశారు. ►నగరంలో 158 కి.మీ మేర విస్తరించిన ఉన్న ఓఆర్ఆర్కు రెండు వైపులా గ్రోత్‌కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్‌పై హైవే ట్రాఫిక్ నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ►ఓఆర్ఆర్పై 136 కి.మీ మార్గంలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పని చురుకుగా సాగుతుంది. ► రూ.24.5 కోట్లతో ఔటర్‌రింగ్‌రోడ్డు సుందరీకరణ పనులు చేశారు. ►ఏడాదిగా హుస్సేన్‌సాగర్, దుర్గంచెరువు, సరూర్‌నగర్, సఫిల్గూడా, కటోరా హౌజ్, కాప్రాలోని రెండు చెరువులను ప్రక్షాళన చేశారు. ► ఔటర్వెంట రూ.47 కోట్లతో ఆటోమేటెడ్ బిందు సేద్యాన్ని చేపట్టారు. -
రూ.6 కోట్లతో మంగళగిరిలో అభివృధ్ధి పనులు
సాక్షి, మంగళగిరి : పట్టణంలో అభివృద్ధి పట్టాలు ఎక్కనుంది. రూ.6 కోట్లతో మార్చి నెలకల్లా ఈ పనులను పూర్తిచేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రూ.6 కోట్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ఈ నిధులు మురిగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, వాటిని ఖర్చు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 2014–15, 2015–16, 2016–17, 2017–18, 2018–19 సంవత్సరాల్లో మంగళగిరి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం మంజూరయిన నిధులను సక్రమంగా వినియోగించడంలో టీడీపీ పాలకులు విఫలమవడంతో 2020 మార్చి చివర నాటికి ఖర్చు చేయకుంటే అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం అధికారులు, సిబ్బంది బదిలీలు జరిగిన నేపథ్యంలో నిధులను ఖర్చుచేయడంలో జాప్యం జరిగింది. నిధులను ఖర్చు చేసేందుకు మరో ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో అభివృద్ధి పనులను అధికారులు యుద్ధప్రాతిపాదికన చేపడుతున్నారు. టీడీపీ హయాం మంజూరయ్యి 25 శాతం కంటే తక్కువ జరిగిన, అసలు ప్రారంభం కాని పనులను నిలిపివేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. స్పందించిన అధికారులు ఆయా పనులను నిలిపివేశారు. అనంతరం పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న 14 రోడ్ల నిర్మాణానికి రూ.1.50 కోట్లతో టెండర్లు పిలిచారు. రత్నాల చెరువలో సిమెంట్ రోడ్డు, పాత మంగళగిరి, రాజీవ్‌గృహకల్ప ప్రాంతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో ఈ రోడ్లను నిర్మించనున్నారు. మిగిలిన నిధుల విషయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పనులకు టెండర్లు పిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మున్సిపల్ పాఠశాలలపై దృష్టి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన మౌలికసదుపాయాలు కల్పించడంతో పాటు అవసరమైన అదనపు గదుల నిర్మాణం, మరుగుదొడ్లు, సామగ్రి సమకూర్చి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మున్సిపాల్టిలో 18 పాఠశాలలకు అవసరమైన అవసరాలపై నివేదికలు సిద్ధం చేసిన అధికారులు, ఈ పనులకు రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. మార్చి నెలాఖరు నాటికి రూ.3 కోట్లు వెచ్చింది పాఠశాలలు అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలోనే డిటైల్డ్ ప్రాజక్టు రిపోర్టు (డీపీఆర్)లు రూపొందించి ఉన్నతాధికారుల అనుమతులు పొంది టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి మార్చినాటికి పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మార్చి నెలాఖరుకు పనులు పూర్తి చేస్తాం మంగళగిరి పట్టణాభివృద్ధికి 2014–15 ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులు పూర్తిగా ఖర్చుకాలేదు. ఇప్పటికే మంజూరైన రూ.6 కోట్లను మార్చిలోపు ఖర్చు చేయాలి. లేకుంటే ఆ నిధులు మురిగిపోతాయి. ఇప్పటికే రూ.1.50 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచాం. మిగిలిన వాటికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. రూ.3 కోట్ల నిధులతో మున్సిపల్ పాఠశాలల అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. 2020 మార్చి నెలాఖరునాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. – హేమామాలిని, మంగళగిరి మున్సిపల్ కమిషనర్ -
వైఎస్సార్‌కు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం
సాక్షి, కోరుకొండ(తూర్పుగోదావరి) : పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అందరి హృదయాల్లో కొలువై ఉన్నారని కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కొనియాడారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీ వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళా వేదిక వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తొలుత వైఎస్సార్, జక్కంపూడి రామ్మోహనరావుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని చెప్పారు. వైఎస్సార్ వర్ధంతి సోమవారం అయినప్పటికీ ఆదే రోజు వినాయక చవితి పర్వదినం రావడంతో ఒక రోజు ముందే ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జగన్ పాలనలో అందరికీ మేలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఆయన అమలు చేస్తున్నారని రాజా చెప్పారు. వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నవరత్న పథకాల అమలు ద్వారా ప్రజలకు సమక్షేమ ఫలాలు అందించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. అతి త్వరలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరుతుందని తెలిపారు. గ్రామాల్లోని పేదలకు మంచి వైద్యం అందించాలనే ఉద్ధేశంతో నియోజకవర్గ స్థాయిలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. శిబిరంలో వైద్యులు రోగులను పరీక్షించి మందుల పంపిణీ చేశారు. వైద్య శిబిరం విజయవంతానికి కృషి చేసిన అందరికీ జక్కంపూడి విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వుల్లి బుజ్జిబాబు, గాదరాడ ఓం శివశక్తి పీఠం ధర్మకర్త బత్తుల బలరామకృష్ణ, పార్టీ వివిధ విభాగాల నాయకులు తిరుమలశెట్టి సత్యనారాయణ, బొరుసు బద్రి, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి, అరిబోలు చినబాబు, యర్రంశెట్టి పోలారావు, డాక్టర్ ఫణిసుబ్రహ్మణ్యం, అయిల రామకృష్ణ, అత్తిలి రాంప్రసాద్, చిక్కిరెడ్డి సురేష్, అడబాల చినబాబు, వైఎల్ఎన్ స్వామి, పిట్టా కృష్ణ, వనుం గంగాధర్, నిడిగట్ల బాబ్జీ, మారిశెట్టి అర్జునరావు, కోరుకొండ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్, తహసీల్దార్ టీఆర్ రాజేశ్వరరావు, మూడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, గ్రామ వలంటీర్లు, ఆశ కార్యకర్తలు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. శిబిరానికి వచ్చిన వారికి ఓం శివశక్తి పీఠం ఆధ్వర్యంలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. -
తూరుపు వెలుగు రేఖ.. వైఎస్సార్
ఇద్దరూ రాజకీయంగా సమకాలికులు.. ఆపై స్నేహితులు.. ఇద్దరూ ముఖ్యమంత్రులుగా చేసినవారు. ఇద్దరూ కూడా వారు అనుకున్నది చేసినవారే. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ దండగ అన్నారు. అనడమే కాదు.. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయం దండగమాలిన వ్యవహారంగా మార్చారు. మరొకరు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన వ్యవసాయాన్ని పండగ అన్నారు. తన విధానాలతో.. రైతు సంక్షేమ పథకాలతో సాగును నిజంగానే పండగగా మార్చి చూపించారు. .. ♦ 1995 నుంచి 2004 మే వరకు.. సంస్కరణల పేరు తప్ప సంక్షేమం ఊసేలేని చంద్రబాబు సర్కార్. పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులపై పోలీసులను ఉసిగొల్పి కర్కశంగా అణచివేసిన పాలన. దుర్మార్గపు పాలనకు తగినట్టుగా వర్షాభావం.. దీనితో కరువు కాటకాలు. ♦ 2004 నుంచి 2009 సెప్టెంబరు 2 వరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా సాగిన వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన. రైతులకు రుణమాఫీ.. రుణ ప్రోత్సాహం.. ఉచిత విద్యుత్.. కనీస మద్దతు ధరకు అదనంగా బోనస్.. ఇలా చెప్పుకుంటూ పోతే రైతే తొలి ప్రాధాన్యంగా సాగిన పాలనాకాలం. ఒక విధంగా చెప్పాలంటే సంక్షేమానికి ప్రకృతి కూడా సహకరించిన కాలం. వ్యవసాయంలో దిగుబడులు.. పండించిన పంటకు గిట్టుబాటు ధరలు వచ్చిన సమయం. ♦ మోముపై చెక్కుచెదరని చిరునవ్వు.. పల్లెటూరి మోతుబరి రైతులా పంచెకట్టు. అన్నదాత అంటే అంతులేని అభిమానం. రైతే రాజు అని నమ్మిన నైజం.. చివరి వరకూ వారి సంక్షేమానికి పాటుపడుతూ రైతు పక్షపాతిగా పేరొందారు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. రైతులకు అమలు చేసిన సంక్షేమ పథకాల వల్లే ఆయన మృతిచెంది పదేళ్లవుతున్నా నేటికీ ఆయనపై అభిమానం చెక్కు చెదరలేదు. ఉచిత విద్యుత్ రైతేరాజు అనిపించుకునేలా దివంగత వైఎస్సార్ పాలన సాగింది. 2004లో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తొలి సంతకం ఉచిత విద్యుత్ ఫైల్‌పైనే. దీని వల్ల జిల్లాలో మెట్ట, ఏజెన్సీ రైతులతో పాటు కోనసీమలో కొబ్బరి రైతులు సైతం విశేషంగా లబ్ధిపొందారు. అప్పటి వరకు మోటార్‌కు విద్యుత్ బిల్లు నెలకు రూ.250 నుంచి రూ.500 వరకు ఉండేది. ఉచిత విద్యుత్‌తో వీరందరూ లబ్ధిపొందారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 30 వేల మోటార్లకు ఉచిత విద్యుత్ అందింది. తరువాత ఇది కాస్తా 47,500 వరకు విద్యుత్ కనెక్షన్లకు పెరిగాయి. వైఎస్సార్ మృతి తరువాత కూడా ఈ పథకం కొనసాగుతూనే ఉంది. ఉచిత విద్యుత్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్ర విభజన తరువాత ముఖ్యమంత్రిగా ఎన్నికైనా ఈ పథకాన్ని కొనసాగించాల్సి వచ్చిదంటే రైతుల్లో ఈ పథకం ఎంతగా చొచ్చుకుపోయిందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకాన్ని మరింత సమర్ధవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పగటి పూట 9 గంటలు విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించారు. రుణమాఫీ 2008–09లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రుణమాఫీ ప్రకటించాయి. మన రాష్ట్రంలో వైఎస్సార్ హయాంలో రుణమాఫీ సమర్థంగా అమలు జరిగింది. చంద్రబాబు రుణమాఫీలా దఫదఫాలుగా కాకుండా జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల రైతులకు ఒకేసారి మాఫీ చేశారు. సుమారు రూ.450 కోట్ల మేర రైతులు లబ్ధిపొందారు. అప్పటికే సక్రమంగా అప్పులు చెల్లించిన రైతులకు మేలు చేసేలా ఏకంగా రూ.ఐదు వేల చొప్పున రుణ ప్రోత్సాహాన్ని అందించారు. తద్వారా రుణాలు చెల్లించని రైతులకే కాదు.. రుణాలు చెల్లించిన రైతులకు సైతం మేలు చేసిన ఘనత వైఎస్సార్‌కు దక్కింది. ‘పరపతి’ పెంచిన వైఎస్సార్ మెట్ట ప్రాంతంలో 95 శాతం సొసైటీలు అప్పుల ఊబిలో ఉన్నాయి. అమలాపురం డివిజన్లో 116 సంఘాలకు గాను 8 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉండేవి. మిగిలిన సంఘాలు దాదాపు రైతులకు అప్పులు ఇవ్వడం తగ్గించాయి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాల్లో 70 శాతం సొసైటీల ద్వారా అందేవి. కాగా చంద్రబాబు పుణ్యమా అని అవి 10 శాతానికి పడిపోయాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత సహకార సంఘాల దశ తిరిగింది. వైద్యనాథన్ కమిటీ సిఫార్సులను అంగీకరించడం, వాటి అమలుకు ప్రభుత్వం నాబార్డుతో ఒప్పందం చేసుకుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చిన నిధులతో సహకార సంఘాల అప్పులు తీరాయి. జిల్లాలో ఏటా రైతులకు డీసీసీబీ ఆధ్వర్యంలో సంఘాలు రూ.2,500 కోట్ల వరకూ రుణాలిస్తున్నాయి. వైఎస్సార్ పావలా వడ్డీ పథకాన్ని ప్రవేశపెట్టడంతో రైతులకు రుణాలు కట్టే వెసులుబాటు కలిగింది. వడ్డీ రాయితీ కోసం రైతులు సకాలంలో రుణాలు చెల్లించడం సంఘాలకు మేలు చేసింది. దీనికితోడు రుణాలను రీషెడ్యూలు చేసుకునే వెసులుబాటు రావడంతో సంఘాలు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసి అప్పును తిరగరాస్తున్నాయి. దీని వల్ల 90 శాతం రుణాలు రికవరీ అవుతున్నాయి. మార్క్‌ఫెడ్‌కు వైఎస్సార్ రూ.500 కోట్ల వడ్డీలేని రుణం ఇవ్వడంతో సంఘాల ఆధ్వర్యంలో ఎరువులు, విత్తనాల వ్యాపారం జోరందుకుంది. అంతేకాకుండా సంఘాలు మల్టీపర్పస్ సొసైటీలుగా మారాయి. వరికి బోనస్.. కొబ్బరికి వ్యాట్ మినహాయింపు.. అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు. కాని రైతులు అడకున్నా మేలు చేసిన వ్యక్తి దివంగత నేత వైఎస్సార్ ఒక్కరే. 2008లో కేంద్రంలో అప్పటి యూపీఏ సర్కార్ వరికి క్వింటాల్‌కు కనీస మద్దతు ధర కేవలం రూ.50 మాత్రమే పెంచింది. దీని వల్ల తమకు పెద్దగా మేలు జరగదని రైతులు వాపోయారు. దీనిని గుర్తించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ అదనంగా మరో రూ.50 బోనస్ ఇచ్చారు. దీనితో ధాన్యం పండించిన రైతులు ఎకరాకు, రెండు పంటలకు రూ.3,750 మేర అదనంగా ఆదాయం పొందారు. 1998 నుంచి సంక్షోభంలో చిక్కుకున్న కొబ్బరి రైతులకు మేలు చేసేలా కొబ్బరిపై ఉన్న రెండు శాతం విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను రద్దు చేశారు. వలిచిన కొబ్బరికాయను 2007లో కేజీ రూ.9.88 కొనుగోలు చేసేందుకు జీవో జారీ చేశారు. సాగు నీటిపారుదల రంగాన్ని అభివృద్ధి చేసి రైతుల చేలల్లో నీరు పారిస్తే వ్యవసాయం అగ్రస్థానంలో నిలుస్తుందని వైఎస్సార్ భావించారు. అందుకు తగినట్టుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్లతో జలయజ్ఞం ప్రారంభించారు. జలయజ్ఞంతో తూర్పు గోదావరి రైతులకు జరిగిన మేలు అంతా ఇంతా కాదు. రూ.వందల కోట్లతో కొత్త ప్రాజెక్టుల నిర్మాణం.. పాత ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. డెల్టా ఆధునికీకరణ గోదావరి డెల్టా ఆధునికీకరణకు దివంగత నేత వైఎస్సార్ అంచనాలకు మించి నిధులు మంజూరు చేశారు. 2008లో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కాలువల ఆధనికీకరణకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.3,361 కోట్లు కేటాయించారు. ఇందుకు సంబంధించి 2007 నవంబరు 27న జీవో 258 విడుదలైంది. దీనిలో జిల్లాకు రూ.1,679.24 కోట్లు కేటాయించారు. మన జిల్లాలో తూర్పు, మధ్య డెల్టాల పరిధిలోని పంట కాలువలకు 1,170.21 కోట్లు, మురుగునీటి కాలువలకు రూ.485.65 కోట్లు కేటాయించారు. వైఎస్సార్ ఉండగా రూ.639.92 కోట్ల విలువైన ఐదు ప్యాకేజీలకు టెండర్లు ఖరారయ్యాయి. టెండర్లు ఖరారు కాని చోట కాలువలు అధ్వానంగా ఉన్నాయని 2009లో రూ.9.01 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. తరువాత అధికారంలోకి వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, విభజన తరువాత చంద్రబాబు హయాంలో ఆధునికీకరణపై శీతకన్ను వేశారు. బాబు ఐదేళ్ల పాలనలో బడ్జెట్ కేటాయింపులు సుమారు రూ.350 కోట్లు కాగా, దీనిలో 70 శాతం మాత్రమే అంటే రూ.245 కోట్ల పనులు మాత్రమే జరిగాయి. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ 60 వేల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరందించడం, వరదల విపత్తు నుంచి ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో రూ.138 కోట్ల అంచనాతో 2008 జూన్ 24న జీవో 569 విడుదల చేశారు. మూడు ప్యాకేజీలుగా దీనిని విడదీశారు. కాలువల ఆధునికీకరణ, గట్లు పటిష్టం చేసే పనులున్నాయి. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మృతితో పనులు ప్రారంభం కాలేదు. తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏలేరు పనులు ఆరంభమయ్యాయి. రెండో దశ పనులకు కిరణ్‌కుమార్‌రెడ్డి రూ.168.24 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఏజెన్సీ ప్రాజెక్టులు ఏజెన్సీలో ప్రాజెక్టుల నిర్మాణానికి దివంగత వైఎస్సార్ జలయజ్ఞంలో శ్రీకారం చుట్టారు. భూపతిపాలెం, ముసురుమిల్లి ప్రాజెక్టులకు నిర్మాణం చేపట్టారు. దీనిలో భూపతిపాలెం ప్రాజెక్టు 2007లో ఆరంభమైంది. దీని తొలి అంచనా వ్యయం రూ.47.23 కోట్లు కాగా, పూర్తయ్యేనాటికి రూ.160.63 కోట్లకు చేరింది. ఏజెన్సీలో సాగు నీరందించేందుకు నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు వైఎస్సార్ హయాంలోనే 90 శాతం కాగా, పూర్తి అయిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ దీనిని ప్రారంభించారు. ‘పుష్కర’తో మేలు మెట్టకు మేలు చేసే తోట వెంకటాచలం పుష్కర ఎత్తిపోతల పథకానికి వైఎస్ఆర్ శ్రీకారం చుట్టారు. ఇందుకు రూ.600 కోట్లు కేటాయించి పనులు పూర్తి చేశారు. మెట్టలో జగ్గంపేట నుంచి తుని వరకు కొత్తగా 1.86 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వచ్చింది. నిధులు మంజూరు చేసి... రబీని గట్టెక్కించి.. 2009 జనవరిలో గోదావరి డెల్టాకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని 8.96 లక్షల ఎకరాల ఆయకట్టుకు నాట్లు దాదాపు పూర్తయ్యాయి. పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయలేని దుస్థితి. 12 టీఎంసీలకు పైబడి నీరు అవసరముంది. ఈ సమయంలో జిల్లాకు వచ్చిన నాటి సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి రబీపై దృష్టి సారించారు. ఉమ్మడి రాష్ట్రంలోని కిన్నరసాని నుంచి 1.4 టీఎంసీలు, సీలేరు నుంచి బైపాస్ పద్ధతిలో అదనంగా 5 టీఎంసీల నీరు, గోదావరిలో వృధా నీటిని పంపింగ్ ద్వారా, మురుగునీటి కాలువలకు క్రాస్బండ్లు వేసి తోడకం ద్వారా 6 టీఎంసీల నీరు సేకరించే అవకాశముందని ఇందుకు రూ.7.50 కోట్లు ఖర్చవుతుందని నివేదించారు. ‘సీలేరు, కిన్నెరసాని నుంచి నీటిని తెప్పించే బాధ్యత నాది. మీరు అడిగినన్ని నిధులిస్తాను.. డెల్టాలో ఒక్క ఎకరా కూడా ఎండేందుకు వీలు లేదు’ అని వైఎస్సార్ ఆదేశించారు. అంతే ఆగమేఘాల మీద అన్ని అనుమతులూ వచ్చాయి. ఆ ఏడాది డెల్టాలో రబీ రికార్డుస్థాయిలో పండింది. కాలువ ద్వారా నీరు వస్తోంది గతంలో వరుస కరువులతో విసిగిపోయాం. మహానేత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ముసురుమిల్లి ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తికానప్పటికీ కాలువ ద్వారా నీటిని మళ్లించడంతో పదేళ్లుగా రెండు పంటలు పండించుకుంటున్నాం. – గిళ్ల వెంకన్న, రైతు ఇందుకూరుపేట, దేవీపట్నం మండలం. అడిగన వెంటనే జీవోలు ఒకసారి కొబ్బరికి వ్యాట్ మినహాయించాలని మా ప్రాంతం వ్యాపారులు అడిగారు. వైఎస్సార్ పెద్దగా పట్టించుకోలేదు. రైతులంతా వెళ్లి అడిగాం. దీని వల్ల మీకు మేలు ఏమిటని అడిగారు. పన్నుభారం మాపై పడుతోంది.. మినహాయింపు ఇస్తే మేలు జరుగుతుందని చెప్పాం. వెంటనే జీవో ఇచ్చారు. అలాగే కొబ్బరిని మార్కెట్‌యార్డుల ద్వారా కొనుగోలు చేయాలంటే దానికి లాభసాటి ధర ప్రకటించి కొనుగోలు చేసేలా జీవో ఇచ్చారు. రైతులు అడగడమే ఆలస్యం ఆయన వెంటనే జీవోలు జారీ చేశారు. – ముత్మాల జమ్మి, బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
బీసీల అభివృద్ధికి సీఎం కృషి
ఆదిలాబాద్‌రూరల్: బీసీల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన వడ్డెర కులస్తుల మహాసభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించే వారిలో వడ్డెర కులస్తులు మొదటిస్థానంలో ఉన్నారన్నారు. కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కో ట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందన్నా రు. జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించి వారికి భవనం నిర్మించి ఇస్తామన్నారు. త్వరలో అందజేయనున్న డబుల్ బేడ్ రూం ఇళ్లలో వందఇళ్లు వడ్డెర కుస్తులకు కేటా యిస్తామన్నారు. వడ్డెరులు ఎదుర్కొం టున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కరం కోసం కృషి చేస్తానన్నారు. అంతకు ముం దు మంత్రిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీ ష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేం దర్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు సత్తిబాబు, నారాయణ స్వామి, అంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గంగయ్య, వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. -
టీడీపీ నాలుగేళ్లపాలనలో అభివృద్ధి ఏదీ?
మదనపల్లె : నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరిగిందో, ఎవరికి మేలు జరిగిందో తెలపాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఎంపీ పదవిని త్యజించి, ఆమరణ దీక్షల అనంతరం శనివారం తొలిసారి జిల్లాకు వచ్చిన మిథున్ రెడ్డికి ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి అధ్యక్షతన అభినందన, ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశారు. స్థానిక మిషన్ కాంపౌండ్‌లో జరిగిన ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, పెద్దిరెడ్డి అభిమానులు హాజరయ్యారు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మాటలు తప్ప ప్రజ లకు ఒరిగిందేమీ లేదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, పేదలకు ఇళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 12 నెలల్లో మనందరికీ మేలు జరుగనుందని, మనందరం కోరుకునే రాజన్న రాజ్యం వస్తుం దని తెలిపారు. చిన్నవయస్సులోనే ఎంపీ అయిన తాను మూడున్నరేళ్ల తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మదనపల్లెలో జరుగుతున్న ఈ సభ భవిష్యత్తులో ప్రజాసంక్షేమం కోసం చేయబోయే పోరాటాలకు ఆరంభమని చెప్పారు. ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఐదు కోట్ల ఆంధ్రు ల హక్కని, పదవి ముఖ్యం కాదు, ప్రజాసంక్షేమం ముఖ్య మని రాజీనామా చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలి చిన మిథున్ రెడ్డిని అభినందిస్తున్నానన్నారు. ఎమ్మెల్యే నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు చేసింది ధర్మదీక్ష కాదని, చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా రూ.30 కోట్ల ఖర్చుతో చేసిన కర్మదీక్షని విమర్శించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి కష్టపడుతుంటే.. ఆయన బాటలో నడుస్తున్న మిథున్‌రెడ్డి యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త ద్వారకనాథ రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో కొత్తగా చేరిన నాయకుడు పుంగనూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ సవాళ్లకు బెదిరేది లేదని, దీటుగా సమాధానమిస్తామని హెచ్చరించారు. తంబళ్లపల్లె ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా నని తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకులు జంగాలపల్లె శ్రీనివాసులు, పోకల అశోక్ కుమార్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ గాయత్రీదేవి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, లిడ్‌క్యాప్ మాజీ చైర్మన్ రెడ్డెప్ప, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్, షమీం అస్లాం ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బాబ్జాన్, ఉదయ్‌కుమార్, ఎంపీపీ సుజనా బాలకృష్ణారెడ్డి, జరీనా బేగం, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, దేశాయ్ జయదేవ్ రెడ్డి, కౌన్సిలర్లు జింకా వెంకటాచలపతి, ఫర్జాన రఫీ, మస్తాన్ రెడ్డి, ఖాజా, బాలగంగాధర రెడ్డి, మహమ్మద్ రఫీ, వెంకటరమణారెడ్డి, సుగుణాఆంజనేయులు, ముక్తియార్, షరీఫ్, ఎస్.ఏ.కరీముల్లా, ఎంపీటీసీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, మల్లికార్జున, మండల ఉపాధ్యక్షుడు ఆనంద పార్థసారధి, సర్పంచ్ శరత్ రెడ్డి, నాగరాజరెడ్డి, దండు కృష్ణారెడ్డి, చేనేత, వాణిజ్య విభాగం భువనేశ్వరి సత్య, గార్ల చంద్రమౌళి, దండాల రవిచంద్రారెడ్డి, లియాఖత్ అలీ, మస్తాన్ ఖాన్, సురేంద్ర, మహేష్, రోలింగ్ మల్లిక పాల్గొన్నారు. వెల్లువెత్తిన ప్రజాభిమానం మదనపల్లె : ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన అనంతరం తొలిసారిగా మదనపల్లె నియోజకవర్గానికి వచ్చిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి ఉదయం 7.30 గంటలకు బెంగళూరుకు చేరుకున్న ఆయనకు విమానాశ్రయం నుంచే ఆత్మీయ స్వాగతాలు మొదలయ్యాయి. మదనపల్లె, తంబళ్లపల్లె, పుంగనూరు నుంచి పెద్దసంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకుని సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరిన ఆయనకు కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వేచివున్న వేలాది మంది అభిమానులు పూలవర్షం కురిపించారు. మహిళలు కర్పూర హారతులతో అపూర్వ స్వాగతం పలికారు. పూలమాలలు వేసి అభిమానాన్ని చాటుకున్నారు. సుమారు 500 వాహనాల్లో అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. వాహనాల వెంబడి బైక్‌లపై ర్యాలీ చేస్తూ జై జగన్, జై మిథున్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. -
మున్సిపాలిటీలకు మహర్ధశ
నల్లగొండ : మున్సిపాలిటీలకు మహర్దశ పట్టనుంది..! మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలం గాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) కింద ప్రత్యేక నిధులు మంజూరు కానున్నాయి. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమి స్తున్న క్రమంలో వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఐడీసీ ద్వారా ఒక్కో మున్సిపాలిటీకి సుమారు రూ.20కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంట్లో గ్రేడ్–1 మున్సిపాలిటీకి రూ.20 కోట్లు, గ్రేడ్–2 మున్సిపాలిటీకి రూ.10 నుంచి 15కోట్లు, నగర పంచాయతీలకు రూ.10కోట్ల వరకు నిధులు కేటా యించనున్నారు. నల్లగొండ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ కావడంతో రూ.15 నుంచి రూ.20కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మి ర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.10 నుం చి రూ.15కోట్లు, దేవరకొండ నగర పంచా యతీకి రూ.10కోట్ల వరకు నిధులు మం జూరయ్యే అవకాశం ఉందని అంటున్నా రు. దేవరకొండకు ఇప్పటికే రూ.5 కోట్లు మంజూరు చేసినందున ఎఫ్ఐడీసీ ద్వారా మరో రూ.5కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు, పనుల పర్యవేక్షణ బాధ్యతలు మున్సి పాలిటీ అధికారులకు సంబంధం లేకుం డా జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. నిర్ణీత గడువులోగా వినియోగించుకోవాలి.. ఎఫ్ఐడీసీ ద్వారా విడుదలయ్యే నిధులు నిర్ణీత గడువులోగా వినియోగించుకునే విధంగా పనులను వేగవంతంగా పూర్తిచేయాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదలను ఈ నెలాఖరులోగా పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాతి రెండు, మూడు మాసాల్లో పనులు పరిపాలన ఆమోదం పొంది, టెండర్లు పిలుసా ్తరు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స వం జూన్2న పనులు ప్రారంభిస్తారు. స్పెషల్ ఆఫీసర్ల పర్యవేక్షణలో.. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ సలహా, సూచనల మేరకు మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతిపాధనల విషయంలో ప్రజాప్రతినిధుల నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నిధుల విషయంలో ము న్సిపల్ కమిషనర్లకు ఎలాంటి సంబందమూ లేదు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ శాఖ పనులను ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ననుల పర్యవేక్షణ బాధ్యతలు జిల్లా ఉన్నతాధికారులకు అప్పగించారు. మున్సిపల్ పాలకవర్గాలు లేని కాలంలో స్పెషల్ అధికారులుగా వ్యవహరించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా అధికారులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ ఆఫీసర్లు ఒక్కో పట్టణాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తారు. నల్లగొండ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్, మిర్యాలగూడ మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్‌గా జాయింట్ కలెక్టర్, దేవరకొండ స్పెషల్ ఆఫీసర్‌గా డీఆర్డీఓ లేదా డీఆర్వోను నియమించే అవకాశం ఉంది. చేపట్టే అభివృద్ధి పనులు... మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో విలీనమైన గ్రామాలు, శివారు ప్రాంతాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలకు తొలిప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. వీటితోపాటు మున్సిపాలిటీ వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి సదుపాయం, పార్కులు, ఎల్ఈడీ లైట్స్, మోడల్ మార్కెట్స్, ఆడిటోరియంల నిర్మాణం, ఫుట్‌పాత్‌లు, బస్‌బేలు, మురికి కాల్వల అభివృద్ధి, శ్మశాన వాటికల పనులు చేపడతారు. -
జూడో విస్తరణకు కృషి
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇటీవలే జిల్లా జూడో అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ క్రీడ విస్తరించేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు రామలక్ష్మయ్య అన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జూడోకు ఒలింపిక్స్‌లో గుర్తింపు ఉందని, ఈ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అందరి సహకారంతో జిల్లాలో జూడోను అభివద్ధి చేస్తామని అన్నారు. డివిజన్ల వారీగా జూడో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే జూడో క్రీడాకారులకు తమ అసోసియేషన్ సహకారం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అసోసియేషన్ అవకాశం ఇస్తే త్వరలో జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి అసోసియేషన్ జూడో టోర్నీలకు జిల్లాస్థాయిల్లో సెలక్షన్స్ నిర్వహించి ప్రతిభ కనబరిచేవారిని ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా జూడో అసోసియేషన్ సలహాదారుడు రాజేంద్రసింగ్, వైస్ చైర్మన్ డేవిడ్, ప్రధాన కార్యదర్శి దూమర్ల నిరంజన్, ఈసీ సభ్యుడు మొగులాల్ పాల్గొన్నారు.