Telangana, KTR Releases MAUD Annual Report Action Plan 2021 - 22 - Sakshi
Sakshi News home page

గ్రేటర్‌ రూపురేఖలు మారాయి: కేటీఆర్‌

Published Sat, Jul 10 2021 7:46 AM | Last Updated on Sat, Jul 10 2021 8:52 AM

Hyderabad: KTR Releases MAUD Annual Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత సంవత్సరం కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ వంటి పరిస్థితుల్లో సైతం జీహెచ్‌ఎంసీ బాగా పనిచేసిందని మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను అనువుగా మలచుకొని రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేశారని ప్రశంసించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చేయబోయే పనుల్లో నగరానికి వరదముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.858.32 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనుల్ని 15 ప్యాకేజీల కింద చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

ఇంకా రూ.240 కోట్లతో జవహర్‌నగర్‌లో చెత్త నుంచి వెలువడే హానికర ద్రవాల (లీచెట్‌) శుద్ధి పనుల్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 11 కి.మీ.లింక్‌ రోడ్లు (రూ.275 కోట్లు)18 ఎఫ్‌ఓబీలు పూర్తికాగలవని పేర్కొన్నారు. 90 చెత్త సేకరణ, తరలింపు కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన మునిసిపల్‌ శాఖ వార్షిక నివేదికలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్‌ఎంసీలో చేసిన పనుల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.... 

► రూ.184 కోట్లతో దుర్గంచెరువుపై కేబుల్‌ బ్రిడ్జి. 
►ప్రాజెక్టు పనుల కింద రూ.503.28 కోట్ల విలువైన 10 రోడ్డు ప్రాజెక్టులు పూర్తి . 
►జీడిమెట్లలో రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణ, వ్యర్థాల కూల్చివేతల ప్లాంట్‌ ఏర్పాటు. 
►దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా 19.8 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన చెత్తనుంచి విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని ద్వారా  ఇప్పటి వరకు 109.23 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. 
►జవహర్‌నగర్‌లో 135 ఎకరాల్లోని 12 మిలియన్‌ టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా క్యాప్‌ చేయడం జరిగింది. దీని వ్యయం రూ.144 కోట్లు.  
►టీడీఆర్‌ ద్వారా జీహెచ్‌ఎంసీపై ఆర్థిక భారం తగ్గింది. 2020–21లో 129 టీడీఆర్‌ ధ్రువపత్రాలు జారీ. 
►టీఎస్‌ బీపాస్‌ ద్వారా బల్దియా పరిధిలో 11,538 భవనాలకు నిర్మాణ అనుమతుల  ద్వారా రూ.797.13 కోట్ల ఆదాయం వచి్చంది. 
►అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా 2.53 కోట్ల భోజనాల పంపిణీ. 
►16 గ్రీన్‌ఫీల్డ్‌ లింక్‌రోడ్లు (13.56 కి.మీ.) వినియోగంలోకి వచ్చాయి. వ్యయం రూ.154 కోట్లు.  
►నాలా నెట్‌వర్క్‌ బలోపేతానికి ఎస్‌ఎన్‌డీపీ ఏర్పాటు.  
►కరోనా..లాక్‌ డౌన్‌ సమయాన్ని సది్వనియోగం చేసుకొని 9 నెలల్లో జరగాల్సిన పనులు 2–3 నెలల్లోనే  పూర్తి. 
►సీఆర్‌ఎంపీ ద్వారా 383.44 కి.మీ.ల రోడ్ల రీకార్పెటింగ్‌. అందుకైన వ్యయం రూ.457 కోట్లు.  
►ఇతరత్రా నిర్వహణ పనులు 10,670 మంజూరుకాగా, 5850 పనుల్ని రూ.1020.41 కోట్లతో పూర్తిచేసినట్లు తెలిపారు.  
► ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్‌ వద్ద మూడు ఎఫ్‌ఓబీలు పూర్తి.  

జలమండలి పరిధిలో.. 
►2 వేల చ.కి.మీ పరిధిలో విస్తరించిన నగరానికి నిత్యం జలమండలి 522.87 మిలియన్‌ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. 
►నగరంలో నిత్యం వెలువడుతున్న 1950 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిలో 772 మిలియన్‌ లీటర్ల మురుగు నీటిని సమర్థవంతంగా శుద్ధి చేస్తోంది. 
► జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు ఇప్పటివరకు 4.1 లక్షల మంది తమ ఆధార్‌ కార్డులను క్యాన్‌నెంబర్లకు అనుసంధానం చేసుకున్నారు. ఈ పథకంతో 9.7 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. 
►వేసవిలో కృష్ణా మూడు దశల పథకాలకు అవసరమైన తాగునీటిని సేకరించేందుకు రూ.1450 కోట్లతో సుంకిశాల భారీ ఇన్‌టేక్‌వెల్‌ పనులకు శ్రీకారం చుట్టారు. 
►సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్‌ కింద నగరవ్యాప్తంగా 62 ఎస్టీపీలు నిర్మించాలని సంకలి్పంచారు. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 1257 మిలియన్‌ లీటర్ల శుద్ధి సామర్థ్యంతో 31 ఎస్టీపీలను ప్రతిపాదించారు. తొలివిడతగా రూ.1280 కోట్ల అంచనావ్యంతో 17 ఎస్టీపీల నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో కూకట్‌పల్లి,కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్‌ సర్కిళ్లకు మురుగు కష్టాలు తీరనున్నాయి. 

మెట్రోరైలు.. 
►నగరంలో 69 కి.మీ మార్గంలో రూ.21 వేల కోట్ల అంచనావ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేశారు. గత నాలుగేళ్లుగా సుమారు రూ.18.34 కోట్ల మంది మెట్రో రైళ్లలో జరీ్నచేశారు. నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో మెట్రో సేవలు అందిస్తోంది. డిజిటల్‌ టెక్నాలజీని మెట్రో సమర్థవంతంగా అమలు చేస్తోంది. 
మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ 
►రూ.34 లక్షల వ్యయంతో గండిపేట్‌ నుంచి గౌరెల్లి వరకు,హిమాయత్‌సాగర్‌ నుంచి బాపూఘాట్‌ వరకు 55 కి.మీ మూసీ ప్రవాహ మార్గంలో నది సరిహద్దులు,బఫర్‌ జోన్‌ ఏర్పాటుకు వీలుగా సర్వే పూర్తిచేశారు. 
►రూ.4.59 కోట్లతో నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు. 
►మూసీ తీరాల వెంట రూ.95 లక్షలు ఖర్చు చేసి ఫాగింగ్‌ చేపట్టారు. 

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో.
►పీపీపీ విధానంలో బాటసింగారంలో 40 ఎకరాల స్థలంలో లాజిస్టిక్‌ పార్కు ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పార్కును నిర్మించారు. సుమారు 500 ట్రక్కులకు పార్కింగ్‌ వసతి, డార్మెటరీలు ఏర్పాటు చేశారు. 
►కోకాపేట్‌లో 533 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డు డెవలప్‌ మెంట్‌ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు రూ.265 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు.  
►రూ.61.8 కోట్ల వ్యయంతో ఉప్పల్, మెహిదీపట్నంలలో స్కైవాక్‌ల నిర్మాణం పురోగతిలో ఉంది. 
►ఉప్పర్‌పల్లి పీవి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అప్‌ అండ్‌ డౌన్‌ ర్యాంప్‌ నిర్మాణాన్ని రూ.36 కోట్లతో పూర్తిచేశారు. 
►బాలానగర్‌ వద్ద రూ.387 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్‌ను పూర్తిచేశారు. 
►ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్‌ వద్ద 3 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జీల పనులు పూర్తిచేశారు. 
►నగరంలో 158 కి.మీ మేర విస్తరించిన ఉన్న ఓఆర్‌ఆర్‌కు రెండు వైపులా గ్రోత్‌కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్‌పై హైవే ట్రాఫిక్‌ నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు  చేస్తున్నారు. 
►ఓఆర్‌ఆర్‌పై 136 కి.మీ మార్గంలో ఎల్‌ఈడీ వీధి దీపాల ఏర్పాటు పని చురుకుగా సాగుతుంది. 
► రూ.24.5 కోట్లతో ఔటర్‌రింగ్‌రోడ్డు సుందరీకరణ పనులు చేశారు. 
►ఏడాదిగా హుస్సేన్‌సాగర్, దుర్గంచెరువు, సరూర్‌నగర్, సఫిల్‌గూడా, కటోరా హౌజ్, కాప్రాలోని రెండు చెరువులను ప్రక్షాళన చేశారు. 
► ఔటర్‌వెంట రూ.47 కోట్లతో ఆటోమేటెడ్‌ బిందు సేద్యాన్ని చేపట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement