Municipal Administration and Urban Development
-
‘ప్లాన్’ ప్రకారం నిర్లక్ష్యం
వరంగల్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం (డీటీసీపీ) ఆధ్వర్యంలో కొత్త, పాత పురపాలక సంఘాలకు కొత్త బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ల అమలు పథకం అటకెక్కింది. గత ప్రభుత్వ హయాంలో నగరాలు, పట్టణాల స్థితిగతులు అధ్యయనం చేసి ప్రణాళిక సిద్ధం చేయాలన్న డీటీసీపీ ఆదేశాల మేరకు.. మున్సిపాలిటీలలో పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అన్నీ సిద్ధం చేసినా ఆమోదానికి నోచుకోలేదు. – సాక్షి ప్రతినిధి, వరంగల్2022లో ప్రణాళికలు సిద్ధమైనా..2022లో పురపాలకశాఖ ఆదేశాల మేరకు ఆ ఏడాది జూన్ నెలాఖరు వరకు ప్రణాళికలు సిద్ధమైతే.. 2023 నుంచి పలు మున్సిపాలిటీలు, పట్టణాల మాస్టర్‌ప్లాన్‌కు మోక్షం కలుగుతుందని భావించినా కార్యరూపం దాల్చలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘అర్బన్ తెలంగాణ.. అభివృద్ధి నమూనా’పేరిట ‘మాస్టర్‌ప్లాన్–2050’తయారు చేయాలని నిర్ణయించి ఆదేశించినా ఇంకా పట్టాలు ఎక్కడం లేదు. జనగామ పురపాలిక 1953లో ఏర్పడింది. 1987లో దీని పరిధిలో మాస్టర్‌ప్లాన్ అమలుకు అడుగులు పడగా, 1990లో అమల్లోకి వచి్చంది. డీటీసీపీ ఆదేశాలతో 2015లో కౌన్సిల్ తీర్మానం, ప్రభుత్వ ఆదేశాలతో 2017లో రివైజ్డ్ మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని కోరుతూ వినతి పంపించారు. సుమారు మూడున్నర దశాబ్దాలు గడుస్తున్నా, మాస్టర్‌ప్లాన్‌ను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో కొత్త మాస్టర్‌ప్లాన్ ఆవశ్యంగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్ మూలన పడింది. ఆదిలాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఏయూడీఏ)ని తెరపైకి తెచ్చినా.. భవిష్యత్ అభివృద్ధి, ప్రయోజనాలకు కీలకమైన మాస్టర్‌ప్లాన్ అమలుకు నోచడం లేదు. పూర్వ జిల్లాలోని కొత్త మున్సిపాలిటీల్లో మాస్టర్‌ప్లాన్ అమలుకు.. లక్సెట్టిపేట్ మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు జరిగినా పూర్తి దశకు చేరలేదు. మాస్టర్‌ప్లాన్ అమలైతే ప్రయోజనాలివీ.. మాస్టర్‌ప్లాన్ ఆమోదం పొందితే అందులో దాదాపు 40 విభాగాలు ఉంటాయి. వాణిజ్య, నివాసాలకు ప్రత్యేకంగా జోన్లు కేటాయిస్తారు. చెరువులు, కుంటలు, తాగునీటి పైపులైన్లు, మురుగు, వర్షపు నీటి కాలువలు, రహదారుల వెడల్పు వంటి వాటిని ప్రత్యేకంగా కేటగిరీలుగా విభజిస్తారు. కొత్త ఇళ్లు, వాణిజ్య భవనాల నిర్మాణ అనుమతులు మాస్టర్‌ప్లాన్ ప్రకారమే ఇస్తారు. రహదారుల వెడల్పు ఎంత ఉండాలనేది ఖరారు చేస్తారు. మార్కెట్లు, పాఠశాలలు, కార్యాలయాలు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తారు. ఒకసారి ఆమోదించాక 20 – 40 ఏళ్ల పాటు పట్టణ ప్రణాళిక కార్యాచరణ మొత్తం దానికి అనుగుణంగానే సాగుతుంది. జీఐఎస్ ద్వారా ఇళ్లకు అనుమతులు, రహదారుల వెడల్పు వంటి సమాచారం ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఆస్తిపన్ను, వాణిజ్య లైసెన్సు జారీ, పచ్చదనం, మౌలిక సదుపాయాలకు ఇదే ఆధారం.వరంగల్ ఆర్డీడీ పరిధిలో పరిస్థితి ఇదీ.. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో మొత్తం 46 మున్సిపాలిటీలు, 21 పట్టణాలకు 2023లో కొత్త మాస్టర్ప్లాన్ల రూపకల్పన జరిగింది. ఇందులో 17 పట్టణాలకు మాస్టర్‌ప్లాన్‌ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని 21 పట్టణాలకు కొత్తగా ప్లాన్ చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మాస్టర్‌ప్లాన్ – 2041 ఇటీవలే ప్రభుత్వ ఆమోదానికి నోచుకుంది. కానీ పూర్తి స్థాయిలో డీపీఆర్ కాలేదు. కాగా మందమర్రి, మంచిర్యాల, కోరుట్ల, మెట్పల్లి, వేములవాడ, వైరా, కొత్తపల్లి మాస్టర్‌ప్లాన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లు 2012, 2013, 2019లలో ఆమోదం పొందాయి. వైరా ఖమ్మం (సుడా)లో, కొత్తపల్లి కరీంనగర్ (సుడా)లో కలిశాయి. ఆదిలాబాద్, రామగుండం, కరీంనగర్ (సుడా), ఖమ్మం (సుడా) 2018 నుంచి కేంద్ర అమృత్ పథకంలో ఉన్నాయి. రామగుండం అమృత్ స్కీం మాస్టర్‌ప్లాన్ రివిజన్ కూడా జరిగింది. జనగామ, జగిత్యాల, సిరిసిల్ల, కాగజ్‌నగర్, నిర్మల్, భైంసా, పాల్వంచ, కొత్తగూడెంలలో పాత మాస్టర్‌ప్లాన్‌ను రివిజన్ చేశారు. ఎలాంటి ప్లాన్ లేని సత్తుపల్లి, మణుగూరు, నర్సంపేట, పరకాల, హుజూరాబాద్, ఇల్లందు, బెల్లంపల్లి జమ్మికుంట, వర్ధన్నపేట, తొర్రూర్, మరిపెడ, డోర్నకల్, మంధని, సుల్తానాబాద్, చెన్నూర్, లక్సెట్టిపేట్, క్యాతనపెల్లి, చొప్పదండి, రాయకల్, ధర్మపురి, ఖానాపూర్ పట్టణాలు కొత్త మాస్టర్ ప్లాన్‌కు నోచుకోలేదు. -
నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: పురపాలక, పట్టణాభివృద్ధి శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఈ సమావేశంలో మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి, స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి. కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, అర్భన్ రీ సర్వే ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ బి సుబ్బారావు, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ జె విద్యుల్లత, ఏపీజీబీసీఎల్ ఎండీ బి రాజశేఖరరెడ్డి, మెప్మా ఎండీ విజయలక్ష్మి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, తిరుపతి, గుంటూరు సహా వివిధ కార్పొరేషన్లలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, చేపట్టనున్న ప్రాజెక్టులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారు. సీఎం ఆదేశాలు ఇవే.. ►వర్షాకాలం ముగిసి పనుల సీజన్ మళ్లీ మొదలైనందున నగరాలు, పట్టణాల్లో రోడ్లపై దృష్టిపెట్టాలి. ►త్వరగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి. ►నీటి సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. ►సముద్రతీరం వెంబడి వస్తున్న పరిశ్రమలు సముద్రపు నీటినే డీ శాలినేషన్ చేసి వినియోగించేలా చూడాలి. ►విశాఖ నగరంలో రోడ్ల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ►భవిష్యత్తులో జనాభా పెరుగుతున్నందున పౌరులకు అసౌకర్యం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. ►ముడసర్లోవ పార్క్ అభివృద్ధి, ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో కమర్షియల్ కాంప్లెక్స్, మల్టీ లెవల్ కారు పార్కింగ్, భీమిలి, గాజువాక, అనకాపల్లిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి. ►విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం పనులను వేగతవంతం చేయాలి. ►కన్వెన్షన్ సెంటర్, గ్రీనరీ పనులను వేగవంతం చేయాలి. ►విమానాశ్రయానికి వెళ్లే మార్గం వెంబడి సుందరీకరణ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ►కృష్ణానది వెంబడి నిర్మించిన రక్షణగోడ వద్ద సుందరీకరణ చేపట్టాలి. ►జగనన్న కాలనీల్లో కూడా నీటి సంరక్షణపై దృష్టి పెట్టాలి. ►ప్లోటింగ్ సోలార్ ప్యానెల్స్, ఎస్టీపీల నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం తెస్తున్న అత్యాధునిక యంత్రాలను సద్వినియోగం చేయాలన్నారు. -
పట్టణ మాస్టర్ ప్లాన్లకు ఏకరూప మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో మాస్టర్ ప్లాన్ తయారీ, అమలు ఏకరీతిన ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపల్ అడ్మిని్రస్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకీకృత విధానం పాటించేలా పలు సూచనలతో ప్రభుత్వం జీవో నంబర్ 66 జారీ చేసింది. ప్రణాళికాబద్ధమైన అభివృద్ధితో రాష్ట్రంలో పట్టణీకరణను పెంపొందించేలా ఈ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచింది. వాస్తవానికి డెవలప్మెంట్ అథారిటీలు పరిమిత సాంకేతిక నైపుణ్యంతో మాస్టర్ ప్లాన్లను తయారు చేస్తుండటంతో ప్రాదేశిక ప్రణాళిక నాణ్యత సరిగా ఉండడంలేదు. పైగా డెవలప్మెంట్ అథారిటీల మాస్టర్ ప్లాన్ల తయారీలో మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అనుసరించడంలేదు. రిపోర్టింగ్ ఫార్మాట్స్, శాటిలైట్ ఇమేజ్ క్వాలిటీ, ఆర్ఎఫ్పీ ప్రిపరేషన్, కన్సల్టెన్సీ చార్జీల ఫిక్సింగ్, కన్సల్టెంట్లు, టౌన్ ప్లానింగ్ స్టాఫ్ పాత్ర, బాధ్యతలతో కూడిన మాస్టర్ ప్లాన్ తయారీలో ఏకరూపత ఉండడంలేదు. దాంతో రాష్ట్రంలోని 123 పట్టణ ప్రాంతాలు (యూఎల్బీలు), 21 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (యూడీఏ)ల్లో ఏకీకృత మాస్టర్ ప్లాన్ ఉండేలా ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ప్రస్తుతం ఆయా విభాగాల్లోని మాస్టర్ ప్లాన్లు ఏ దశలో ఉన్నాయో అవన్నీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రూపొందించాలని యూడీఏ, యూఎల్బీలను ఆదేశించింది. అభ్యర్థనలు, మ్యాప్ తయారీ, సర్వే, ఫీల్డ్ డేటా సేకరణ, మాస్టర్ ప్లాన్ నివేదిక, డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కోసం సాంకేతిక ఆమోదం, మాస్టర్‌ప్లాన్ ప్రచురణ, ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల స్వీకరణ, తుది మాస్టర్ ప్లాన్, మ్యాప్ తయారీకి ప్రభుత్వం నుంచి సాంకేతిక ఆమోదం, మంజూరు కోసం ప్రభుత్వానికి సమర్పణ వంటి అంశాలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
2020–21 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్ఎంసీలో చేసిన పనులివే
సాక్షి, హైదరాబాద్: గత సంవత్సరం కరోనా మహమ్మారి, లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో సైతం జీహెచ్ఎంసీ బాగా పనిచేసిందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ను అనువుగా మలచుకొని రోడ్లు, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తిచేశారని ప్రశంసించారు. ఈ ఆర్థిక సంవత్సరం (2021–22) చేయబోయే పనుల్లో నగరానికి వరదముంపు నివారణ చర్యల్లో భాగంగా రూ.858.32 కోట్లతో 49 నాలాల అభివృద్ధి పనుల్ని 15 ప్యాకేజీల కింద చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇంకా రూ.240 కోట్లతో జవహర్‌నగర్‌లో చెత్త నుంచి వెలువడే హానికర ద్రవాల (లీచెట్) శుద్ధి పనుల్ని చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మరో 11 కి.మీ.లింక్ రోడ్లు (రూ.275 కోట్లు)18 ఎఫ్‌ఓబీలు పూర్తికాగలవని పేర్కొన్నారు. 90 చెత్త సేకరణ, తరలింపు కేంద్రాలు ఏర్పాటవుతాయన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం విడుదల చేసిన మునిసిపల్ శాఖ వార్షిక నివేదికలో 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీహెచ్ఎంసీలో చేసిన పనుల్ని ప్రముఖంగా ప్రస్తావించారు. వాటిలోని ముఖ్యాంశాలు ఇవీ.... ► రూ.184 కోట్లతో దుర్గంచెరువుపై కేబుల్ బ్రిడ్జి. ►ప్రాజెక్టు పనుల కింద రూ.503.28 కోట్ల విలువైన 10 రోడ్డు ప్రాజెక్టులు పూర్తి . ►జీడిమెట్లలో రోజుకు 500 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో నిర్మాణ, వ్యర్థాల కూల్చివేతల ప్లాంట్ ఏర్పాటు. ►దక్షిణభారత దేశంలోనే మొదటిసారిగా 19.8 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ప్రారంభమైంది. దీని ద్వారా ఇప్పటి వరకు 109.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ►జవహర్‌నగర్‌లో 135 ఎకరాల్లోని 12 మిలియన్ టన్నుల వ్యర్థాలను శాస్త్రీయంగా క్యాప్ చేయడం జరిగింది. దీని వ్యయం రూ.144 కోట్లు. ►టీడీఆర్ ద్వారా జీహెచ్ఎంసీపై ఆర్థిక భారం తగ్గింది. 2020–21లో 129 టీడీఆర్ ధ్రువపత్రాలు జారీ. ►టీఎస్ బీపాస్ ద్వారా బల్దియా పరిధిలో 11,538 భవనాలకు నిర్మాణ అనుమతుల ద్వారా రూ.797.13 కోట్ల ఆదాయం వచి్చంది. ►అన్నపూర్ణ భోజన కేంద్రాల ద్వారా 2.53 కోట్ల భోజనాల పంపిణీ. ►16 గ్రీన్‌ఫీల్డ్ లింక్‌రోడ్లు (13.56 కి.మీ.) వినియోగంలోకి వచ్చాయి. వ్యయం రూ.154 కోట్లు. ►నాలా నెట్వర్క్ బలోపేతానికి ఎస్ఎన్డీపీ ఏర్పాటు. ►కరోనా..లాక్ డౌన్ సమయాన్ని సది్వనియోగం చేసుకొని 9 నెలల్లో జరగాల్సిన పనులు 2–3 నెలల్లోనే పూర్తి. ►సీఆర్ఎంపీ ద్వారా 383.44 కి.మీ.ల రోడ్ల రీకార్పెటింగ్. అందుకైన వ్యయం రూ.457 కోట్లు. ►ఇతరత్రా నిర్వహణ పనులు 10,670 మంజూరుకాగా, 5850 పనుల్ని రూ.1020.41 కోట్లతో పూర్తిచేసినట్లు తెలిపారు. ► ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్ వద్ద మూడు ఎఫ్‌ఓబీలు పూర్తి. జలమండలి పరిధిలో.. ►2 వేల చ.కి.మీ పరిధిలో విస్తరించిన నగరానికి నిత్యం జలమండలి 522.87 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ►నగరంలో నిత్యం వెలువడుతున్న 1950 మిలియన్ లీటర్ల మురుగు నీటిలో 772 మిలియన్ లీటర్ల మురుగు నీటిని సమర్థవంతంగా శుద్ధి చేస్తోంది. ► జీహెచ్ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం పొందేందుకు ఇప్పటివరకు 4.1 లక్షల మంది తమ ఆధార్ కార్డులను క్యాన్నెంబర్లకు అనుసంధానం చేసుకున్నారు. ఈ పథకంతో 9.7 లక్షల వినియోగదారులకు లబ్ది చేకూరనుంది. ►వేసవిలో కృష్ణా మూడు దశల పథకాలకు అవసరమైన తాగునీటిని సేకరించేందుకు రూ.1450 కోట్లతో సుంకిశాల భారీ ఇన్‌టేక్‌వెల్ పనులకు శ్రీకారం చుట్టారు. ►సమగ్ర మురుగునీటి మాస్టర్‌ప్లాన్ కింద నగరవ్యాప్తంగా 62 ఎస్టీపీలు నిర్మించాలని సంకలి్పంచారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 1257 మిలియన్ లీటర్ల శుద్ధి సామర్థ్యంతో 31 ఎస్టీపీలను ప్రతిపాదించారు. తొలివిడతగా రూ.1280 కోట్ల అంచనావ్యంతో 17 ఎస్టీపీల నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో కూకట్పల్లి,కుత్భుల్లాపూర్, శేరిలింగంపల్లి మున్సిపల్ సర్కిళ్లకు మురుగు కష్టాలు తీరనున్నాయి. మెట్రోరైలు.. ►నగరంలో 69 కి.మీ మార్గంలో రూ.21 వేల కోట్ల అంచనావ్యయంతో మెట్రో ప్రాజెక్టును పూర్తిచేశారు. గత నాలుగేళ్లుగా సుమారు రూ.18.34 కోట్ల మంది మెట్రో రైళ్లలో జరీ్నచేశారు. నాణ్యమైన భద్రతా ప్రమాణాలతో మెట్రో సేవలు అందిస్తోంది. డిజిటల్ టెక్నాలజీని మెట్రో సమర్థవంతంగా అమలు చేస్తోంది. మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ►రూ.34 లక్షల వ్యయంతో గండిపేట్ నుంచి గౌరెల్లి వరకు,హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55 కి.మీ మూసీ ప్రవాహ మార్గంలో నది సరిహద్దులు,బఫర్ జోన్ ఏర్పాటుకు వీలుగా సర్వే పూర్తిచేశారు. ►రూ.4.59 కోట్లతో నదిలో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా చేశారు. ►మూసీ తీరాల వెంట రూ.95 లక్షలు ఖర్చు చేసి ఫాగింగ్ చేపట్టారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో.. ►పీపీపీ విధానంలో బాటసింగారంలో 40 ఎకరాల స్థలంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేశారు. సుమారు రూ.40 కోట్ల అంచనా వ్యయంతో పార్కును నిర్మించారు. సుమారు 500 ట్రక్కులకు పార్కింగ్ వసతి, డార్మెటరీలు ఏర్పాటు చేశారు. ►కోకాపేట్లో 533 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్‌ఫీల్డు డెవలప్ మెంట్ ఏరియాగా అభివృద్ధి చేసేందుకు రూ.265 కోట్లు వ్యయం చేయనున్నారు. ఈ పనులు 18 నెలల్లో పూర్తిచేయనున్నట్లు పేర్కొన్నారు. ►రూ.61.8 కోట్ల వ్యయంతో ఉప్పల్, మెహిదీపట్నంలలో స్కైవాక్‌ల నిర్మాణం పురోగతిలో ఉంది. ►ఉప్పర్‌పల్లి పీవి ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అప్ అండ్ డౌన్ ర్యాంప్ నిర్మాణాన్ని రూ.36 కోట్లతో పూర్తిచేశారు. ►బాలానగర్ వద్ద రూ.387 కోట్ల అంచనా వ్యయంతో ఫ్లైఓవర్‌ను పూర్తిచేశారు. ►ఉప్పల్, ఏఎస్‌రావునగర్, ఐడీపీఎల్ వద్ద 3 ఫుట్ఓవర్ బ్రిడ్జీల పనులు పూర్తిచేశారు. ►నగరంలో 158 కి.మీ మేర విస్తరించిన ఉన్న ఓఆర్ఆర్కు రెండు వైపులా గ్రోత్‌కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఔటర్‌పై హైవే ట్రాఫిక్ నిర్వహణ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. ►ఓఆర్ఆర్పై 136 కి.మీ మార్గంలో ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు పని చురుకుగా సాగుతుంది. ► రూ.24.5 కోట్లతో ఔటర్‌రింగ్‌రోడ్డు సుందరీకరణ పనులు చేశారు. ►ఏడాదిగా హుస్సేన్‌సాగర్, దుర్గంచెరువు, సరూర్‌నగర్, సఫిల్గూడా, కటోరా హౌజ్, కాప్రాలోని రెండు చెరువులను ప్రక్షాళన చేశారు. ► ఔటర్వెంట రూ.47 కోట్లతో ఆటోమేటెడ్ బిందు సేద్యాన్ని చేపట్టారు. -
‘ఆ రెండు రోజులు సచివాలయ పరీక్షలకు బ్రేక్’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల నిర్వహణకు రెండు రోజుల అంతరాయం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1-8 వరకు సచివాలయ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే 2వ తేదీన వినాయక చవితి, 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉండటంతో ఆ రెండు రోజులు పరీక్షలు నిర్వహించడం లేదని పేర్కొన్నారు. మిగతా ఆరు రోజుల్లో.. రోజుకు రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 2,35,614 మంది పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. ఇందుకోసం 406 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. ఉదయం 10గంటల నుంచి 12:30గంటల వరకు.. మధ్యాహ్నం 2:30గంటల నుంచి 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ముగ్గురు నోడల్ అధికారుల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్ట్రాంగ్ రూమ్‌లో పరీక్షా పేపర్లు భద్రపరుస్తున్నామని వినయ్ చంద్ తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక గెజిటెడ్ అధికారిని నియమించామని.. పరీక్ష పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగులు కొరకు మరో 50 నిమిషాలు అదనంగా సమయాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు. కంట్రోల్ రూముల్లో టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విశాఖ కలెక్టరేట్‌కు సంబంధించి 0891-2590100, 0891-2590102, 180042500002, విశాఖ జీవీఎంసీకి సంబంధించి 0891-2869131,180042500009 నెంబర్లతో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే రోజు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తామన్నారు. విశాఖ సిటీతో పాటు రూరల్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్ష రాసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు వినయ్ చంద్. (చదవండి: గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు) -
గ్రామ, వార్డు సచివాలయ అభ్యర్థులకు కీలక సూచనలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్షలకు మరో వారం మాత్రమే ఉండటంతో మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ కమిషనర్ విజయ్ కుమార్ అభ్యర్థులకు పలు కీలకమైన సూచనలు చేశారు. పరీక్ష రాసే గంట ముందే అభ్యర్ధులు ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలని సూచించారు. ‘సాక్షి’ మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు. (చదవండి : సచివాలయ ఉద్యోగ పరీక్షలకు తేదీల ఖరారు) పరీక్షహాల్లోకి సెల్ఫోన్లతో పాటు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించేది లేదని విజయ్ కుమార్ స్పష్టం చేశారు. హాల్‌టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తెచ్చుకోవాలని చెప్పారు. మెరిట్ ఆధారంగానే ఉద్యోగాల భర్తీ జరుగుతుందని, దళారీలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, దాదాపు 22 లక్షల మంది పరీక్షలకు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు కూడళ్లలో, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు ఏర్పాటు చేయనున్నామని విజయ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు తెలుసుకోవాల్సినవి.. సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలు సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం పరీక్ష రాయనున్న 12.5 లక్షల మంది సెప్టెంబర్ 1వ తేదీ మధ్యాహ్నం పరీక్ష రాయనున్న 3 లక్షలమంది ఉదయం 10గంటల నుంచి 12:30 వరకు పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి 5గంటల వరకు పరీక్ష ఆన్లైన్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి 150ప్రశ్నలకు.. 150 మార్కులు పరీక్షల్లో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది నాలుగు తప్పులకు ఒక మార్కు పోతుంది రెండు భాషాల్లో ప్రశ్నాపత్రం టెక్నికల్ పేపర్ మాత్రం ఇంగ్లీష్‌లోనే ఉంటుంది గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ హాల్‌టికెట్, ఐడీకార్డు, పెన్ను మాత్రమే తీసుకురావాలి పరీక్షా కేంద్రాలను గుర్తించేందుకు ఏర్పాట్లు కూడళ్లు, బస్టాండ్లలో రూట్‌మ్యాప్‌లు, హెల్ప్‌డెస్క్‌లు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే కస్టడీలోకి తీసుకుంటాం పరీక్షా కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత -
‘ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగింది’
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను పెంచకున్నా ఆదాయం పెరిగిందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆస్తిపన్ను ద్వారా వచ్చే ఆదాయం 750 కోట్ల నుంచి 1450 కోట్ల రూపాయలకు చేర్చామన్నారు. తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను కేటీఆర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ శాఖ ఎంత గొప్పగా పనిచేసినప్పటికీ ఎవరు మెచ్చుకోరని అన్నారు. క్షేత్ర స్థాయిలోని ప్రజల నుంచి ప్రధాన మంత్రి కార్యాలయం వరకు సంబంధం ఉన్న సంస్థ తమదని పేర్కొన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తోందని.. జన సాంద్రత పెరిగినప్పుడు మౌళిక వసతులు కల్పించడంలో ఇబ్బందులు వస్తాయని తెలిపారు. ఆగస్టులో కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో 74 అర్బన్ లోకల్ బాడీలు ఉన్నాయని.. అవి రానున్న కొద్ది రోజుల్లో 146 కానున్నాయని ప్రకటించారు. అలాగే తొమ్మిది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయన్నారు. హైదరాబాద్‌లో రోడ్ల కోసం హెచ్ఆర్డీసీ, మూసీ నది ప్రక్షాళన కోసం మూసి డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. బాండ్లను సేకరించడం ద్వారా జీహెచ్ఎంసీ నూతన అధ్యయానికి శ్రీకారం చుట్టిందని గుర్తుచేశారు. కొల్లూరులో అతి పెద్ద డబుల్ బెడ్రూం ఇళ్ల టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నామని.. దీన్ని అందరు గుర్తించాలని కోరారు. కేంద్ర రక్షణ శాఖ సహకారం లేకపోవడం వల్ల రెండు పెద్ద స్కైవేలు ఆగిపోయాయని పేర్కొన్నారు. -
సర్కారీ కొలువులు సరైన సన్నద్ధత!
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 15 వేలకు పైగాఖాళీల భర్తీకి జీవో జారీచేసింది.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తదితర పరీక్షలకు సంబంధించి ‘స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్’ పేరుతో విధివిధానాలను విడుదల చేసింది.. పోలీస్ డిపార్టుమెంట్, ట్రాన్స్‌కో ప్రత్యేకంగా నిర్వహించే పరీక్షల వివరాలు ఇంకా విడుదల కాలేదు.. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగార్థులు ప్రిపరేషన్‌పై పూర్తిస్థాయిలో దృష్టిసారించారు. అయితే ఉద్యోగం ఏదైనా, పరీక్ష మరేదైనా ఉమ్మడిగా జనరల్ స్టడీస్ ఉంటుంది. ఇందులో సాధించిన మార్కులు ఎంపికలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో పరీక్షల విధివిధానాలు, జీఎస్ పేపర్‌పై స్పెషల్ ఫోకస్... టీఎస్పీఎస్సీ పరిధిలో ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జీహెచ్ఎంసీ, పీఆర్ అండ్ ఆర్డీ, ఆర్ అండ్ బీ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఈ ఉద్యోగాలకు విడివిడిగా పరీక్ష విధానాలను వెల్లడించకున్నా, స్థూలంగా అవగాహన పెంపొందించేలా స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. పేపరు సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం 1జనరల్ స్టడీస్ 150 150 150 నిమిషాలు 2సంబంధిత సబ్జెక్టు 150 300 150 నిమిషాలు మొత్తం 300 450 ఇంటర్వ్యూ 50 ఇది గెజిటెడ్ హోదాలో ఉండి, గ్రూప్-1, గ్రూప్-2 పరిధిలోకి రాని ఇతర పరీక్షలకు సంబంధించిన విధానంగా పేర్కొంది. నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు: గ్రూప్-1, గ్రూప్-2 పరిధిలోకి రాని నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష విధానం... పేపరు సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు సమయం 1జనరల్ స్టడీస్ 150 150 150 నిమిషాలు 2సంబంధిత సబ్జెక్ట్ 150 150 150 నిమిషాలు బీటెక్ అర్హతతో నిర్వహించే గెజిటెడ్ హోదా ఉద్యోగ పరీక్షలు, డిప్లొమా అర్హతతో నిర్వహించే నాన్ గెజిటెడ్ హోదా పరీక్షల్లో జనరల్ స్టడీస్ పేపర్ 150 మార్కులకు ఉంటుంది. ఇందులో బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేసే ఇంజనీరింగ్ ఉద్యోగాలు: విభాగం ఉద్యోగం ఖాళీలు ఐఅండ్‌సీఏడీ ఏఈ 252 ఏఈఈ 159 ఎంఏ అండ్ యూడీ ఏఈ 389 ఏఈఈ 126 జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ మేనేజర్ 146 పీఆర్ అండ్ ఆర్డీ ఏఈ 243 ఏఈఈ 161 టీఆర్ అండ్ బీ ఏఈ 243 ఏఈఈ 83 పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 539 ఎస్ఐ, 8009 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. వీటితోపాటు అగ్నిమాపక శాఖలోని ఫైర్‌మెన్ (6), స్టేషన్ ఫైర్ ఆపరేటర్ (9), డ్రైవర్ ఆపరేటర్ (85) ఉద్యోగాలను కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రత్యేక పరీక్ష ద్వారా భర్తీ చేస్తుంది. {పభుత్వం ప్రకటించిన ఉద్యోగాల్లో అత్యధికం పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నాయి. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పరీక్షల విధివిధానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. పీఆర్బీ పరీక్షల్లో అనుసరిస్తున్న విధానం.. సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ): అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. పేపరు మార్కులు ఇంగ్లిష్ 100 తెలుగు 100 అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 జనరల్ స్టడీస్ 200 ఇంగ్లిష్, తెలుగు అర్హత పేపర్లు కానిస్టేబుల్ రాత పరీక్ష: ఇప్పటి వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత అర్హతగా ఉంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్మీడియెట్ పాస్/ఫెయిల్ అర్హతగా నిర్దేశించారు. కానిస్టేబుల్ రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్‌కు 100 మార్కులు కేటాయించారు. ఇంగ్లిష్‌కు 30 మార్కులు, అర్థమెటిక్ అండ్ రీజనింగ్‌కు 70 మార్కులు ఉంటాయి. ట్రాన్స్‌కో, జెన్కో ప్రభుత్వం టీఎస్ ట్రాన్స్‌కో, టీఎస్ జెన్కోలకు సంబంధించి 2,681 ఖాళీలు ప్రకటించింది. వీటిలో డిప్లొమా, బీటెక్ అర్హతలుగా ఉండే సబ్ ఇంజనీర్, అసిస్టెంటు ఇంజనీర్ ఉద్యోగాలున్నాయి. వీటికి సంబంధించిన పరీక్షల పూర్తి విధివిధానాలు స్పష్టం కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో 100 మార్కులకు నిర్వహించిన ఏఈ పరీక్షలో 70 మార్కులు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్‌కు, 30 మార్కులు అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు ఉండేవి. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించే తొలి పరీక్షలో సిలబస్‌లో మార్పులు జరిగే అవకాశముంది. జీఎస్‌లో తెలంగాణ ప్రాంత అంశాలకు వెయిటేజీ ఇచ్చే అవకాశముందని టీఎస్ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. ట్రాన్స్‌కో, జెన్కో-ఖాళీలు: విభాగం ఉద్యోగం ఖాళీలు టీఎస్ జెన్కో ఏఈ 988 ఏఈఈ 92 టీఎస్ఎన్పీడీసీఎల్ ఏఈ 309 ఎస్ఈ 314 టీఎస్ఎస్పీడీసీఎల్ ఏఈ 427 ఎస్ఈ 153 ట్రాన్స్‌కో ఏఈ 224 ఎస్ఈ 174 ప్రిపరేషన్ ఏ ఉద్యోగ నియామక పరీక్ష అయినా అందులో తప్పనిసరిగా జనరల్ స్టడీస్ పేపరు ఉంటుంది. ఇందులో అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగనున్న పరీక్షలు కాబట్టి హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీల్లోని అంశాలపై విశ్లేషణాత్మక అవగాహన అవసరం. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు ప్రాధాన్యతనిస్తూ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ కొనసాగించాలి. సూచనలు: చరిత్ర అంశాలు చదివేటప్పుడు భారతదేశ చరిత్రతోపాటు, తెలంగాణ ప్రాంత చరిత్రలోని ముఖ్య అంశాలుగా పేర్కొనే శాతవాహనులు, కాకతీయులు తదితర రాజవంశాల కాలం నాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక, మత పరిస్థితులను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పాలిటీకి సంబంధించిన అంశాలను చదివేటప్పుడు జాతీయ స్థాయిలో రాజ్యాంగం, సవరణలు, రాజ్యాంగ సంస్థలు-వాటి విధుల గురించి తెలుసుకోవాలి. ఈ విభాగం నుంచి తెలంగాణ ప్రత్యేకంగా ఉండే అంశాలు తక్కువే అయినప్పటికీ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమైన సంస్థల ఏర్పాటు, అదే విధంగా ఉమ్మడి సంస్థల విభజన- పరిపాలన పరంగా ఉన్న అధికారాలు వంటి వాటిపై దృష్టిసారించాలి. జాగ్రఫీ విషయంలో తెలంగాణ ప్రాంతంపై శ్రద్ధ చూపాలి. ఈ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, పంటలు, రవాణా సౌకర్యాలు, రాష్ట్రం మీదుగా వెళ్లే జాతీయ రహదారులు, నీటి పారుదల వ్యవస్థ అంశాలు ముఖ్యమైనవి.ుంలో పంటలు- దిగుబడి, ఆర్థిక సర్వేలోని అంశాలన్నిటిపై దృష్టిసారించాలి. వర్తమాన వ్యవహారాలను అధ్యయనం చేయాలి. ధనల వరకు అన్ని విషయాలపై అవగాహన ఎంతో అవసరం.జనరల్ స్టడీస్‌పై పట్టు కోసం అభ్యర్థులు ముందుగా హైస్కూల్ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేసి, బేసిక్స్‌పై అవగాహన పెంపొందించుకోవాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోని పుస్తకాలను చదవడంతోపాటు, వాటిలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. వీటితో పాటు కరెంట్ అఫైర్స్కోసం తెలంగాణ రాష్ర్ట మాసపత్రిక చదవడం ఎంతో ఉపకరిస్తుంది. ప్రిపరేషన్ ప్రారంభిస్తే మేలు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఉద్యోగ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్‌పై ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఆయా డిపార్ట్మెంట్లు సొంతగా చేపట్టే నియామక పరీక్షల ఔత్సాహికులకు సిలబస్ పరంగా ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో ఆ ఆందోళన మరింత ఎక్కువవుతోంది. అయితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-2, గ్రూప్-3 కేడర్ పోస్టుల భర్తీకి ప్రకటించిన సిలబస్ మేరకే దాదాపు వీటి సిలబస్ కూడా ఉంటుంది. కాబట్టి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (పీఆర్బీ), ఇంజనీరింగ్ ఉద్యోగాల ఔత్సాహికులు ప్రస్తుతం గ్రూప్-2 స్థాయిలోని సిలబస్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించడం మేలు’ అనేది నిపుణుల అభిప్రాయం. -
ఉషాకుమారికి లైన్‌క్లియర్
మున్సిపల్ శాఖ నుంచి వెలువడిన ఉత్తర్వులు ఉడా వీసీగా నేడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఫలించని రామారావు యత్నాలు సాక్షి, విజయవాడ : ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారంలో ఉత్కంఠ తొలగింది. వీజీటీఎం ఉడా వైస్ చైర్మన్‌గా నియమితులైన పి.ఉషాకుమారిని చార్జ్ తీసుకోవాలని సూచిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు రావటంతో ఆమెకు లైన్‌క్లియర్ అయ్యింది. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. ఉడా వైస్ చైర్మన్ బదిలీ వ్యవహారం ఇప్పటివరకు అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుత వైస్ చైర్మన్ రామారావు సీటు కాపాడుకోవటానికి చివరి నిమిషం వరకు ప్రయత్నాలు సాగించారు. వాస్తవానికి గత నెల 31న పి.ఉషాకుమారిని ఉడా వైస్‌చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వైస్ చైర్మన్‌గా పనిచేస్తున్న రామారావు ఉడాకు వచ్చి ఎనిమిది నెలలు కూడా పూర్తికాకపోగా, బదిలీ క్రమంలో పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు అందాయి. దీంతో ఆయన పోస్టింగ్ కోసం ప్రయత్నాలు చేయటంతో పాటు అవకాశం ఉంటే ఉడాలోనే కొనసాగించాలని ముఖ్య కార్యదర్శి, మున్సిపల్ శాఖ కార్యదర్శిని కలిసి విన్నవించారు. ఈ క్రమంలో రామారావు ఇంకా రిలీవ్ కాకుండా కొనసాగుతున్నారు. ఉన్నతాధికారుల వద్ద ఆవేదన మొర పెట్టుకోవడంతో ఫలితం ఉంటుందని రామారావు భావించినా తాజా ఉత్తర్వులతో ఆయన రిలీవ్ కావటం అనివార్యంగా మారింది.