జూడో విస్తరణకు కృషి | try to judoo developements | Sakshi
Sakshi News home page

జూడో విస్తరణకు కృషి

Published Sat, Jul 30 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM

సమావేశంలో మాట్లాడుతున్న రామలక్ష్మయ్య

సమావేశంలో మాట్లాడుతున్న రామలక్ష్మయ్య

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఇటీవలే జిల్లా జూడో అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ క్రీడ విస్తరించేలా తగిన ప్రణాళికలు రూపొందిస్తామని అసోసియేషన్‌ అధ్యక్షుడు రామలక్ష్మయ్య అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. జూడోకు ఒలింపిక్స్‌లో గుర్తింపు ఉందని, ఈ క్రీడకు మంచి ఆదరణ లభిస్తుందన్నారు. అందరి సహకారంతో జిల్లాలో జూడోను అభివద్ధి చేస్తామని అన్నారు. డివిజన్‌ల వారీగా జూడో శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించే జూడో క్రీడాకారులకు తమ అసోసియేషన్‌ సహకారం ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర అసోసియేషన్‌ అవకాశం ఇస్తే త్వరలో జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి ఇన్విటేషన్‌ టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రస్థాయి అసోసియేషన్‌ జూడో టోర్నీలకు జిల్లాస్థాయిల్లో సెలక్షన్స్‌ నిర్వహించి ప్రతిభ కనబరిచేవారిని ఎంపిక చేస్తామన్నారు. సమావేశంలో జిల్లా జూడో అసోసియేషన్‌ సలహాదారుడు రాజేంద్రసింగ్, వైస్‌ చైర్మన్‌ డేవిడ్, ప్రధాన కార్యదర్శి దూమర్ల నిరంజన్, ఈసీ సభ్యుడు మొగులాల్‌ పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement