సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కల్యాణ్‌పై మంత్రి వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ పూటకో వేషం వేస్తున్నాడు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడావా? అని ప్రశ్నించారు. పవన్ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
కాగా, మంత్రి వేణుగోపాల్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ స్థిరత్వం లేని వ్యక్తి. ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటాడు.. ఇస్తే తీసుకుంటానంటాడు. నువ్వు చేసిన తప్పదాల గురించి నీ మనస్సాక్షిని అడుగు. తప్పులు ఉంటే చెప్పాలి కానీ చెప్పులు చూపిండం కాదు. నీ కార్యకర్తల మనోభావాలపై బండరాయి వేస్తున్నావు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్ నీకు లభించింది.
పవన్.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా?. పవన్.. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్. పవన్.. నువ్వు సినిమాల్లో హీరో కావచ్చు. రాజకీయాల్లో జీరో అని ప్రజలకు అర్థమైంది. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు నువ్వెక్కడున్నావ్. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు, అనేక పథకాలు ప్రభుత్వం అందిస్తోంది. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘పవన్‌కు కావాల్సింది చంద్రబాబే.. జనసేన కార్యకర్తలు కాదు’
Comments
Please login to add a commentAdd a comment