సాక్షి, తూర్పుగోదావరి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని.. ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని మంత్రి వేణు గోపాలకృష్ణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, టైట్లింగ్ యాక్ట్‌పై ఇంకా రూల్స్ తయారు కాలేదన్నారు.
‘‘భూములన్నీ లాక్కుంటున్నారని విష ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలు.. బినామీలు బయటపడతారని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకే కుటిల రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ మంత్రి వేణు ధ్వజమెత్తారు.
‘‘అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకున్నాడు. చంద్రబాబు సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడు. ఇంకా అమలులోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తాడట. తన పరిధిలో లేని రిజర్వేషన్లను ముందు పెట్టి కాపులను మోసం చేశాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలరా. చంద్రబాబు మాటల్లో స్పష్టత లేదు. వాలంటీర్ల విషయంలో వారికి వ్యతిరేకంగా ఈసీకి ఫిర్యాదు చేసింది ఎవరు....? చంద్రబాబు కాదా..?’’ అని మంత్రి వేణు ప్రశ్నించారు.
టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని బీజేపీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. కచ్చితంగా సీఐడీ ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ మంత్రి వేణు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment