
సాక్షి, తాడేపల్లి: ఈనాడు, రామోజీరావు తప్పుడు కథనాలపై మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు రాస్తోంది.. రామోజీరావు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
కాగా, తాడేపల్లిలో మంత్రి చెల్లుబోయిన మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రభుత్వంపై రామోజీరావు విషపు రాతలు రాస్తున్నారు. రామోజీరావుది నల్ల సిరా కాదు.. ఎల్లో సిరా. జర్నలిస్టుల విలువలను దిగజార్చొద్దు. రామోజీరావు ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్నారు. వాలంటీర్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు పథకాలు అందిస్తున్నది వాలంటీర్లే. సచివాలయ వ్యవస్థతో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాము. వాలంటీర్లపై తప్పుడు రాతలు రాయొద్దు. వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. సేవకులు. చంద్రబాబు హయంలో పథకాల గురించి వాస్తవాలు రాసారా?. టీడీపీ కరపత్రికగా ఈనాడు కథనాలు రాస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: రామోజీరావుకి వయసొచ్చినా స్వార్థంతో ఆలోచిస్తున్నారు: మంత్రి కారుమూరి
Comments
Please login to add a commentAdd a comment