సాక్షి, అమరావతి: బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని.. 1931లో జనగణన ఆధారంగానే బీసీలను ఇప్పటికీ లెక్కిస్తున్నారని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. కులాల వారీగా బీసీ జనగణన చేపట్టాలని అసెంబ్లీలో మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, వెనుకబడిన కులాల జనగణన అత్యవసరం అని.. నిజమైన నిరుపేదలకు ఎంతగానో ఉపయోగమన్నారు. సంక్షేమ పథకాల అమలకు ఇది ఎంతో అవసరమని మంత్రి పేర్కొన్నారు.
చదవండి: ప్రత్యేక వాదం వచ్చింది అందుకే.. మండలిలో మంత్రి బుగ్గన
‘‘90 ఏళ్లుగా బీసీల లెక్కలు దేశంలో లేవు. బీసీల జీవన స్థితిగతులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో బీసీల్లో 139 కులాలు ఉన్నాయి. కుల గణన కచ్చితంగా జరగాలి. ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వరంగా మారింది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో బీసీలకు అనేక మేళ్లు. బీసీలను చైతన్యం దిశగా సీఎం జగన్ నడిస్తున్నారు. ఇది బీసీల ప్రభుత్వం. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50 శాతం. కాంట్రాక్టు పనుల్లో బీసీలకు 50 శాతం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. వైఎస్సార్ చేయూత గొప్ప పథకం. బీసీల కోసం వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే.. వైఎస్ జగన్ పదడుగులు వేస్తున్నారని’’ మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment