
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు ఒక పెద్ద కాపీ క్యాట్.. వైఎస్సార్‌సీపీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కాపీ చేయడమే బాబు పని అంటూ వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదన్నారు. ‘‘పబ్లిసిటీ కోసమే చంద్రబాబు రచ్చబండ కార్యక్రమం. రైతులను ఏరోజైనా చంద్రబాబు పట్టించుకున్నారా?’’ అని మార్గాని భరత్ దుయ్యబట్టారు.
చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్: మంత్రి వేణు
చంద్రబాబు చేసేది పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని మంత్రి మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. రైతులను మభ్య పెట్టేందుకే చంద్రబాబు రచ్చబండ. రైతులకు చేసిన మేలు ఏమైనా ఉందా?’’ అంటూ మంత్రి వేణు మండిపడ్డారు.
చదవండి: Vision 2047 : దొందూ దొందే.. బాబు-పవన్ షేమ్ టూ షేమ్