
తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు.
సాక్షి, అమరావతి: తాను శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని అవమానించానని దుష్ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించానని తెలిపారు.
చదవండి: దమ్ముంటే కర్నూలు నుంచి పోటీ చెయ్!
‘‘కుడుపూడి చిట్టబ్బాయి వైఎస్ జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేశారు. చిట్టబ్బాయికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ భావించారు. ఆ కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవించింది. శెట్టిబలిజ వర్గానికి సీఎం జగన్ ప్రత్యేక కార్పొరేషన్ ఇచ్చారు. శెట్టిబలిజ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కి రాజ్యసభ అవకాశం ఇచ్చారని’’ మంత్రి వేణు అన్నారు.
‘‘నేనేమి చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు. నేను జాతిని అవమానించానని ఈనాడు, ఏబీఎన్, టివి 5 తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైవీ సుబ్బారెడ్డి కాళ్లకి నమస్కరించాను. చంద్రబాబు శెట్టిబలిజలకు రెండు సీట్లు ఇమ్మంటే అవమానించారు. చంద్రబాబు గతంలో శెట్టిబలిజలను ఎంతగా అవమానించారో తెలియదా?. నాకు జాతిని అమ్ముకోవాల్సిన కర్మ పట్టలేదు. 14 ఏళ్లలో చంద్రబాబు ఒక్క శెట్టిబలిజకైనా మంత్రి పదవి ఇచ్చాడా..? చైతన్యవంతులైన శెట్టిబలిజలు చంద్రబాబు ట్రాప్‌లో పడరని’’ మంత్రి వేణు అన్నారు.