
సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు కల్పించాలని ప్రశంసించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్ రికార్డ్‌ను బాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తే బాబు సహించలేకపోతున్నారని, ఇంటికి ఒక ఉద్యోగమని చెప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించడం దారుణమని, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment