
సాక్షి, అమరావతి: విజయవాడకు చెందిన ప్రముఖ టీడీపీ నేత, దివంగత సీనియర్ నాయకుడు దేవినేని రాజశేఖర్(నెహ్రూ) కుమారుడు దేవినేని అవినాష్ గురువారం వైఎస్సార్‌సీపీలో చేరారు. మరో టీడీపీ నేత కడియాల బుచ్చిబాబుతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవగా.. ఆయన వారికి కండువాలు కప్పి పారీ్టలోకి ఆహ్వానించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నవరత్నాలు నచ్చడంతోనే: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాలు తననెంతగానో ఆకర్షించాయని, అందుకే పార్టీలో చేరినట్టు మీడియాతో అవినాష్ చెప్పారు. నలభై ఏళ్లుగా తమ కుటుంబంతో కలిసి ప్రయాణించిన వారంతా వైఎస్సార్‌సీపీలో చేరతారని తెలిపారు. పార్టీ పటిష్టానికి కష్టపడి పనిచేస్తామని అవినాష్ పేర్కొన్నారు.