
సాక్షి, విజయవాడ: దశాబ్ధాలుగా కృష్ణ లంక లోతట్టు ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాద యాత్ర చేపట్టబోతున్నట్లు వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ దేవినేని అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఎన్నో ఏళ్లుగా కృష్ణలంక రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతున్నా గత ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణ లంక లోతట్టు ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి రూ. 126 కోట్లు కేటాయించారు. దీనికి కృతజ్ఞతగా ఈ నెల 31న ముఖ్యమంత్రికి ధన్యవాద యాత్ర చేపట్ట బోతున్నాం.
అమరావతిని అభివృద్ధి చేసి తీరుతామని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చారు. ఆ మాటకు అనుగుణంగానే ఆయన అడుగులు పడుతున్నాయి. కానీ ప్రతిపక్ష పార్టీ ప్రజల దృష్టి మరల్చడానికి రాజధాని అమరావతి పేరుతో ఎన్నో విధాలుగా కుట్రలు చేస్తోంది. త్వరలో జరగబోయే విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ పీఠాన్ని దక్కించుకుతీరుతామని' దేవినేని అవినాష్ పేర్కొన్నారు.