సాక్షి, విజయవాడ: లోకేష్‌ది పాదయాత్ర కాదని.. ఈవెనింగ్ వాక్ అంటూ విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ ఎద్దేవా చేశారు. విజయవాడకు టీడీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని లోకేష్ చూడాలని, అందుకోసమైనా రావాల్సిందేనని అవినాష్ పేర్కొన్నారు.
టీడీపీలో జోకర్లకు నా సూటి ప్రశ్న
దేవినేని అవినాష్ శనివారం సాక్షి మీడియాతో మాట్లాడుతూ, విజయవాడ ప్రజలకు, కనకదుర్గమ్మ అమ్మవారికి టీడీపీ తరపున నారా లోకేష్ క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతే లోకేష్ విజయవాడలో నడవాలన్నారు. దుర్గగుడిలో క్షుద్రపూజలు చేయించిన పార్టీ టీడీపీ. బెజవాడ టీడీపీలో బఫూన్లు.. జోకర్లకు నా సూటి ప్రశ్న. సిగ్గుంటే మీ హయాంలో రిటైనింగ్ వాల్ ఎందుకు కట్టలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.
పాదయాత్ర అట్టర్ ప్లాప్..
‘‘వరదలొస్తే ప్రజలకు ఇబ్బందుల పడకుండా రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్. లోకేష్ పాదయాత్ర గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే జాకీలేసి లోకేష్‌ను లేపాలని చూస్తున్నారు. పాదయాత్ర అట్టర్ ప్లాప్ అవ్వడంతో నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. వాళ్లలో వాళ్లే గొడవలు పడి బ్యానర్లు చించేస్తున్నారని మా పై బురద జల్లుతున్నారు. పాదయాత్ర పేరు చెబితేనే టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. ఖర్చు తట్టుకోలేక.. జనాన్ని తీసుకురాలేక... తలలు పట్టుకుంటున్నారు’’ అంటూ దేవినేని అవినాష్ చురకలు అంటించారు.
సీఎం జగన్ చేసిన అభివృద్ధి చూడు..
ఈవెంట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాంకి, నారా లోకేష్ పాదయాత్రకు తేడాలేదు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ విజయవాడ నగరమంతా నడవాలని కోరుకుంటున్నా.. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని చూడాలని కోరుతున్నానని అవినాష్ అన్నారు.
బుద్ధావెంకన్న వ్యాఖ్యలకు అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్:
బుద్ధావెంకన్న వ్యాఖ్యలకు దేవినేని అవినాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ మా ఇంటికొస్తే రాజకీయం చేస్తున్నారు. బుద్ధా వెంకన్న ఓ బఫూన్...కాల్ మనీ నేరస్తుడు...నెత్తిమీద పైసా పెట్టిన అమ్ముడుపోడు. వాళ్ల జీవితంలో ఏనాయకుడైనా వాళ్ల ఇంటి వైపు చూశాడా. సీఎం మా ఇంటికొచ్చి నాలుగు మంచి మాటలు చెబితే టీడీపీ నేతలు నీచపు రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. రిటైనింగ్ వాల్, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ల వద్ద లోకేష్ సెల్ఫీ దిగాలంటూ నారా లోకేష్‌కు దేవినేని అవినాష్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment