సాక్షి, విజయవాడ: సచివాలయ వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విజయవాడ 5వ వార్డు అరుళ్‌నగర్ వార్డు సచివాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ తూర్పు ఇన్‌చార్జి దేవినేని అవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ తదితరలు పాల్గొన్నారు. అనంతరం గుణదల మూడవ వార్డులో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. 'సీఎం వైఎస్ జగన్ ఆలోచనల నుంచి పుట్టిన సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే పాలన అందుతోంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటికే వృద్ధులకి పెన్షన్ అందించగలుగుతున్నాం. సచివాలయ వ్యవస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఆదర్శమైంది. తన స్వచ్ఛమైన పరిపాలనతో సీఎం వైఎస్ జగన్ దేశంలో టాప్ ఫైవ్‌లో నిలిచారు. (గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ దుస్థితి: దేవినేని)
ప్రజల సంక్షేమానికి ఇంతటి మంచి వ్యవస్థ ప్రారంభించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. గతంలో చాలా మంది ప్రజల వద్దకే పాలనంటూ ప్రగల్భాలు పలికి విఫలమయ్యారు. కరోనా సమయంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వాలంటీర్లు, ఉద్యోగులు పనితీరుపై ప్రధాని ప్రశంసలు సైతం దక్కాయి' అని దేవినేని అవినాష్ అన్నారు. (కోటి కోర్కెలు తీర్చిన గ్రామ స్వరాజ్యం)
Comments
Please login to add a commentAdd a comment