
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి జగన్ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు.
దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి అమలుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద పిల్లలకు మేనమామలా అండగా నిలిచారని అన్నారు. అమ్మ ఒడితో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయని అన్నారు. పిల్లల సంక్షేమం విషయంలో కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయోజనం లేదని, రాష్ట్ర జనం సంక్షేమ సారధి వైఎస్ జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఇకపై ఉండదని బొప్పన భవ కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment