Boppana Bhava Kumar
-
‘పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం లక్ష్యం’
సాక్షి, విజయవాడ : మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. సున్నా వడ్డీ, ఆసరా, చేయూత పథకాల ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలోకి పొదుపు సంఘాల మహిళ ఖాతాల్లో 45 వేల కోట్ల రూపాయలు జమయ్యాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నేటితో వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు ముగియడంతో చివరి రోజు జరిగిన ఈ వేడుకల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్, వివిధ డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 28,29,31 డివిజన్లలోని పొదుపు సంఘాల లబ్ధిదారులకు మల్లాది విష్ణు ఆసరా చెక్కును అందజేశారు. ('మహిళల జీవితాలను మార్చడానికే ఆ పథకం') ఆయన మాట్లాడుతూ.. ‘2019 మార్చి నాటికి బకాయిలు ఉన్న పొదుపు సంఘాలకు నాలుగు విడతల్లో రుణ మాఫీ చేస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోని రాగానే ఇచ్చిన హామీని నిలుపుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు. గత ప్రభుత్వం మీటింగ్‌లకు, బల ప్రదర్శనకు మాత్రమే అన్నట్లుగా డ్వాక్రా సంఘాలను చూశారు. మహిళల జీవన స్థితిగతులు మెరుగుపడి వారి కాళ్ల మీద వారు నిలబడేలా చెయ్యాలనాదే సీఎం వైఎస్ జగన్ ఉద్దేశ్యం. ప్రతిపక్షాల మాటలను విలువ లేదు. సీఎం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు. నగదు బదిలీ ద్వారా ఆర్ధిక స్థితిగతులు మెరుగు పడతాయని మేధావులే చెబుతున్నారు. ఆసరాతో వారం రోజులుగా ఏపీ మహిళాలకు పండగ వాతావరణం నెలకొంది.’ అని పేర్కొన్నారు. -
బోండా ఉమాకు మెదడువాపు వచ్చినట్లుంది
సాక్షి, విజయవాడ: వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలపై బోండా ఉమా మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయనకు మెదడువాపు వచ్చిందేమో అనిపిస్తుంది అన్నారు వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్. రేపు ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బొప్పన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అండ్ కో హైద్రాబాద్‌లో, ఏపీలో వీళ్ళే అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నారు. బోండా ఉమా వెన్ను పోటు పొడిచింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కాదు.. మీ లీడర్ చంద్రబాబు. మా నాయకుడు దమ్ము, ధైర్యంతో పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నుంచి 2019 వరకూ, ఇన్ని ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిన పనులు, మీరు చేసిన పనులపై చర్చిద్దాం. బోండా ఉమా, వాళ్ళ పార్టీ నాయకులు రండి. నేను, మా పార్టీ నాయకులు వస్తాము. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చిద్దాం. ఏ విషయం పైన అయిన చర్చించడానికి మేము సిద్ధం. మీరు రెడీనా.. మీకు దమ్ము ఉందా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి ఎలాంటి పిచ్చి కూతలు కుసిన ఖబడ్దార్. ప్రజలు మీకు ఈ సారి ఆ 23 సీట్లు కూడా ఇవ్వరు అని’ అని బొప్పన హెచ్చరించారు. బోండా ఉమాను మహిళలే కొడతారు: నాగేశ్వరరావు బోండా ఉమా చాలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు మాజీ కార్పొరేటర్ నాగేశ్వరావు. ‘మా నాయకుడు పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ఈ రోజు అవి అన్ని తీరుస్తున్నారు. మా నాయకుడిని ప్రపంచమే మెచ్చుకుంటుంది. అసలు రంగుల సంప్రదాయం తీసుకోచ్చిందే టీడీపీ. ఒక కాపు నాయకుడిగా ఉండి కాపులకు బోండా ఉమా ఏం చేశాడు. మా ముఖ్యమంత్రి జగన్‌ని ఏమన్నా.. ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పథకాలకు అడ్డుపడిన నీ నియోజకవర్గంలో ఉన్న మహిళలే నిన్ను కొడతారు’ అంటూ బోండా ఉమాపై నాగేశ్వరా రావు మండిపడ్డారు. -
విజయవాడను ఆదర్శ నగరంగా మార్చుతాం
సాక్షి, విజయవాడ: ఐదేళ్లలో విజయవాడను ఆదర్శనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. నగర అభివృద్ధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారన్నారు. బుధవారం విజయవాడలో కేఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుంచి రాణిగారి తోట వరకు ఆరున్నర కోట్లతో మంచినీటి పైప్‌లైన్ పనులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుతో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వీరికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను ఆశీర్వదించండని కోరారు. ఈ కార్యక్రమానికి వైస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగరాధ్యక్షులు బొప్పన భవకుమార్ హాజరయ్యారు. టీడీపీ నిజాలు మాట్లాడదని తెలిసిపోయింది ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ.. రాష్ట్రాన్నిసమగ్రాభివృద్దివైపు నడిపించాలన్నదే సీఎం జగన్ లక్ష్యమన్నారు. జగన్ పాలనలో పేదల కష్టాలు కడతేరిపోతాయని పేర్కొన్నారు. ఐదేళ్లు నిర్లక్ష్యానికి గురైన విజయవాడ అభివృద్ధికి ఆయన అవసరమైన నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విజయవాడ అభివృద్ధికి బంగారుబాటలు పడ్డాయన్నారు. టీడీపీ పాలనలో పట్టిన గ్రహణం వీడిందని పేర్కొన్నారు. సీఎం జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకే చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. రాజధాని డ్రామా ఫెయిల్ కావడంతో ఇప్పుడు జనచైతన్య యాత్ర డ్రామా మొదలు పెట్టారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు స్పందించరని స్పష్టం చేశారు. టీడీపీ నిజాలు మాట్లాడదన్న సత్యాన్ని గ్రహించే జనం వారికి గుణపాఠం చెప్పారన్నారు. రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగరేస్తాం దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్పోరేటర్లు ఉన్న డివిజన్లను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చూపారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తుందన్నారు. కృష్ణలంక కరకట్ట నిర్మాణానికి రూ.125 కోట్లు కేటాయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. రాబోయే కార్పోరేషన్ ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో విజయకేతనం ఎగురవేస్తామన్నారు. బొప్పన భవకుమార్ మాట్లాడుతూ.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా మంచినీటి పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమన్నారు. ఆర్భాటాలు టీడీపీ సొంతమైతే.. అన్ని ప్రాంతాల అభివృద్ధి మా నైజమన్నారు. -
‘థాంక్యూ సీఎం జగన్ మామయ్య’
సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి జగన్ మామయ్య సీఎం కావడం తమ పాలిట వరంగా భావిస్తున్నామని చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు. రాణిగారి తోటలో శనివారం సీఎం జగన్ మాస్క్‌లు ధరించి విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. థాంక్యూ సీఎం, జై జగన్ మామయ్య అంటూ నినాదాలు చేశారు. అనంతరం సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ పాల్గొన్నారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అమ్మ ఒడి అమలుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లలకు మేనమామలా అండగా నిలిచారని అన్నారు. అమ్మ ఒడితో సంక్రాంతి సంబరాలు ముందే వచ్చాయని అన్నారు. పిల్లల సంక్షేమం విషయంలో కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి పక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా ప్రయోజనం లేదని, రాష్ట్ర జనం సంక్షేమ సారధి వైఎస్ జగన్ వైపే ఉన్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ ఇకపై ఉండదని బొప్పన భవ కుమార్ అన్నారు. -
ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలి: దేవినేని అవినాష్
సాక్షి, విజయవాడ: రాష్టంలో 7 నెలలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుభిక్షమైన పాలన అందించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. విజయవాడలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ వెల్ఫేర్ సోసైటీ వారు శుక్రవారం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్, నగర అధ్యక్షుడు బొప్పన భవ కూమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ సోసైటీ అధ్యక్షుడు కోసరాజు వెంకటేశ్వరావు, సొసైటీ సభ్యులకు కండువా కంపి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన అప్పులను తట్టుకుని సీఎం జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. రాజధాని కట్టే స్థోమత ప్రస్తుతం మనకు లేదని, త్వరలో సీఎం జగన్ రాజధానిపై మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు. ప్రజల మనసులో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాలన చెరగని ముద్ర వేస్తుందని ఎమ్మెల్సీ వ్యాఖ్యానించారు. ఇక దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా తన తండ్రి దేవినేని నెహ్రూని నమ్ముకున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇస్తే నిలబడే వ్యక్తని, తనని సొంత తమ్ముడిలా చూస్తున్నారని అన్నారు. 2014లో తాను నష్టపోయినా ఇచ్చిన మాటకోసం నిలబడ్డానని, అమ్మఒడితో సీఎం జగన్ తల్లులకు అండగా నిలిచారన్నారు. 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్ ఉండాలని సామాన్య ప్రజానీకం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాయలో పడి భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, మీ పిల్లల భవిష్యత్తుకు సీఎం జగన్ భరోసా ఇస్తున్నారని అన్నారు. ఇక చంద్రబాబు జోలి పట్టుకుని ఎందుకు భిక్షాటన చేశారోనని, ఇందుకు ఆయన ఆత్మ విమర్శ చేసుకోవాలని హితువు పలికారు. రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి చంద్రబాబు రాజకీయ లబ్థి పోందాలని చూస్తున్నారని అవినాష్ పేర్కొన్నారు. -
‘గతంలో ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి ఇవ్వలేదు’
సాక్షి, విజయవాడ: విహారయాత్రకు అమెరికా వెళ్లి వచ్చిన గద్దె రామ్మెహన్ తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ అన్నారు. నాలుగు వేల మంది పేదలకు ఇల్లు, ఇళ్లస్థలాలు ఇప్పిస్తామని చెప్పి మోసం చేసి గెలిచిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీడీపీ ఎమ్మెల్యేలకు రూ.కోటి చొప్పున నిధులు ఇస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా స్వాగతిస్తామన్నారు. దేవినేని అవినాష్ పార్టీలోకి రావటాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నచ్చే అనేకమంది పార్టీలో చేరుతున్నారన్నారు.