సాక్షి, విజయవాడ: వైసీపీ అభివృద్ధి కార్యక్రమాలపై బోండా ఉమా మాట్లాడుతున్న తీరు చూస్తే ఆయనకు మెదడువాపు వచ్చిందేమో అనిపిస్తుంది అన్నారు వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్. రేపు ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బొప్పన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు అండ్ కో హైద్రాబాద్‌లో, ఏపీలో వీళ్ళే అభివృద్ధి చేసినట్టు చెప్పుకుంటున్నారు. బోండా ఉమా వెన్ను పోటు పొడిచింది మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాదు.. మీ లీడర్ చంద్రబాబు. మా నాయకుడు దమ్ము, ధైర్యంతో పార్టీ నుంచి బయటికి వచ్చి రాజీనామా చేసి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు. 2014 నుంచి 2019 వరకూ, ఇన్ని ఏళ్లలో మీ ప్రభుత్వం చేసిన పనులు, మీరు చేసిన పనులపై చర్చిద్దాం. బోండా ఉమా, వాళ్ళ పార్టీ నాయకులు రండి. నేను, మా పార్టీ నాయకులు వస్తాము. ఎవరు ఎంత అభివృద్ధి చేశారో చర్చిద్దాం. ఏ విషయం పైన అయిన చర్చించడానికి మేము సిద్ధం. మీరు రెడీనా.. మీకు దమ్ము ఉందా. మా నాయకుడు జగన్‌మోహన్ రెడ్డి గురించి ఎలాంటి పిచ్చి కూతలు కుసిన ఖబడ్దార్. ప్రజలు మీకు ఈ సారి ఆ 23 సీట్లు కూడా ఇవ్వరు అని’ అని బొప్పన హెచ్చరించారు.
బోండా ఉమాను మహిళలే కొడతారు: నాగేశ్వరరావు
బోండా ఉమా చాలా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారన్నారు మాజీ కార్పొరేటర్ నాగేశ్వరావు. ‘మా నాయకుడు పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకుని ఈ రోజు అవి అన్ని తీరుస్తున్నారు. మా నాయకుడిని ప్రపంచమే మెచ్చుకుంటుంది. అసలు రంగుల సంప్రదాయం తీసుకోచ్చిందే టీడీపీ. ఒక కాపు నాయకుడిగా ఉండి కాపులకు బోండా ఉమా ఏం చేశాడు. మా ముఖ్యమంత్రి జగన్‌ని ఏమన్నా.. ప్రభుత్వం ద్వారా ఇస్తున్న పథకాలకు అడ్డుపడిన నీ నియోజకవర్గంలో ఉన్న మహిళలే నిన్ను కొడతారు’ అంటూ బోండా ఉమాపై నాగేశ్వరా రావు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment