మట్టి వద్దు.. హోదాకావాలి | Do not want the status of the soil | Sakshi
Sakshi News home page

మట్టి వద్దు.. హోదాకావాలి

Published Tue, Oct 27 2015 12:53 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది గుప్పెడు మట్టి, చెంబుడు నీరు కాదని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ
ప్రధానికి మట్టి, నీరు పంపించిన వైనం

 
విజయవాడ (లబ్బీపేట) : ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది గుప్పెడు మట్టి, చెంబుడు నీరు కాదని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీ పీసీసీ) పిలుపు మేరకు వందలాది మంది విద్యార్థులతో సోమవారం ప్రత్యేక హోదా కోరుతూ టిక్కిల్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు మట్టిముంతలతో మట్టి, నీరును చేతపట్టి ప్రదర్శనలో పాల్గొన్నారు.

మొగల్రాజపురం మదర్ థెరిస్సా విగ్రహం వరకూ ప్రదర్శన సాగింది. అనంతరం వాటిని  ప్రధానికి పంపించేందుకు ప్యాక్ చేశారు.  దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపన రోజు ప్రధాని ప్రత్యేక హోదా ప్రకటిస్తారని ఎదురుచూసిన ఆంధ్రులకు నిరాశేమిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు మాట్లాడుతూ ఇప్పటికైనా చంద్రబాబు అన్నిపార్టీలతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement