
త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవసరానికో అబద్ధం’’. ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో డా. శివకుమార్ చికిన సహకారంతో డా. జై జగదీశ్ బాబు యలమంచిలి నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టారు. మరో నిర్మాత సురేష్‌బాబు గౌరవ దర్శకత్వం వహించారు.
ఆయాన్ బొమ్మాళి, కృష్ణమూర్తి, డా. జై జగదీశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో నిజానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అబద్ధానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పే సందేశంతో మా చిత్రం రూ΄పొందుతోంది’’ అన్నారు. ఈ ప్రారంప్రాత్సవంలో విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ , తెలంగాణ పో లీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ కోలేటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సీహెచ్ మోహన్ చారి.
Comments
Please login to add a commentAdd a comment