
సాక్షి, గుడివాడ : కృష‍్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు జనం లేక వెలవెలపోయింది. ఓ వైపు సభకు అనుకున్నంతగా జనం రాకపోగా మరోవైపు వచ్చినవారు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెనుతిరిగారు. ఈ సభకు మూడు వేలు దాటని జనం, బాబు వచ్చేసరికి సగం ఖాళీ అయ్యారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో వచ్చిన జనాన్ని తెలుగు తమ్ముళ్లు అష్టకష్టాలు పాలు చేశారు. దాహం వేస్తే కనీసం మంచినీళ్లు ఇవ్వకపోగా మజ్జిగ ప్యాకెట్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిపోయి జనం మీదికి విసిరేశారు. దాహంతో తల్లడిల్లిన వారు మజ్జిక ప్యాకెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
ఎండకు, తమ్ముళ్లు పెట్టే ఇబ్బందులకు తాళలేక వృద్ధుడు తప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని 108లో ఆస్పత్రికి తరలించారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించిన తెలుగు తమ్ములు వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకున్నారు. డబ్బులు ఇచ్చి బిర్యాని ప్యాకెట్లు పంచినా జనం లేకపోవడంతో టిడిపి నాయకుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జనం లేక అసహనంతో అటు మోదీని, ఇటు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మధ్యలో కేసీఆర్‌ను విమర్శించి తన ప్రసంగాన్ని ముగించి చంద్రబాబు వెళ్ళిపోయారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment