
సాక్షి, విజయవాడ: దిశ అత్యాచార ఘటనలోని నిందితులకు రెండు బెత్తం దెబ్బలు సరిపోతాయంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడటం ఆయన ఆజ్ఞానికి నిదర్శనమని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఏద్దేవా చేశారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ తరువాత ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దేశం మొత్తం దిశకు మద్దతుగా నిలబడితే పవన్ కల్యాణ్ మాత్రం నిందితులకు మద్దతుగా నిలబడుతున్నారని దేవినేని అవినాష్ విమర్శించారు.
చదవండి: రెండు దెబ్బలు వేస్తే నేరాలు కంట్రోల్ అవుతాయా?