అవినాష్‌కు ఫోన్‌లో వైఎస్ జగన్ పరామర్శ
హైదరాబాద్ : మాజీమంత్రి దేవినేని నెహ్రూ మృతి పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. నెహ్రూ కుమారుడు అవినాష్‌తో ఆయన సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఆ కుటుంబానికి వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా దేవినేని నెహ్రూ ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నెహ్రూ మృతికి సంతాపం తెలిపారు. రేపు ఆయన అంత్యక్రియలు విజయవాడలో జరగనున్నాయి.