కేశినేని నాని వ్యాఖ్యలు సిగ్గుచేటు | Devineni Avinash Fires On Kesineni Nani Over Durga Gudi Flyover | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఎందుకు హడావుడి?: అవినాష్‌

Published Mon, Aug 24 2020 6:38 PM | Last Updated on Mon, Aug 24 2020 7:17 PM

Devineni Avinash Fires On Kesineni Nani Over Durga Gudi Flyover - Sakshi

సాక్షి, విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్‌పై కేశినేని నాని మాట్లాడడటం సిగ్గు చేటు అన్నారు వైఎస్సార్‌సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్. ‘అధికారంలో ఉండగా పూర్తి చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నార’ని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందంగా ఉన్నారన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. శాసన రాజధాని అమరావతి అభిృవృద్దికి వైస్సార్సీపీ కట్టుబడి ఉందని అవినాష్‌ స్పష్టం చేశారు.  (రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement