Durgagudi flyover construction
-
కేశినేని నాని వ్యాఖ్యలు సిగ్గుచేటు
సాక్షి, విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్‌పై కేశినేని నాని మాట్లాడడటం సిగ్గు చేటు అన్నారు వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్. ‘అధికారంలో ఉండగా పూర్తి చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నార’ని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందంగా ఉన్నారన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. శాసన రాజధాని అమరావతి అభిృవృద్దికి వైస్సార్సీపీ కట్టుబడి ఉందని అవినాష్ స్పష్టం చేశారు. (రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?) -
తాగి పడుకున్న దద్దమ్మలా మాట్లాడేది..
సాక్షి, విజయవాడ: దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం రోజున దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం. 97 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. మాది చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చంద్రబాబు ఎప్పుడో పుష్కరాలకు ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడు. (చదవండి: 'నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను') విజయవాడకి కేంద్రం కేటాయించిన నిధులను కూడా టీడీపీ ప్రభుత్వం అమరావతికి మళ్లించింది. అమరావతి అనే బ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడు. కానీ మా ప్రభుత్వం విజయవాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, ఇతర నాయకులు విజయవాడ అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే గత ఐదేళ్లలో మాత్రం చంద్రబాబుతో నిధులు ఇప్పించులేకపోయారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలంటూ హడావిడి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఏడాదిలోనే అన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఐదేళ్లలో ఎంపీగా విజయవాడకు కేశినేని నాని ఏం చేశారో చెప్పాలి. ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదు. అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడు. అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఫ్లైఓవర్ పనులపై కలెక్టర్ అసంతృప్తి
వేగంగా పూర్తి చేయాలని ఆదేశం టీమ్ వర్క్‌గా పని చేయాలని సూచన శంకుస్థాపన వేదిక ఏర్పాట్ల పరిశీలన విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు సంబంధించి మోడల్ గెస్ట్‌హౌస్ ప్రాంతంలో ఏడు మీటర్ల లోతులో డ్రిగ్గింగ్ చేపట్టాల్సి ఉండగా, కేవలం 3 మీటర్ల వరకే చేయడంపై కలెక్టర్ బాబు.ఎ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ అంతర్ రహదారి నిర్మాణం చేపట్టాల్సి ఉన్నందున వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫ్లైఓవర్ పనుల శంకుస్థాపనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితీష్ గట్కారీ ఈనెల 5న నిర్వహిస్తారని ఆయన తెలిపారు. సోమవారం భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్లో ఆయన అధికారులతో కలిసి పర్యటించి శంకుస్థాపన కార్యక్రమ వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఫ్లైఓవర్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వచ్చే ఏడాది జూలై 15 నాటికి పూర్తి చే యాలని, వాస్తవంగా చేసే పనులపై ఎప్పటికపుక్పడు టెలిగ్రామ్, వాట్సప్ ద్వారా వివరాలను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు, నిర్మాణ సంస్థ సిబ్బంది టీమ్ వర్క్‌గా పని చేస్తేనే నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చేయగలుగుతామని కలెక్టర్, ఎన్‌హెచ్, సోమ ప్రాజెక్టు అధికారులతో పేర్కొన్నారు. ఒకే జోన్‌గా పుష్కర ఘాట్లు దుర్గాఘాట్ నుంచి ఇబ్రహీంపట్నం, ఫెర్రీ వరకు ఒకే జోన్‌గా పుష్కర స్నాన ఘట్టాల ప్రతిపాదనలు చేస్తున్నందున దానికి అనుగుణంగా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉందని అన్నారు. అలాగే దుర్గా ఫ్లైఓవర్ వంతెన పనులతో సమాంతరంగా చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ఇరిగేషన్, మున్సిపల్, రోడ్లు, భవనాలు, దుర్గగుడి, పోమ కంపెనీ ప్రతినిధులు బృందంగా ఏర్పడి ప్రణాళికలు రూపొందించి మ్యాప్‌ను 24 గంటల్లో అందించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, సబ్‌కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఇరిగేషన్ ఎస్ఈ సి.రామకృష్ణ, ఆర్అండ్బీ అధికారులు మోషే, ఆంజేయులురెడ్డి, సోమ ప్రాజెక్టు మేనేజర్ సతీష్ పాల్గొన్నారు.