సాక్షి, విజయవాడ: దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణ పనులను శుక్రవారం రోజున దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఆగస్ట్ నెలలో దుర్గగుడి ఫ్లైఓవర్‌ని ప్రారంభిస్తాం. 97 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. మాది చంద్రబాబులా మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. చంద్రబాబు ఎప్పుడో పుష్కరాలకు ఫ్లైఓవర్ పూర్తి చేస్తాం అని చెప్పి మాట తప్పారు. విజయవాడ అభివృద్ధిని చంద్రబాబు పూర్తిగా వదిలేశాడు. (చదవండి: 'నా తండ్రి ఆశయాలని కొనసాగిస్తాను')
విజయవాడకి కేంద్రం కేటాయించిన నిధులను కూడా టీడీపీ ప్రభుత్వం అమరావతికి మళ్లించింది. అమరావతి అనే బ్రమరావతిలో ప్రజలను చంద్రబాబు ఉంచాడు. కానీ మా ప్రభుత్వం విజయవాడలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. కేశినేని నాని, గద్దె రామ్మోహన్, ఇతర నాయకులు విజయవాడ అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అయితే గత ఐదేళ్లలో మాత్రం చంద్రబాబుతో నిధులు ఇప్పించులేకపోయారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో చర్చలంటూ హడావిడి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ ఏడాదిలోనే అన్నీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఐదేళ్లలో ఎంపీగా విజయవాడకు కేశినేని నాని ఏం చేశారో చెప్పాలి. ఇంట్లో తాగి పడుకున్న దద్దమ్మలు ఇప్పుడు మా గురించి మాట్లాడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న ఎవరినీ చట్టం వదలదు. అచ్చెన్నాయుడు కార్మికుల డబ్బును దోచుకున్నాడు కాబట్టే జైలుకెళ్లాడు. అదే విధంగా ఎవరు అక్రమాలు చేసినట్లు మా దృష్టికి వచ్చినా చర్యలు తప్పవు' అని పేర్కొన్నారు. చదవండి: కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..
ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Comments
Please login to add a commentAdd a comment