keshineni nani
-
క్యాష్ కొట్టు.. టికెట్ పట్టు
ఆటోనగర్(విజయవాడ తూర్పు): పెద్దమొత్తంలో ఎవరు డబ్బు ముట్టచెబితే వారికే చంద్రబాబు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయిస్తున్నారని విజయవాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) ఆరోపించారు. క్యాష్ కొట్టు.. టికెట్ పట్టు అనే సిద్ధాంతాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నారని విమర్శించారు. ఆదివారం విజయవాడ 15వ డివిజన్ రామలింగేశ్వరనగర్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. విజయవాడ తూర్పునియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు ధనికులంటేనే ప్రేమని, పేదలంటే చాలా చులకన భావంతో వ్యవహరిస్తారని అన్నారు. పేదలు పచ్చగా ఉంటే బాబు సహించలేరని విమర్శించారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటానికి నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని స్థాపించారని, ఆ పార్టీ సిద్ధాంతాలను చంద్రబాబు సప్త సముద్రాల్లో కలిపేశారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్రెడ్డి టిప్పర్ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే దానిపై పబ్లిక్ మీటింగ్‌లో హేళనగా మాట్లాడారని దుయ్యబట్టారు. దీంతో పేదలు ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉండకూడదన్న బాబు నైజం మరోసారి బయటపడిందన్నారు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గురించి ఆంధ్రా నుంచి ఢిల్లీ వరకు లారీలపై జెండాలు కట్టుకొని ప్రచారం చేసింది లారీ యజమానులేనని ఆయన గుర్తుచేశారు. మోదీతో చంద్రబాబు పొత్తు దేని కోసం... నరేంద్ర మోధీతో చంద్రబాబు ఎందుకు పొత్తు పెట్టుకున్నాడో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసమా.. రైల్వేజోన్ కోసమా.. లేదా రాజధానికి రూ.లక్ష కోట్లు తీసుకురావడానికా.. కడప ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు తీసుకురావడానికా, చంద్రబాబు మీద ఉన్న కేసులను మాఫీ చేయడానికా అనేది ప్రజలకు స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రూ.2.66 లక్షల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రజా సంక్షేమానికి గతంలో ఎవరూ ఇంతపెద్ద మొత్తంలో ఖర్చుచేయలేదన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని, మేమంతా సిద్ధం అనే కార్యక్రమానికి బ్రహ్మరథం పడుతున్నారని వివరించారు. -
దమ్ముంటే నాపై పోటీ చెయ్ : కేశినేని నాని
గంపలగూడెం(తిరువూరు): చంద్రబాబునాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ ఎంపీ స్థానం నుంచి తనపై నిలబడి గెలవాలని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్టీమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి కేశినేని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తోటమూల మ్యాంగో మార్కెట్లో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మండల ఆత్మియ సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చివరివని జోస్యం చెప్పారు. పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అయితే, పేదలకు వ్యతిరేకంగా పాలన చేసిన ఘనుడు నారా చంద్రబాబునాయుడని అన్నారు. తన పుత్రరత్నం లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలన్న ఏకైక అజెండాతో చంద్రబాబు ముందుకు పోతున్నారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయం ఉన్న వ్యక్తినని చెప్పుకొనే చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో కనీసం ఇల్లు కూడా లేదని ఎద్దేవా చేశారు. అమరావతి పేరిట ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు నష్టం తెచ్చారన్నారు. రూ.2.60 లక్షల కోట్ల మేర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన ఘనత దేశంలో ఒక్క జగన్మోహన్రెడ్డికి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అభ్యర్థుల డబ్బు చూసి చంద్రబాబు టికెట్లు కేటాయిస్తున్నారని విమర్శించారు. మండలంలో ప్రధాన సమస్య అయిన కట్టెలేరు వంతెన నిర్మాణానికి వచ్చే నెల 3వ తేదీన శంకుస్థాపన చేస్తామని ప్రకటించారు. తిరువూరు నియోజకవర్గంలో 10వేల మెజారిటీతో పార్టీ అభ్యర్ధులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. ఓటు అడిగేహక్కు వైఎస్సార్ సీపీకి మాత్రమే ఉంది రాష్ట్ర ప్రజలకు 57 నెలలుగా మెరుగైన పాలన అందించిన వైఎస్సార్ సీపీకి మాత్రమే రోబోయే సాధారణ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉందని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాత్రమే దక్కుతుందని పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేసిన మంచిని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. తిరువూరు అభ్యర్థి ఎంపిక కోసం తలపట్టుకొంటున్నారు తనను వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన తర్వాత తెలుగుదేశంపార్టీ అభ్యర్ధి కోసం వెతుకులాట ప్రారంభించిందని స్వామిదాసు అన్నారు. తనపై జగనన్న ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని పనిచేస్తానని చెప్పారు. ముందుగా అయోధ్యరామిరెడ్డి, కేశినేని నాని, స్వామిదాసు తోటమూలలో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. వినగడప పేరంటాళ్ళ గుట్ట వద్ద అచ్చం పేరంటాళ్ళకు పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎన్.సుధారాణి, ఎంపీపీ జి.శ్రీలక్ష్మీ, జెడ్పీటీసీ సభ్యులు కోట శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?
రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది. దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్‌ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్సీపీను స్థాపించిన సీఎం జగన్.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్‌గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు. ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ. ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్‌లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది. తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్‌కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకత అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
టీడీపీ కకావికలం.. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి రాజకీయం అంతా నాటి నుంచి నేటి వరకు డబ్బుతోనే ముడిపడి సాగుతోంది. అభ్యర్థులను డబ్బు మూటలతో తూకం వేస్తుండటం ఆ పార్టీ సీనియర్ నేతలను నివ్వెర పరుస్తోంది. ఒక్కచోట కూడా గెలవని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకుని అడుగులు ముందుకు వేస్తుండటం పట్ల అత్యధిక నియోజకవర్గాల్లో నేతల నుంచి విముఖత వ్యక్తమవుతోంది. దీనికి తోడు మాలోకం లోకేశ్ తీరు కలవర పెడుతోంది. ఇప్పటికే కొందరు నేతలు ఆ పార్టీని వీడటం.. త్వరలో గుడ్‌బై చెప్పేందుకు పెద్ద సంఖ్యలో నేతలు సిద్ధపడుతుండటం బాబును ఆందోళనకు గురిచేస్తోంది. నష్ట నివారణ కోసం మధ్యవర్తులను రంగంలోకి దింపినా ఫలితం కనిపించక తండ్రీ కొడుకులు తలలు పట్టుకున్నారు. సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ఎంపికకు డబ్బు మూటలనే ప్రధాన అర్హతగా నిర్ణయించడం ఆ పార్టీలో సీనియర్ నేతలను కలవరపరుస్తోంది. ఆది నుంచి టీడీపీని నమ్ముకున్న వారిని కాదని.. డబ్బు మూటలను చూపుతున్న వారినే సమన్వయకర్తలుగా నియమిస్తుండటంతో సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ఆ పార్టీని వీడారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. సీఎం వైఎస్ జగన్‌తో కలిసి పని చేస్తానని ప్రకటించారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రూ.20 కోట్లు డిపాజిట్ చేసిన వారికే టికెట్ ఇస్తానంటూ చంద్రబాబు తెగేసి చెప్పడంతో మాజీ మంత్రి పీతల సుజాత ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో తనను కాదని పక్కన పెట్టి.. కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డిని నియమించాలని చంద్రబాబు ఆలోచిస్తుండటంతో ఆ నియోజకవర్గ సమన్వయకర్త ధర్మవరం సుబ్బారెడ్డి గందరగోళంలో పడ్డారు. డబ్బు మూటలే ప్రాతిపదికగా సమన్వయకర్తలను చంద్రబాబు మార్చేస్తుండటం.. కేశినేని నాని బాటలోనే సీనియర్ నేతలు ఒకరి వెంట ఒకరు పార్టీని వీడుతుండటంతో ‘దేశం’ కకావికలమవుతోంది. ఎన్నికల షెడ్యూలు వెలువడడానికి ముందే పార్టీ బలహీనంగా మారడంతో తెలుగు తమ్ముళ్లలో హాహాకారాలు వ్యక్తమవుతున్నాయి. సంక్షేమాభివృద్ధి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు ప్రజల్లో రోజురోజుకు మద్దతు పెరుగుతుండటంతో ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు అత్యధిక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దాంతో ఎన్నికల్లో ఉనికి చాటుకోవడం కోసం జనసేనతో పొత్తుకు చంద్రబాబు పాకులాడారు. కానీ.. క్షేత్ర స్థాయిలో టీడీపీ, జనసేన నేతల మధ్య సఖ్యత కుదరక పోవడంతో పొత్తు కుంపట్లను రాజేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్.. తెనాలిలో జనసేన నేత నాదేండ్ల మనోహర్, టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ల మధ్య విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. టీడీపీ బలహీనంగా మారడం.. టీడీపీ–జనసేన పొత్తు కుంపట్లను రాజేస్తుండటంతో 2019 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమికి ఘోర పరాజయం తప్పదనే భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. అన్నమయ్య టీడీపీలో ఆధిపత్య పోరు సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ కీలక నేతల మధ్య గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ నేనే ఉండాలి.. నేనే పోటీ చేయాలి.. అంటూ సొంత ప్రతిష్టను పెంచుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ కత్తులు దూసుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా దూసుకుపోతున్న తరుణంలో ఉన్నవాళ్లు కూడా జారిపోతే పరిస్థితి మరింత దిగజారిపోతుందని అధిష్టానం కూడా చోద్యం చూస్తుండడంతో ఎటూ తేల్చుకోలేక క్యాడర్ అయోమయంలో ఉంది. అన్నిచోట్ల ఇదే తంతు ► రాయచోటిలో ఆర్.రమేష్ కుమార్‌రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌ల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతుండగా.. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకనాథరెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడంతో నాలుగో వర్గం ముందుకు వచ్చింది. ► రాజంపేటలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, గంటా నరహరి వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుండగా.. జనసేన కలయికతో క్యాడర్ అయోమయంలో పడింది. ► రైల్వేకోడూరులో టీడీపీ నేత కస్తూరి విశ్వనాథనాయుడు, గతంలో పోటీ చేసిన అభ్యర్థి నరసింహప్రసాద్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. గతంలో చిట్వేలిలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. n మదనపల్లెలో దొమ్మలపాటి రమేష్, శ్రీరామ్ చినబాబు వర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతుండగా, తాజాగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా చేరికతో మూడు వర్గాలు అయ్యాయి. ► తంబళ్లపల్లెలో టీడీపీ నేత శంకర్‌యాదవ్‌తో పాటు మరో ఇద్దరు చక్రం తిప్పుతుండటంతో అక్కడ కూడా అయోమయ పరిస్థితి నెలకొంది. విశాఖ నుంచి ‘గంటా’ జంప్! ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏకంగా విశాఖ జిల్లా నుంచే మకాం ఎత్తివేత విజయనగరం జిల్లా నెల్లిమర్లపై కన్ను సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక నియోజకవర్గం తరిమేస్తే.. మరో నియోజకవర్గం.. ఆ నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గం.. ఇలా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ నియోజకవర్గాలను మారుస్తూ.. ప్రజలను ఏమారుస్తూ వస్తున్న టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పుడు తట్టాబుట్టా సర్దుకుని విశాఖ జిల్లా నుంచే మకాం మార్చేస్తున్నారు. ఇప్పటికే పోటీచేసిన నియోజకవర్గాల్లో ఎక్కడా ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో.. ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖలోని ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా గెలిచే అవకాశం లేకపోవడంతో.. జిల్లా నుంచే జంప్ అవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈసారి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకున్నట్టు సమాచారం. నెల్లిమర్లలో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై సర్వే కూడా చేయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రజలు నిలదీస్తారనే భయంతో..! ఒకసారి పోటీ చేసిన ఏ నియోజకవర్గంలోనూ తిరిగి పోటీ చేయకపోవడానికి గంటా వైఖరే కారణమన్న విమర్శలున్నాయి. గెలవకముందు అనేక హామీలిచ్చి ఆ తర్వాత మిన్నకుండిపోవడం ఆయనకు అలవాటు. పోటీ చేసిన స్థానంలో మరోసారి పోటీ చేస్తే ఎక్కడ తనను ప్రజలు నిలదీస్తారోననే భయం గంటాను వెంటాడుతోంది. 2019లో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కూడా ప్రజలకు కనిపించకుండాపోయారు. కనీసం ఏ ఒక్కరినీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో మళ్లీ గొంతు విప్పారు. ప్రతి ఎన్నికలకు సీటు మార్చే ఇటువంటి నాయకులను పెట్టుకున్న తెలుగుదేశం పారీ్ట.. ఇప్పుడు వైఎస్సార్సీపీ మీద విమర్శలు చేయడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. భీమిలిలోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో.. టీడీపీ నుంచి 1999లో రాజకీయరంగ ప్రవేశం చేసిన గంటా అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ తర్వాత 2004లో చోడవరం ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. 2009లో అనకాపల్లికి మకాం మార్చి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. 2014లో భీమిలి నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు. 2019లో విశాఖ ఉత్తరం నుంచి బరిలో నిలిచి గెలిచారు. తాజాగా భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించినా.. గతంలో అక్కడి ప్రజలను పట్టించుకోకపోవడంతో పాటు ఏ రంగంలోనూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో భీమిలిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో తాను భీమిలిలో పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన గంటా విజయనగరం జిల్లాపై కన్నేశారు. టికెట్ మాదంటే మాది అనంతపురం టీడీపీలో కత్తిమీద సాములా అభ్యర్థుల ఎంపిక కళ్యాణదుర్గంలో పయ్యావుల అనుచరుడికి టికెటిస్తే ఓడిస్తామంటున్న తమ్ముళ్లు ధర్మవరంలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు టికెట్ల కేటాయించకముందే కత్తులు దూసుకుంటున్న తమ్ముళ్లు అనంతపురం టీడీపీలో అభ్యర్థుల్ని ప్రకటించకముందే నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రూపులుగా విడిపోయి వైరి వర్గాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. టికెట్ మాదంటే మాది అని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ఇంత జరుగుతున్న టీడీపీ అధినాయకత్వం చోద్యం చూస్తుండడంపై పార్టీ శ్రేణులు అసహనంతో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో టీడీపీలో రెండు మూడు గ్రూపులు తమదే టికెట్ అంటూ సోషల్ మీడియాలో ప్రకటించేసుకుంటుండగా.. చివరికి ఎవరికి టికెట్ దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. మాకు కాదని టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: సార్వత్రిక ఎన్నికల వేళ ఉమ్మడి అనంతపురం టీడీపీలో టికెట్ల ఎంపిక అభ్యర్థుల మధ్య చిచ్చు పెడుతోంది. రేసులో ఉన్న నాయకులు గ్రూపులుగా విడిపోయారు. సామాజిక మాధ్యమాల్లో ఫలానా వారికే టికెట్ అని కొన్ని గ్రూపులు ట్రోల్ చేస్తున్నాయి. కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడికి ఎమ్మెల్యే టికెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆయన పయ్యావుల కేశవ్‌కు అనుచరుడు. దీంతో ఉన్నం హనుమంతరాయ చౌదరి వర్గం కత్తులు నూరుతోంది. మేం 2014లో గెలిచాం.. 2019లో ఓడిన ఉమాకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశి్నస్తోంది. వీళ్లెవరూ కాకుండా బడా కాంట్రాక్టర్ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేస్తారనే ఉద్దేశంతో ఆయన పేరు తెరపైకి వచ్చింది. అతనికి టికెట్ ఇస్తే ఉమా, ఉన్నం వర్గాలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు ప్రతి నియోజవర్గంలోనూ గ్రూపులు పోషించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. సూరి వర్సెస్ శ్రీరాం 2019లో ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీలోకి వెళ్లిన వరదాపురం సూరి మళ్లీ ప్రత్యక్షమయ్యారు. దీంతో పరిటాల శ్రీరాం–సూరి వర్గాల మధ్య ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నువ్వెంతంటే నువ్వెంతంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. ‘పల్లె’త్తు మాట అనను.. పోరు బాటే ఇన్నాళ్లూ తనకే టికెట్ అంటూ ధీమాగా ఉన్న పల్లె రఘునాథరెడ్డి ఇప్పుడు మండిపడుతున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు టికెట్ అంటూ ప్రచారం జరగడంతో ‘పల్లె’ వర్గం కత్తులు దూస్తోంది. ఇన్నాళ్లూ కనిపించని కిష్టప్పకు ఇప్పుడే ప్రజలు గుర్తుకొచ్చారా? అంటూ మండిపడుతున్నారు. కదిరిలో కందికుంటకు టికెట్ ఇస్తే ఆయనకు మద్దతు ఇచ్చేదే లేదంటూ అత్తర్ చాంద్‌బాషా బహిరంగంగా చెబుతున్నారు. ఈ రెండు వర్గాల మధ్య నలిగిపోవడమెందుకని చాలామంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. అలకబూనిన పార్ధసారథి పెనుకొండలోనూ తాజాగా సవితమ్మకు టికెట్ ఇస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో బీకే పార్ధసారథి అలకబూనారు. ‘నేను ఎంపీగా వెళ్లను.. నేనూ ఇక్కడే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా’ అంటున్నారు. మడకశిరలో రెండువర్గాల మధ్య చిచ్చురేపి తిప్పేస్వామి చలికాచుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీలు భావిస్తున్నారు. తాడిపత్రిలో జేసీకి సహకరించం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డికి టికెట్ దాదాపు ఖరారైంది. జిల్లాలో ఏ ఒక్క నేత కూడా జేసీకి మద్దతు ఇవ్వడం లేదు. తీవ్ర అవినీతిలో కూరుకుపోయిన జేసీ సోదరుల పేరు చెప్పడానికి కూడా ఏ నాయకుడూ ముందుకు రాలేదు. శింగనమలలో పోటీచేసి ఓడిపోయిన బండారు శ్రావణికి ‘యువగళం’ పాదయాత్ర సమయంలో తీవ్ర అవమానం జరిగింది. శ్రావణి తండ్రిపై దాడి చేసినా లోకేశ్ పట్టించుకోలేదు. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు టీడీపీపై అసంతృప్తితో ఉన్నారు. దళితులపై దాడి చేసినా టీడీపీ అధినాయకులు పట్టించుకోలేదని, మళ్లీ టికెట్ కోసం పాకులాడటం అవమానంగా ఆ వర్గాలు భావిస్తున్నాయి. -
లోకేశ్ దెబ్బకు టీడీపీ కకావికలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పటమట (విజయవాడ తూర్పు): టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ చేస్తున్న నీచ రాజకీయాలకు ఎన్టీఆర్ జిల్లాలో ఆ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. ముఖ్యంగా లోకేశ్ కొట్టిన దెబ్బకు జిల్లాలో ఆ పార్టీ కకావికలవుతోంది. బాబు, లోకేశ్ చర్యలకు విసిగిపోయి పార్టీకి ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) గుడ్‌బై చెప్పడంతో జిల్లాలో పార్టీ నేతలు అధిక సంఖ్యలో రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ఇకపై పార్టీలో పని చేయలేమని తెగేసి చెబుతున్నారు. టీడీపీకి చెందిన విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్, నాని కుమార్తె కేశినేని శ్వేత సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ అంశం బెజవాడ టీడీపీలో మరింత కలకలం రేపింది. రాజీనామా ఆమోదం పొందిన వెంటనే పార్టీకి రాజీనామా చేస్తామని శ్వేత వెల్లడించారు. కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు. గౌరవం లేని పార్టీలో ఇమడలేకే రాజీనామా చేస్తున్నామని ఆమె చేసిన వ్యాఖ్యలు టీడీపీలో అలజడి రేపుతున్నాయి. ఏడాదిన్నరగా పార్టీలో తీవ్ర అవమానాలకు గురయ్యామని ఆమె ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో చర్చకు దారితీసింది. కేశినేని వర్గీయులు మరికొంత మంది కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. ప్రధాన అనుచరులుగా ఉన్న తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు, మైలవరం నియోజకవర్గానికి చెందిన బొమ్మసాని సుబ్బారావు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన బేగ్ వంటి వారు కేశినేని వెంటే ఉన్నారు. కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తారని, విజయం సాధిస్తారని శ్వేత ప్రకటించారు. తన బాబాయ్ కేశినేని చిన్ని గురించి మాట్లాడి తమ స్థాయిని తగ్గించుకోలేమని అన్నారు. అవినీతిపరులను పార్టీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇది లోకేశ్ అజ్ఞానమే తిరువూరు సభకు, కేశినేని నానికి సంబంధం ఏమిటన్న లోకేశ్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాని ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో భాగమైన తిరువూరులో జరుగుతున్న పార్టీ సభతో సంబంధం లేదని అనడం లోకేశ్æ అజ్ఞానమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ‘మా నాన్న నియోజకవర్గంలో సభ జరుగుతుంటే ఎంపీగా ఆయనకు సంబంధం ఉండదా’ అని కేశినేని శ్వేత గట్టిగానే ప్రశ్నించారు. లోకేశ్ అజ్ఞానం వల్లే పార్టీలో విభేదాలు తలెత్తుతున్నాయని, సీనియర్ నేతలను ఆయన అవమానిస్తున్నారని విమర్శిస్తున్నారు. లోకేశ్ గుట్లు తెలిసిన కేశినేని నాని వ్యతిరేక వర్గం ఆయన్ని బ్లాక్ మెయిల్ చేసి, అధిపత్యం చలాయిస్తోందని చెబుతున్నారు. కేశినేని చిన్ని, నాని వ్యతిరేక వర్గంలోని ముగ్గురు టీడీపీ నేతలు చెప్పినట్లే ప్రస్తుతం పార్టీలో నడుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ముగ్గురు బ్లాక్ మెయిలర్ల చెప్పు చేతల్లోకి లోకేశ్, పార్టీ వెళ్లిపోయారంటూ కేశినేని శ్వేత అన్నారు. జిల్లాలో టీడీపీ అధినేత కార్యక్రమాలేవీ నానికి చెప్పడంలేదని తెలిపారు. ఎన్నో అవమానాలు భరించి పార్టీలో ఉన్నామన్నారు. మీరు పార్టీలో వద్దు పొమ్మన్నాక కూడ ఉండలేం కదా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నామని, ఆస్తులు అమ్ముకున్నామని, వ్యాపారాలు నిలిపివేసి, త్యాగం చేస్తే, చివరికి చంద్రబాబు తమను వంచించారని కేశినేని నాని రగిలిపోతున్నారు. పిలిచి మాట్లాడకుండా, దూతలను పంపి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పడాన్ని తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. చుట్టుపక్కల రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, బాపట్ల ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్ధులే కరువైన తరుణంలో ప్రజల్లో పట్టున్న విజయవాడ సిట్టింగ్ ఎంపీకి టికెట్ లేదని చెప్పటాన్ని ఆ పార్టీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. మేయర్ ఫార్మాట్లో కార్పొరేటర్ శ్వేత రాజీనామా ఎంపీ కేశినేని నాని కుమార్తె, విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత సోమవారం తన అనుచరులతో కలిసి వీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి రాజీనామాను సమర్పించారు. మేయర్ ఫార్మాట్లో ఆమె రాజీనామా లేఖ సమర్పించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ.. తమకు టీడీపీలో గౌరవం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజీనామా ఆమోదం పొందాక టీడీపీకి రాజీనామా చేస్తానని తెలిపారు. నాని, తాను ప్రజల తరపున పోరాటం చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో నగరంలోని మూడు నియోజకవర్గాల నాయకులు తమను ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఇప్పుడు టీడీపీకి విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులే లేరని అన్నారు. టీడీపీ నుంచి తమతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటామని పేర్కొన్నారు. అంతకు ముందు ఆమె విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కలిసి తన రాజీనామా నిర్ణయాన్ని చెప్పారు. -
ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో జెండా పీకేశారు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పార్టీ కార్యాలయంలో ఆదివారం టీడీపీ జెండాలను పీకేసినట్లు స్వయంగా ఆయనే తెలిపారు. దీంతో ఆయన టీడీపీతో పూర్తిగా తెగతెంపులు చేసుకొన్నట్లుగా అర్థం అవుతోంది. టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం రాత్రి కేశినేని నానితో సమావేశమై బుజ్జగించే ప్రయత్నం చేశారు. తిరువూరు సభకు రావాలని అధిష్టానం దూతగా కోరినట్లు తెలిసింది. అయితే ఆయన ససేమిరా అంటూ తిరస్కరించారని సమాచారం. ఆదివారం సైతం తన రాజీనామాపై స్పందించారు. రాజీనామా చేస్తామని చెప్పాక కచ్చితంగా చేసేస్తానని స్పష్టం చేశారు. సాంకేతిక సమస్యతో రాజీనామా ఆలస్యం అవుతుందని, దానిపై ఇక చర్చించేది ఏమీ ఉండదని తేల్చి చెప్పారు. దీనిని బట్టి ఎంపీ కేశినేని నాని పూర్తిగా టీడీపీ నుంచి వెళ్లిపోవటానికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేయటానికి నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఎంపీ ఆదివారం తన కార్యాలయంలో అనుచరులతో మంతనాలు జరిపారు. తిరువూరులో జరిగిన రా కదిలిరా సభకు ఎంపీ కేశినేని నాని అనుచరులు మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, రామసుబ్బారావు, వాసన్ మునెయ్య, చెరుకూరి రాజేశ్వరరావు, దేవభక్తుని సీతారాం ప్రసాద్, జక్కె వెంకటేశ్వరరావుతో తదితరులు దూరంగా ఉన్నారు. తిరువూరు సభలో సీటు కేటాయించినా.. తిరువూరు సభలో టీడీపీ నేతలు వేసిన ఎత్తుగడ బెడిసి కొట్టింది. తిరువూరు సభలో ముందు వరుసలో ఎంపీ కేశినేని నానికి సీటు కేటాయించారు. అక్కడ ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో సైతం ప్రొటోకాల్ ప్రకారం ఎంపీ ఫొటోలు వేశారు. ఈ విషయం ఎంపీ కేశినేని నాని దృష్టికి మీడియా తీసుకెళ్తే.. ‘నాకు ప్రొటోకాల్ ఇచ్చామని, పాటిస్తున్నామని చెప్పుకోవటానికి బ్యానర్లలో ఫొటోలు వేశారు. గతంలో ప్రొటోకాల్ పాటించలేదే’ అని ప్రశ్నించారు. అన్ని పద్ధతులూ పాటిస్తున్నామని చెప్పుకోవటానికే ఇదంతా అని అన్నారు. ఇదేదో తనమీద, ప్రేమ, గౌరవంతో చేసిన విషయం కాదని తేల్చి చెప్పారు. తమ తప్పు లేదని విజయవాడలో మీడియాకు చెప్పుకోవటానికి గిమ్మిక్కు చేశారని ఎద్దేవా చేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచాక, తనకు పలు అవకాశాలు వచ్చాయన్నారు. అయితే అప్పట్లో టీడీపీని వీడాలనేది తన ఉద్దేశం కాదని కేశినేని నాని అన్నారు. కష్టాల్లో ఉన్న అధినేత చంద్రబాబుకు అండగా ఉండాలని ఆయన వెంటే నడిచానన్నారు. ఇప్పుడేమో తన వద్దకు దూతలను పంపి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని, పట్టించుకోవద్దని చెబుతున్నారని ఆరోపించారు. అధినేత ఆదేశాలను శిరసావహిస్తున్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఎంపీ హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. అనుచరులతో చర్చించి విజయవాడ పార్లమెంటు పరిధిలో తన అనుచరులుగా ఉన్న ఎంకే బేగ్, బొమ్మసాని సుబ్బారావు, స్వామిదాస్, మరికొంత మంది పరిస్థితి ఏమిటని విలేకర్లు అడిగిన ప్రశ్నకు ‘వేచి చూడండి’ అని నాని బదులిచ్చారు. ప్రజాస్వామంలో డిసైడ్ చేసేది ప్రజలే. తనను నమ్ముకొని విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని వేల మంది అనుచరులు, శ్రేయోభిలాషులు ఉన్నారని పేర్కొన్నారు. వారి మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, తన ఒక్కడి నిర్ణయం కాకుండా, వారి ఆలోచనలకు అనుగుణంగా కలిసికట్టుగా నిర్ణయం తీసుకొంటామని స్పష్టం చేశారు. విజయవాడ ఎంపీగానే పోటీ చేస్తానని, మూడో సారి తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. -
‘యూజ్లెస్ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు పార్టీని భ్రష్టుపట్టించావు
సాక్షిప్రతినిధి,విజయవాడ: ఉమ్మడి కృష్ణాజిల్లా టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా అంతరం పెరిగిపోయింది. చివరకు వ్యక్తిగతంగా దూషణలకు దిగే స్థాయికి దిగజారారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఈ సందర్భంగా స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అమ్మవారి దర్శనం సందర్భంగా చంద్రబాబు అంతరాలయంలోకి వెళ్లేటప్పుడు ఓ వర్గం నాయకులు దేవినేని ఉమా, కేశినేని చిన్ని వర్గానికి చెందిన వారు ముందుగానే తోసుకొంటూ లోపలికి వెళ్లారు. దీంతో ఎంపీ కేశినేని నానితో పాటు, మరికొంత మంది పార్టీనేతలు, లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. దీంతో చంద్రబాబు కేశినేని నానిని పిలవాలంటూ, తన భద్రతా సిబ్బందికి చెప్పారు. భద్రతా సిబ్బంది సార్ పిలుస్తున్నారు లోపలికి రావాలంటూ కేశినేని నానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. లోపల స్థలం లేదులే, ఇక్కడే ఉంటామని కేశినేని నాని వారికి చెప్పినట్లు తెలిసింది. చివరకు దేవినేని ఉమా బయటకు వచ్చి, కేశినేని నాని భుజంపై చెయ్యి వేసి, లోపలికి వెళ్లాలని కోరారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన ఎంపీ కేశినేని నాని, భుజంపైన వేసిన చెయ్యి విసిరికొట్టి, ‘యూజ్లెస్ ఫెలో’ మంత్రిగా ఉన్న నాలుగేళ్లు మీకు ఎవ్వరూ కనిపించలేదు, పార్టీని భ్రష్టు పట్టించావని ఊగిపోయారు. ఊహించని పరిణామం ఎదురు కావడంతో దేవినేని ఉమా సైలెంట్‌గా ఉండిపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్గాలను ప్రోత్సహించడంతోనే... పార్టీ మనుగడ కోసం చంద్రబాబు, లోకేష్‌లే వర్గాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆ పార్టీ ముఖ్య నేతలే పేర్కొంటున్నారు. ఎంపీ కేశినేని నానికి వ్యతిరేకంగా అతని సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహిస్తున్నారు. దీనిపై బహిరంగంగానే ఎంపీ పార్టీ అధిష్టానంపై ఇప్పటికే పలుమార్లు విరుచుకుపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎంపీ పార్టీ కేశినేని నాని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఆయనకు వ్యతిరేకంగా కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మూడు వర్గాలు పనిచేస్తున్నాయి. ఎంపీ మాత్రం పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బేగ్‌ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎన్నికల సమాయత్తంలో భాగంగా ఇటీవల పార్టీ కార్యాలయంలో మైనార్టీ నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సు రసాభాసగా మారింది. రెండు వర్గాలుగా చీలిపోయి, పరస్పరం చేయిచేసుకున్నారు. ఇటీవల జరిగిన దళిత శంఖారావంలో సైతం ఎంపీ కేశినాని ఫొటో చిన్నదిగా పెట్టి, ఏ హోదాలో లేని చిన్ని ఫోటో బ్యానర్‌పై పెట్టారని టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. తనకు వ్యతిరేకంగా దేవినేని ఉమాతో పాటు, నగరంలోని కొంతమంది పార్టీ నేతలను చంద్రబాబుతో పాటు, చినబాబు ప్రోత్సహిస్తున్నారని ఎంపీ కేశినేని నాని రగిలిపోతున్నారు. దీంతో మైలవరంతో పాటు, నగరంలో ఈ వర్గాలకు వ్యతిరేకంగా ఎంపీ కేశినేని నాని సైతం పావులు కదుపుతున్నారు. వరుస పరాజయాలకు తోడు, అంతంతమాత్రంగానే ఉన్న టీడీపీ పరిస్థితి, వర్గ విభేదాలతో పూర్తిగా దిగజారిపోతోందని, ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ వర్గ విభేదాలతో ఎలాంటి దుష్పరిణామాలకు చూడాల్సి వస్తుందోనని పార్టీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. -
Viajayawada: ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు
‘‘క్యారెక్టర్ ఉన్న పేదవాడికైనా సీటు ఇస్తే ఎంపీనే కాదు ఏదైనా చేస్తా... కానీ భూకబ్జాదారులు, దావూద్ ఇబ్రహీం లాంటి మాఫియా డాన్లు, చార్లెస్ శోభరాజ్ లు, రియల్ ఎస్టేట్ మోసగాళ్లు, కాల్‌మనీ సెక్స్ రాకెట్, పేకాట క్లబ్‌లు, నడిపేవారికి మద్దతు ఇవ్వను’’... ఇవన్నీ ఎన్టీఆర్ జిల్లాలోని టీడీపీ నేతలను ఉద్దేశించి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన సంచలన వ్యాఖ్యలు... సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ రోజు టీడీపీలో సంకుల సమరం ఊపందుకుంది. కొన్నేళ్లుగా ఆధిష్టానం తీరుపై మండిపడుతున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని మరోసారి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఈసారి ఏకంగా టికెట్ల పంచాయితీనే తెరపైకి తెచ్చారు. తన తమ్ముడు కేశినేని చిన్నితో పాటు, మరో ముగ్గురు, నలుగురికి టికెట్లు ఇవ్వటానికి వీల్లేదని అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఆ జాబితాలో మైలవరం మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా, విజయవాడ పశ్చిమ నియోజక వర్గ నేత బుద్ధా వెంకన్న, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఉండటం గమనార్హం. తద్వారా విజయవాడలో తాను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని కేశినేని నాని చెప్పడం అధిష్టానానికి మింగుడు పడటం లేదు. ఇటీవల మైలవరంలో దేవినేని ఉమాను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్లు చేశారు. ఆయనతో పాటు కొంతమంది పార్టీకి దూరంగా ఉండి కొత్తవారికి అవకాశం ఇస్తే బెటరనే కామెంట్లు చేశారు. నాలుగు సార్లు గెలిచానని విర్రవీగొద్దని దేవినేనిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్టు ఇస్తే ఓడిపోవడం ఖాయమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఆ వేడి తగ్గక ముందే తీవ్రస్థాయిలో తన తమ్ముడు చిన్నితో పాటు, మరో నలుగురికి పార్టీ టికెట్లు ఇవ్వవద్దంటూ అధిష్టానం పెద్దలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పార్టీ ప్రత్యర్థుల మీద, అధిష్టానం మీద ఆఫ్ ద రికార్డుగా కాకుండా ఆన్ రికార్డుగానే లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వటం ప్రస్తుతం ఆ పారీ్టలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్‌కు కౌంటర్ స్టేట్మెంట్? తాను విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి పోటీచేస్తానని బుద్ధా వెంకన్న ప్రకటించిన కొన్ని రోజులకే ఎంపీ కేశినేని నాని కౌంటర్ ఇవ్వడం ప్రా«ధాన్యత సంతరించుకొంది. లోకేష్ అండతోనే బుద్ధా వెంకన్న ఆ ప్రకటన చేశారన్నది బహిరంగ రహస్యం. ఆ విషయం తెలిసి కూడా బుద్ధా వెంకన్నకు టికెట్టు ఇవ్వటానికి వీల్లేదని చెప్పడం, మరోవైపు తన తమ్ముడు చిన్నిని ప్రోత్సహిస్తున్న లోకేష్‌కు పరోక్షంగా కేశినేని నాని కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టయింది. తనకో క్లారిటీ ఉందని కరప్షన్ కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, జీవితంలో ఎవరినీ మోసం చేయలేదని కేశినేని నాని చంద్రబాబుకు సైతం పరోక్షంగా చురకలంటించారు. ఎన్టీఆర్ గొప్ప ఆశయంతో టీడీపీని స్థాపించారని, ఆ ఆశయంతో పనిచేసేవారు చేయొచ్చునని, కాదని ఇలాంటి వారికి సీట్లు ఇస్తే పారీ్టకి గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. టీడీపీని ప్రక్షాళన చేయాలని ఘాటు వ్యాఖ్యలు చేయడం పార్టీలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పక్కా వ్యూహంతోనే... పక్కా వ్యూహంతోనే ఎంపీ కేశినేని నాని పార్టీపై తిరుగుబాటు చేయడంతో చంద్రబాబు, లోకేష్ నుంచి కనీసం ప్రతిస్పందన లేకుండా పోయింది. లోకేష్ అండతో హడావుడి చేస్తున్న ఆ నలుగురు కూడా కిమ్మనకుండా ఉండటం గమనార్హం. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఎంపీ కేశినేని నాని ఈ దాడిని మరింత పెంచే సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. దీంతో పార్టీలో నేతల మధ్య మరింత అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయనే భావన పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను బట్టి టీడీపీలో మున్ముందు వర్గపోరు మరింత బజారున పడే అవకాశాలు స్పష్టంగా కనిసిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
..ఇప్పటి వరకూ బయట అవమానాలే అనుకున్నాం..!
..ఇప్పటి వరకూ బయట అవమానాలే అనుకున్నాం..! -
బాబుగారు.. మీకో దండం! దూరమవుతున్న లీడర్లు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఇమడలేక సతమతమవుతున్నారా? దశ దిశా లేకుండా దిక్కులేని పక్షిలా సాగుతున్న పార్టీ ప్రయాణంతో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారా? జనంతో సంబంధం లేకుండా నిత్యం మీడియాలో కనిపిస్తూ.. చంద్రబాబు, లోకేష్ భజన చేస్తూ పబ్బం గడుపుకునే నేతలకే ప్రాధాన్యం ఇస్తూ తమను అవమానిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారా? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయబోనని, మరో అభ్యర్థిని చూసుకోవాలని కేశినేని నాని.. చంద్రబాబుకు స్పష్టంగా తేల్చిచెప్పడాన్ని బట్టి సీనియర్ నాయకుల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చని అంటున్నారు. ఇటీవలే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నడుస్తున్న తీరు బాగోలేదంటూ ఆయన రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడ్డారు. చంద్రబాబు జోక్యం చేసుకుని బుజ్జగించడంతో తాత్కాలికంగా తన నిర్ణయాన్ని బుచ్చయ్య వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం పట్ల ఆయన అభిప్రాయం మాత్రం మారలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి సైతం పార్టీ తీరు పట్ల బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎంపీ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒక ప్రైవేటు సంభాషణలో టీడీపీ పని అయిపోయిందని, ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. వీరే కాకుండా ఇంకా అనేక మంది సీనియర్ నాయకులు టీడీపీ మునిగిపోతున్న నావ అనే అభిప్రాయంతో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. చురుగ్గా లేని సీనియర్ నేతలు గతంలో టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన నాయకులు ఎవరూ ప్రస్తుతం చురుగ్గా లేరు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కీలక మంత్రిగా చక్రం తిప్పిన నారాయణ దాదాపు పార్టీకి దూరమయ్యారు. మరో మాజీ మంత్రి, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నారో, లేదోననే పరిస్థితి ఉంది. రాజమండ్రి మాజీ ఎంపీ మురళీమోహన్ పార్టీకి దూరమయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన మంత్రులు, ఎంపీలు, ఇతర నేతల్లో నలుగురైదుగురు మినహా ప్రస్తుతం ఎవరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వారి నియోజకవర్గాల్లో సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు పర్యటించినా పట్టించుకోవడం లేదు. టీడీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు (వల్లభనేని వంశీ, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణమూర్తి) ఆ పార్టీకి దూరమయ్యారు. మిగిలిన ఎమ్మెల్యేల్లో సగం మంది గోడ దూకడానికి ఎప్పుడో సిద్ధమైనట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. టీడీపీకి ఈ పరిస్థితి రావడానికి చంద్రబాబు వైఖరే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన తన తనయుడు లోకేష్‌కి పెత్తనం అప్పగించడం సీనియర్లకు మింగుడుపడడం లేదు. తన భజన చేసే వారినే ఆయన ప్రోత్సహిస్తుండడం వారికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోందంటున్నారు. -
ఏమండోయ్ నాని గారు.. క్షమాపణలు చెప్పించండి
సాక్షి, అమరావతి : విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నానిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. తాజాగా కేశినేని గత ఐదేళ్ల కాలాన్ని స్వర్ణయుగమంటూ వ్యాఖ్యానించడంపై ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తుచేసి.. చంద్రబాబు చేత క్షమాపణలు చెప్పించండని అన్నారు. (ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం) ‘ఏమండోయ్ నాని గారు (కేశినేని నాని).. చంద్రబాబు నాయుడు గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ గత ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదని, అందుకే నేను నారక్తం మరిగి పోయి, నాడు బీజేపీని, కేంద్రాన్ని విభేదించి బయటకు వచ్చానని చెప్పారు. రోజుకు పదికోట్ల ప్రజల సోమ్ముతో ధర్మపోరాటం, ఆరాటమని ఢిల్లీలో దీక్షలు చేశారు. నేడు మీరేమేూ గత ఐదేళ్లు స్వర్ణ యుగం, కేంద్ర మంత్రులందరు ఏపీకి అండగా నిలిచారని చెప్పారు (కేంద్రం ఇచ్చింది నిజమేలే). తన స్వార్థ రాజకీయూల కోసమే బీజేపీపై తప్పుడు ప్రచారం చేశానని చంద్రబాబు గారితో ప్రజల ముందు క్షమాపణ చెప్పించండి. అయినాగాని చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది టీడీపీ వైఖరి’ అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కాగా శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ ఫ్లె ఓవర్ ప్రారంభం సందర్భంగా బీజేపీ ప్రభుత్వంపై కేశినేని ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ అండతోనే వంతెన నిర్మాణం పూర్తి అయ్యిందని పేర్కొన్నారు. అయితే ఫ్లైఓవర్ నిర్మాణానికి గానీ, ఆంధ్రప్రదేశ్ అభివృద్దికిగానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కపార్టీలోనే ఇద్దరు నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో కార్యకర్తలు సైతం విస్మయానికి గురవుతున్నారు. -
కేశినేని నాని వ్యాఖ్యలు సిగ్గుచేటు
సాక్షి, విజయవాడ: దుర్గ గుడి ఫ్లై ఓవర్‌పై కేశినేని నాని మాట్లాడడటం సిగ్గు చేటు అన్నారు వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్. ‘అధికారంలో ఉండగా పూర్తి చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నార’ని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీజేపీని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు. ప్రజలంతా సంక్షేమ పథకాలను చూసి చాలా ఆనందంగా ఉన్నారన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేస్తానని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. శాసన రాజధాని అమరావతి అభిృవృద్దికి వైస్సార్సీపీ కట్టుబడి ఉందని అవినాష్ స్పష్టం చేశారు. (రమేష్‌ను చంద్రబాబు ఎందుకు వెనకేసుకొస్తున్నారు?) -
రాష్ట్ర రాజధానిని నిర్ణయించడంలో కేంద్రం పాత్ర లేదు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఏమీ లేదని కేంద్ర హోంశాఖ పునరుద్ఘాటించింది. టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన రాతపూర్వక ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ మంగళవారం సమాధానం ఇచ్చారు. ‘రాష్ట్ర రాజధాని ఎంపికలో నిర్దిష్ట విధాన ప్రక్రియ ఏదైనా ఉందా? ఉంటే ఆ వివరాలు ఇవ్వండి. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు తమ రాజధానులను ఎంపిక చేసుకున్న పద్ధతిని వివరించండి. ఈ ఎంపికలో కేంద్రం ఏదైనా పాత్ర పోషించగలదా? పోషించగలిగితే వివరాలు ఇవ్వండి..’ అంటూ కేశినేని ప్రశ్నించారు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా ‘ఒక రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పునరుద్ఘాటించారు. -
తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని షాకులు
-
ఆ ఆరు స్థానాల్లో టీడీపీ విజయం
సాక్షి నెట్వర్క్: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెల్లడైన మూడు లోక్‌సభ, మూడు శాసనసభ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం ఎంపీ ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపులో ఈవీఎంల కంటే.. పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్ల లెక్కింపు పెద్ద సవాల్‌గా మారింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి పోçస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా పోలయ్యాయి. శ్రీకాకుళం పార్లమెంటుకు సర్వీసు ఓట్లు, పోస్టల్ ఓట్లు కలిసి మొత్తం 21,276 ఓట్లు పోల్ కాగా.. వీటిలో 14,626 మాత్రమే లెక్కించారు. ఇందులో టీడీపీకి 5,324 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీకి 6,948 ఓట్లు వచ్చాయి. మిగిలిన 6,980 ఓట్లు చెల్లకుండా పోయాయి. వీటిలో ఎక్కువ ఓట్లు వైఎస్సార్సీపీకి చెందినవి కావడంతో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నిమ్మాడ పరిసరప్రాంతాల్లోని 259, 287, 288, 290, 291 పోలింగ్ బూత్‌లలో టీడీపీ మినహా ఇతర పార్టీలకు ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. ఈ ఐదు బూత్‌లు నిమ్మాడ పరిధిలో ఉన్నందున అక్కడ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడుల ప్రోద్బలంతో ఓటర్లను భయపెట్టి రిగ్గింగ్‌కి పాల్పడ్డారని పోలింగ్ సరళి స్పష్టంచేస్తోంది. ఈ విషయాలపై వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ శ్రీకాకుళం పార్లమెంటు రిటర్నింగ్ అధికారి, పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. చెల్లని ఓట్లను మళ్లీ లెక్కించాలని కోరినా ఆర్వో అనుమతివ్వలేదు. దీనిపై దువ్వాడ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గుంటూరు, విజయవాడ లోక్‌సభ పరిధిలో.. గుంటూరు ఎంపీ స్థానంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4,205 ఓట్ల మెజార్టీతో తన ప్రత్యర్థి మోదుగులపై గెలుపొందారు. విజయవాడ ఎంపీ నియోజకవర్గంలో 8,726 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కేశనేని నాని వైఎస్సార్సీపీ అభ్యర్థి పొట్లూరి వీర ప్రసాద్‌పై నెగ్గినట్లు అధికారులు ప్రకటించారు. విశాఖ నార్తులో రీపోలింగ్ నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ విశాఖ నార్తు నియోజకవర్గంలో వివాదాస్పద ఈవీఎంలో పడిన ఓట్లతో సంబంధం లేకుండా సీఈసీ ఆదేశాల మేరకు 1,944 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు గంటాకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. వివాదాస్పదమైన ఐదు ఈవీఎంలకు చెందిన బూత్‌ల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ అభ్యర్థి కేకే రాజు సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వివాదాస్పదమైన ఈవీఎంలో ఓట్ల వల్ల ఫలితంలో పెద్దగా మార్పు లేని కారణంగా ఆ ఓట్లను పరిగణనలోకి తీసుకోకుండానే ఫలితాన్ని ప్రకటించవచ్చని సీఈసీ సూచించడంతో ఆర్వో ఫలితాన్ని ప్రకటించారు. ఉరవకొండలో స్వల్ప మెజార్టీతో నెగ్గిన కేశవ్ అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గ ఫలితం ఇరు పార్టీలతోనూ దోబూచులాడింది. మొదటి 14 రౌండ్లలో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరచగా, ఆ తర్వాత టీడీపీ పుంజుకుంది. కౌంటింగ్ సమయంలో ఐదు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వాటిని లెక్కించకుండా పక్కన పెట్టారు. ఇతర ఈవీఎంల కౌంటింగ్ ముగిసిన తరువాత పక్కనపెట్టిన ఈవీఎంల లెక్కింపుపై ఇరు పార్టీల నేతలు వాగ్వాదానికి దిగారు. ఎన్నికల అధికారి వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు. కౌంటింగ్ పక్రియ శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు ముగియగా.. 2,138 ఓట్ల మోజార్టీతో కేశవ్ గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. పర్చూరులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓటమి ప్రకాశం జిల్లా పర్చూరు అసెంబ్లీ ఫలితం శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు వెలువడింది. వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు 1,503 ఓట్ల మెజారిటీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు 96,077 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరావుకు 94,574 ఓట్లు వచ్చాయి. -
ఎప్పుడో కైమా కైమా అయ్యేవారు.. వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో టీడీపీ నేతల అసలు రంగు బయటపడుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ హత్యకు తాము ప్లాన్‌చేస్తే.. భారీస్థాయిలో ఉంటుందని మంత్రి సోమినేని చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్ జగన్ ఎప్పుడో కైమా కైమా అయిపోయేవారంటూ నాని తీవ్ర వికృత వ్యాఖ్యలు చేశారు. ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ ఎప్పుడో అయిపోయేవారని తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. మరో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. గతంలో అమిత్ షాపై దాడి చేసింది బీజేపీ వాళ్లేనని అన్నారు. -
'వీధి రౌడీల్లా వ్యవహరించడం దారుణం'
విజయవాడ: వీధి రౌడీల్లాగా ప్రజాప్రతినిధులు వ్యవహరించడం దారుణమని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి ధ్వజమెత్తారు. బాధ్యత గల పదవిలో ఉన్న టీడీపీ నేత బుద్ధా వెంకన్న అసాంఘీక వ్యక్తులను ముందు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం విజయవాడలో సురేష్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ఆలయాల తొలగింపు సరికాదన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీయొద్దని సూచించారు. హృదయ విచారంగా దేవుళ్ల విగ్రహాలను తొలగిస్తున్నారని వాపోయారు. స్వామీజీలు, మఠాధిపతులు కూడా విగ్రహాల తొలగింపును ఖండిస్తున్నారని చెప్పారు. గుజరాత్లో 300 గుళ్లు తొలగించారని టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. బీజేపీని విమర్శించే వాళ్లపై సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు.