
సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో టీడీపీ నేతల అసలు రంగు బయటపడుతోంది. ఇప్పటికే వైఎస్ జగన్ హత్యకు తాము ప్లాన్‌చేస్తే.. భారీస్థాయిలో ఉంటుందని మంత్రి సోమినేని చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా.. తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని తన మనసులో మాటను బయటపెట్టుకున్నారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే వైఎస్ జగన్ ఎప్పుడో కైమా కైమా అయిపోయేవారంటూ నాని తీవ్ర వికృత వ్యాఖ్యలు చేశారు. ఇన్నివేల కిలోమీటర్ల పాదయాత్రలో జగన్ ఎప్పుడో అయిపోయేవారని తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. వైఎస్ జగన్‌పై దాడి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. మరో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ.. గతంలో అమిత్ షాపై దాడి చేసింది బీజేపీ వాళ్లేనని అన్నారు.