సాక్షి, విజయవాడ : విద్యుత్ చార్జీలు పెరిగాయని టీడీపీ నేతలు ప్రజలను తప్పు తోవ పట్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత దేవినేని అవినాష్ మండిపడ్డారు. విద్యుత్ చార్జీలు పెరిగాయన్నది అవాస్తవమని, రెండు నెలలకు కలిసి రీడింగ్ తీసినా, రెండు నెలలకు వేర్వేరుగా బిల్లులు వేసి చార్జీలు వసూళ్లు చేస్తున్నారని తెలిపారు.
లాక్ డౌన్ కారణంగా విద్యుత్ వినియోగం పెరిగిందని, 500 యూనిట్లు కంటే ఎక్కువ వాడిన వారికి మాత్రమే అదనంగా యూనిట్‌కు 90 పైసలు పడిందని అవినాష్ అన్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా పెంచారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు ఇళ్లలో సినిమాలు చూస్తూ దొంగ దీక్షలు చేస్తున్నారని నిప్పులుచెరిగారు.
Comments
Please login to add a commentAdd a comment