నాకొద్దు ఈ పెద్దకొడుకు!  | Chandrababu Is Big son Only For Campaigning Not For Guarantees | Sakshi
Sakshi News home page

నాకొద్దు ఈ పెద్దకొడుకు! 

Published Sun, Apr 7 2019 7:27 AM | Last Updated on Sun, Apr 7 2019 7:40 AM

Chandrababu Is Big son Only For Campaigning Not For Guarantees - Sakshi

సాక్షి, విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి  సమీపంలో యాచిస్తున్న ఈ వృద్ధురాలి పేరు బత్తుల అనువాయమ్మ. ఆమె చేతి సంచిని ఒకసారి గమనించండి. చంద్రబాబు ఫొటోతో పాటు ‘పెన్షన్‌ పెద్దకొడుకు’ అని దానిపై ఉంది. ఆ సంచిపై ఏముందో కూడా నిజానికి ఆమెకు తెలియదు. రోజూ యాచన కోసం ఆ చేతి సంచినే వాడుతుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని అడ్డరోడ్డు వద్ద నివసిస్తున్న అనువాయమ్మను ‘సాక్షి’ పలకరించింది. వృద్ధాప్య పింఛన్‌ వస్తుందా? అని అడగ్గా.. పింఛన్‌ కోసం ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ ప్రభుత్వం కనికరించలేదని వాపోయింది. ఆ సంచిపై ఏముందో ఆమెకు చెప్పగా.. ‘ప్రచారానికి మాత్రమే ఆయన పెద్ద కొడుకు.. అలాంటి పెద్దకొడుకు నా కొద్దు’ అంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement