‘ఆసరా’.. ఆక్రందన | No 'Aasra' for pensioners in Telangana districts | Sakshi
Sakshi News home page

‘ఆసరా’.. ఆక్రందన

Published Tue, Dec 16 2014 5:02 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

‘ఆసరా’.. ఆక్రందన - Sakshi

‘ఆసరా’.. ఆక్రందన

కాసింత ‘ఆసరా’ కోసం పండుటాకుల ఆగ్రహం పెల్లుబికింది.

సాక్షి, బృందం: కాసింత ‘ఆసరా’ కోసం పండుటాకుల ఆగ్రహం పెల్లుబికింది. ఏ దిక్కూలేని అభాగ్యుల ఆక్రందన కట్టలు తెంచుకుంది. పింఛన్ల కోసం సోమవారం జిల్లాలో పలుచోట్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళనబాట పట్టారు. అధికారులు తమకు అన్యాయం చేశారని దుమ్మెత్తిపోశారు. నోటికాడి కూడును లాగేస్తారా..? అని శాపనార్థాలు పె ట్టారు. పింఛన్ ఇస్తారా..చావమంటారా? అంటూ హెచ్చరించారు.

పింఛన్ బాధితులు దేవరకద్ర, కొడంగల్, అయిజ, దామరగిద్ద, బొంరాస్‌పేట తహశీ ల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. దేవరకద్ర  పట్టణంతో పాటు మీనుగోనిపల్లి, బస్వాయపల్లి, గుడిబండ తదితర గ్రామాల నుంచి వచ్చిన వం దల సంఖ్యలో వచ్చిన వృద్ధులు, వితంతువులు, వికలాంగులు స్థానిక తహశీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ని నదిం చారు. అధికారులను బయటికి పంపించే సి తాళం వేశారు. అనంత రం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని మరోమారు ధర్నా కొనసాగిం చారు. పాతబస్టాండ్‌లోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేపట్టారు.
 
ఆసరా పథకం ద్వారా పింఛన్లు అందడం లేదని అయిజ ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాలను వందలాది మంది లబ్ధిదారులు ముట్టడించారు.  ఒక్కసారిగా వందలమంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తరలొచ్చి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా బాధితులు అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. అర్హులకు రాకపోతే దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి మంజూరుచేస్తామని ఎంపీడీఓ నాగేంద్రం లబ్ధిదారులకు హామీఇచ్చారు.
 
పింఛన్ల జాబితాలో తమపేర్లు లేకపోవడంతో పాన్‌గల్ మండలంలోని పాన్‌గల్, బొల్లారం, బుసిరెడ్డిపల్లి గ్రామాల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని అధికారులను చుట్టుముట్టారు. పాన్‌గల్‌లో 175 మంది, బొల్లారంలో 90మంది, బుసిరెడ్డిపల్లిలో 76మంది అర్హుల పేర్లు జాబితాలో లేవని ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆక్షేపించారు. అర్హత ఉన్నా పింఛన్లు ఎందుకు ఇవ్వలేదని ఎంపీడీఓ ఆంజనేయులును నిలదీశారు.
 
పింఛన్‌రాలేదని బొంరాస్‌పేట మండలంలోని బురాన్‌పూర్, చెర్వుముందలితండా, పోలేపల్లి, చిల్మల్‌మైలారం, రేగడిమైలారం, మెట్లకుంట, మూడుమామిళ్లతండా, ఎన్కెపల్లి, సూర్యనాయక్‌తండా తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు కొడంగల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన వృద్ధులకు అన్యాయం చేయడం తగదని మండిపడ్డారు.
 
దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన అర్హులైన వృ ద్ధులు, వికలాంగులు, వితంతువులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి ము ట్టడించారు. పలుసార్లు దరఖాస్తుచేసుకున్నా మంజూరుకు నోచుకోవడం లేదని ఎంపీడీఓ నటరాజ్‌ను నిలదీశారు. పింఛన్ ఇస్తారా..చావమంటా రా? అని ఎంపీడీఓపై ఆగ్రహం వెళ్లగక్కారు. ఎంపీడీఓ చాంబర్‌లోకి దూ సుకెళ్లేందుకు యత్నించడంతో ఎస్‌ఐ నవీన్‌సింగ్ పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement