రాస్తారోకో చేస్తున్న మంగపేట గ్రామస్తులు
గంగాధర(చొప్పదండి) : తమ గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని తమకే కేటాయించి డబుల్ బెడ్‌రూం ఇల్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర పంచాయతీ మంగపేట గ్రామస్తులు సోమవారం గంగాధర చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా గంగాధర ఎల్లమ్మ చెరువు నిండి తమ గ్రామంలోకి నీరు వస్తుందన్నారు. నీరుండడంతో ఇళ్లకు ప్రమాదంతోపాటు క్రిమికీటకాలతో తిప్పలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ వైధ రామానుజం, ఎంపీటీసీ పెరుక శ్రావణ్ సంఘీభావం ప్రకటించారు. పోలీసులు వారి రాస్తారోకోను విరమింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment