narayanapur reserviour
-
‘డబుల్’ ఇళ్ల కోసం ఆందోళన
గంగాధర(చొప్పదండి) : తమ గ్రామ సమీపంలోని ప్రభుత్వ స్థలాన్ని తమకే కేటాయించి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేస్తూ గంగాధర పంచాయతీ మంగపేట గ్రామస్తులు సోమవారం గంగాధర చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా గంగాధర ఎల్లమ్మ చెరువు నిండి తమ గ్రామంలోకి నీరు వస్తుందన్నారు. నీరుండడంతో ఇళ్లకు ప్రమాదంతోపాటు క్రిమికీటకాలతో తిప్పలుంటాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాన్ని నారాయణపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ వైధ రామానుజం, ఎంపీటీసీ పెరుక శ్రావణ్ సంఘీభావం ప్రకటించారు. పోలీసులు వారి రాస్తారోకోను విరమింపజేశారు. -
నారాయణ్‌పూర్ నుంచి కృష్ణా జలాలు విడుదల
కర్ణాటక: వేసవిలో పాలమూరు జిల్లా ప్రజల దాహార్తి తీర్చేందుకు ఎగువనున్న నారాయణపూర్ జలాశయం పరిధిలోని గూడూర్ రిజర్వాయర్ నుంచి జూరాలకు కర్ణాటక ప్రభుత్వం ఆదివారం ఒక టీఎంసీ కృష్ణా జలాలను విడుదల చేసింది. ఎల్లుండి కల్లా మహబూబ్‌నగర్ జిల్లాకు కృష్ణా జలాలు చేరుకోనున్నాయి. తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు చొరవతో కర్ణాటక ప్రభుత్వం నీరు విడుదల చేసినట్టు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నారాయణపూర్ జలాశయం నుంచి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయాలంటూ హరీష్‌రావు ఇటీవల పలుమార్లు విజ్ఞప్తి చేయగా ఒక టీఎంసీ నీటి విడుదలకు బెంగళూరులోని కృష్ణా భాగ్య జల నిగమ్ అంగీకరించింది.