సాక్షి, బన్సీలాల్‌పేట్(హైదరాబాద్): చాచానెహ్రూనగర్ బస్తీలో విషాదం చోటుచేసుకుంది. డబుల్ బెడ్ రూమ్ పథకం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. అన్నీ అర్హతలు ఉన్నా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాకపోవడంతో మనోవ్యథతో మంచం పట్టి ఇంటి పెద్ద మరణించడంతో.. భార్యా పిల్లలు రోడ్డు పాలయ్యారు. ఈ కన్నీటిగాథకు రెవెన్యూ అధికారులు, స్థానిక నాయకుల తీరే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. చాచానెహ్రూనగర్ బస్తీలో వెల్డింగ్ పని చేసుకునే రవి(36) భార్య బాలమణి, ఐదుగురు ఆడపిల్లలతో జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా ఇల్లు ఉన్న రవి కుటుంబానికి ఇటీవల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు జరగలేదు.
ఈ విషయమై రవి రెవెన్యూ అధికారులతో పాటు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరిగి తన గోడు వెళ్లబోసుకున్న ఫలితంగా లేకుండా పొయింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రవి అస్వస్థతకు గురై మంచం పట్టాడని భార్య బాలమణి వాపోయారు. తీవ్ర మనోవేదనకు గురైన రవి అనారోగ్యంతో ఈ నెల 17న కన్నుమూశారు. శుక్రవారం తండ్రి రవి శవం ముందు ఆడపిల్లలు చుట్టూ కూర్చోని విలపించిన తీరు చూపరుల కంట తడి పెట్టించాయి. శుక్రవారం బన్సీలాల్‌పేట్ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ రవి కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సదరు కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇంటిని కేటాయించాలని కోరారు.
చదవండి: Hyderabad: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
చదవండి: దళిత మహిళా సర్పంచ్‌కు టీడీపీ ఉప సర్పంచ్ వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment