సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణంలో ఇల్లు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పద్మా , వేంకటేశ్వర రాజు, సత్య కృష్ణ వర ప్రసాద్‌లు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో బాధితుడు దగ్గర లక్షా 20 వేల రూపాయల నుంచి లక్షా 70 వేల రూపాయల వరకు వసూలు చేశారు. దాదాపు 89 మంది దగ్గర 1 కోటి 3 లక్షల రూపాయలు వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బాలా నగర్ పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ( గ్రేటర్ బయట ఇళ్లను చూపిస్తే ఎలా? )
ముగ్గురిలో ఇద్దరు నిందితులు సైతం డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో మోసపోయారని పోలీసులు గుర్తించారు. వీరశెట్టి వెంకట్ సాయి కృష్ణ ప్రసాద్ అనే నిందితుడు గతంలోనూ డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇప్పిస్తా అని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో తేలింది. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రజలు మోస పోవద్దని పోలీసులు హెచ్చరించారు. ప్రభుత్వం ద్వారానే ఇళ్లు వస్తాయని, అక్రమ పద్దతిలో రావని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment