
‘ఆసరా’పై రాజీలేని పోరాటం
ప్రభుత్వం ‘ఆసరా’ పేరిట మోసం చేస్తోందని.. అర్హులకు న్యాయం చేకూరడంలేదని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
రాయికల్ : ప్రభుత్వం ‘ఆసరా’ పేరిట మోసం చేస్తోందని.. అర్హులకు న్యాయం చేకూరడంలేదని.. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీలేని పోరాటం చేస్తామని సీఎల్పీ ఉప నేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాయికల్ మండలం కిష్టంపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ పథకం కోసం విధించిన నిబంధనలతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పింఛన్ రాలేదని మృతిచెందారని తెలిపారు.
శాసనసభలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. నిబంధనలు సవరించామని చెప్పారని, అయినా అధికారులు మాత్రం తమకెలాంటి ఉత్తర్వులు అందలేదని అధికారులు అంటున్నారని తెలిపారు. శాసన సభలో సీఎం చెప్పిన ప్రతిమాటా ఉత్తర్వునేని గుర్తుచేశారు. మారిన నిబంధనల ప్రకారం పింఛన్లు మంజూరు చేయాలని... లేదంటో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు.