
పెళ్లి కాకుండానే వింతతువును చేశారు
ఆసరా పథకం కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాల్లో తీవ్ర తప్పులు దొర్లుతున్నాయి.
మంథని రూరల్ : ఆసరా పథకం కోసం ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాల్లో తీవ్ర తప్పులు దొర్లుతున్నాయి. ఒక జాబితాలో దరఖాస్తు చేసుకుంటే మరో జాబితాలో పేరు నమోదు చేసి అధికారులు గందరగోళం సృష్టిస్తున్నారు. కన్నాల గ్రామానికి చెందిన ఓ యువతి వికలాం గుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు ఆమెను వితంతు జాబితాలో చేర్చారు. బొమ్మగాని రాజేశ్వరి పుట్టుకతోనే మానసిక వికలాంగురాలు. చెవిటి, మూగ. ఈమె గతంలో సదరెం క్యాంపునకు హాజరుకాగా 100 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరిస్తూ 20248090050 108003 ఐడీ నంబర్‌తో వైద్యులు సర్టిఫికెట్ జారీ చేశారు. పింఛన్లు పొందుతున్న వారు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించడంతో రాజేశ్వరి వికలాంగుల పింఛన్ కోసం మళ్లీ దరఖాస్తు చేసుకుంది.
పింఛన్ల అర్హుల జాబితాను అధికారులు రెండు రోజుల క్రితం గ్రామపంచాయతీల వద్ద అంటిం చారు. రాజేశ్వరికి పింఛన్ మంజూరైనా వితం తు కోటాలో ఆమె పేరు రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అధికారుల తప్పిదంతో రాజేశ్వరికి అన్యాయం జరిగే అవకాశముందని, పింఛన్ చెల్లింపు సమయంలో భర్త మరణధ్రువీకరణ పత్రం అడిగితే... అసలు పెళ్లే కాని యువతి సర్టిఫికెట్ ఎలా తెస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరికి వికలాంగుల కోటాలో పింఛన్ వచ్చేలా చూడాలని కోరుతున్నారు. జాబితాలో ఇలాంటి తప్పిదా లు భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు మరోసారి జాబితాలు పరిశీలించి పూర్తి స్థాయి లో విచారణ నిర్వహించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.