10 నుంచి పంచుడే
⇒ ఒకేసారి రెండు నెలల ‘ఆసరా’ పింఛన్ల పంపిణీ
⇒ వేగిరం చేసిన అధికార యంత్రాంగం
⇒ రేపు గ్రామస్థాయిలో సర్పంచ్‌లకు అవగాహన
⇒ ఇప్పటివరకు 3 లక్షల మంది అర్హులు
హన్మకొండ అర్బన్ : రెండు నెలలుగా ఆగిపోయిన పింఛన్ల పంపిణీపై సందిగ్ధత తొలగింది. ఆగిన పింఛన్ వస్తుందా.. రాదా అని ఆందోళనకు గురవుతున్న వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఊరట కలిగేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. మొత్తంగా ఆసరా పింఛన్లను గ్రామస్థాయిలో పంపిణీకి తేదీలు ఖరారు చేసింది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మునిసిపల్ వార్డుల్లో ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఏది ఏమైనా పదో తేదీ లోపు పరిశీలన పూర్తి చేసి జాబితా సిద్ధం చేయూలని హుకుం జారీ చేశారు. అంతేకాదు.. నిలిచిపోరుున రెండు నెలల పింఛన్ డబ్బులు ఇచ్చేలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పెండింగ్ పింఛన్ డబ్బులు కూడా...
ప్రభుత్వం ఆసరా దర ఖాస్తుల స్వీకరణ ప్రారంభం నుంచి పాత పింఛన్ల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో నెలల వారీగా నిలిచిపోరుున పింఛన్ డబ్బులను ఇస్తారా... ఇవ్వరా... అన్న విషయంలో లబ్దిదారుల్లో ఆందోళన నెలకొం ది. ప్రస్తు తం రెండు నెలల (అక్టోబర్, నవంబర్) పింఛన్ డబ్బులను ఈ నెలలో పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం గ్రామ స్థారుులో ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రేపు సర్పంచ్‌లకు అవగాహన
ముఖ్యంగా గ్రామస్థాయిలో పింఛన్ల పంపిణీ, ఎంపిక విషయంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు సర్పంచ్‌లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో సద స్సు నిర్వహించాలని ముందుగా నిర్ణయించినప్పటికీ... దాన్నిరద్దు చేశారు. 6న ఉదయం జిల్లాలోని సర్పంచ్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సర్పంచ్‌లు ఉదయం 11 గంట లకు ఆయా తహసీల్దార్ కార్యాల యాల్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని సమాచారం ఇచ్చారు.
ఇప్పటివరకు 3 లక్షల మంది అర్హుల గుర్తింపు
జిల్లాలో వివిధ పింఛన్ల కోసం అందిన మొత్తం 5,40,000 దరఖాస్తుల్లో వివిద స్థాయిలో వడపోత అనంతరం 3 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. పదో తేదీ నాటికి మరో 5వేల మంది పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. వీరందరికీ పంపిణీ సమయంలో ఫొటోలతో ఉన్న ప్రొసీడింగ్స్ అందజేసి, పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆసరా కోసం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో తెలుగు అక్షర దోషాలు ఎక్కువ ఉన్నందున... కార్డులు ప్రింట్ చేయడం సరికాదని వారు భావిస్తున్నారు. లోపాలు సరిదిద్దిన తర్వాత కార్డులు ముద్రించాలనే నిర్ణయానికి వచ్చారు. మొత్తంగా జిల్లాలో పింఛన్ల పంపిణీకి తేదీలు ఖరారు కావడం ఆసరా లబ్ధిదారులకు ఊరటనిచ్చే విషయం.