పింఛన్ కోసం అవస్థలు పడుతున్న వృద్ధులు
ఆసిఫాబాద్‌రూరల్ : గత మూడు నెలలుగా రాని పింఛన్ ఇప్పుడు వచ్చిందనే ఆశతో ఉదయం 9 గంటలకే పోస్టాఫీసుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల ఆశ నిరాశ అవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా వట్టి చేతులతోనే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆదివారం మండలంలోని బూర్గుడ గ్రామంలో పోస్టాఫీస్ కేంద్రంలో వేలి ముద్ర మిషన్, సిగ్నల్ పని చేయడం లేదని నేనేం చేయాలని సంబంధిత సిబ్బంది అంటున్నారు.ఇప్పటికే రెండు రోజుల నుంచి వచ్చి తిరిగి పోతున్నామని, మిషన్ పని చేస్తలేదని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని ఆసరా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ ఎప్పుడు వస్తుందోనని బెంగ పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment