oldage People
-
ఇంట్లో తల్లిదండ్రులు ఒంటరిగా ఉన్నారా? ఇకపై భయపడాల్సిన పనిలేదు
పిల్లలు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఇంట్లో ఒంటరిగా ఉంటారు. ఇలాంటి ఒంటరి తల్లిదండ్రులను ప్రమాదాల బారి నుంచి రక్షించడానికి కేరళ స్టార్టప్ ‘స్మార్ట్‌కేర్’ ఎమర్జెన్సీ అలర్ట్ టెక్నాలజీతో కొన్ని పరికరాలను రూపొందించింది.... హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రిటైర్డ్ ఉద్యోగి రాజేశ్వరరావు ఒంటరిగా ఉంటాడు. భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయింది. కొడుకు, కోడలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. విశాఖపట్టణంలో ఉండే అనసూయమ్మకు ఒక్కగానొక్క కూతురు పుణెలో ఉద్యోగం చేస్తుంది. అనసూయమ్మ భర్త చనిపోయి చాలాకాలం అయింది.రాజేశ్వరరావు ఒకరోజు ఇంట్లో కాలు జారిపడ్డాడు. ఆ సమయంలో వేరే ఊరి నుంచి వచ్చిన బంధువు ఒకరు ఉండడంతో ఆయనను త్వరగా హాస్పిటల్‌కు తీసుకువెళ్లాడు.అనసూయమ్మకు కూడా ఇలాగే జరిగింది. పడిన తర్వాత చాలాసేపటికి ఎవరో ఇంటికి రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. మరింత ఆలస్యం అయి ఉంటే అనసూయమ్మ ప్రమాదంలో పడేది. అయితే అన్ని సందర్భాల్లోనూ ఎవరో ఒకరు వచ్చి బాధితులను హుటాహుటిన హాస్పిటల్‌కు తీసుకువెళతారని గ్యారెంటీ లేదు. ఇక కేరళ విషయానికి వస్తే ఒంటరిగా జీవిస్తున్న వృద్ధుల సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంది. వారు ప్రమాదాల బారిన పడిన సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసిందే... స్మార్ట్‌కేర్.కేరళకు చెందిన వేణునాథ్ స్వీడన్లో చదువుకునే రోజుల్లో ఒక వృద్ధురాలి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఆమె వయసు ఎనభై సంవత్సరాలు. ఆ వృద్ధురాలి ఒంటరి జీవితం చూసి వేణుకు జాలిగా అనిపించేది. ఒక రాత్రి ఆమె అనారోగ్యానికి గురైంది. సీరియస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె తన చేతికి ఉన్న కంకణంలాంటి దానిపై ఉన్న బటన్‌ను నొక్కింది. వెంటనే టేబుల్ మీద ఉన్న పరికరం తనతో మాట్లాడడం మొదలుపెట్టింది. తనకు ఇబ్బందిగా ఉన్న విషయం గురించి చెప్పింది ఆమె. ఇరవై నిమిషాల లోపే వైద్యుడు, సహాయక బృందం ఆమె ఇంటికి వచ్చారు. ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఆ పరికరం గురించి వేణుకు విపరీతమైన ఆసక్తి ఏర్పడి దాని గురించి వివరాలు తెలుసుకున్నాడు. మన దేశంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ఉంటే బాగుండేది అనుకున్నాడు. స్వీడన్లో డాటా సైంటిస్ట్‌గా కొంతకాలం ఉద్యోగం చేసిన వేణు ఆ తరువాత ఇండియాకు వచ్చి స్నేహితుడు అరుణ్ నాయర్‌తో కలిసి ‘అన్స్ఫ్రిడ్ స్మార్ట్‌కేర్ ప్రొడక్స్’ కంపెనీ మొదలు పెట్టాడు.అంతకుముందు ఉద్యోగం చేస్తూనే జీతంలో సగం మొత్తాన్ని వృద్ధులకు ఉపకరించే ఉపకరణాల గురించి రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేసేవాడు. ఎంతోమంది నిపుణులతో మాట్లాడేవాడు. స్మార్ట్‌కేర్ ఉత్పత్తుల్లో ఒకటి... వైర్లెస్ ఫాల్ సెన్సర్. దీన్ని బాత్రూమ్ గోడలకు బిగిస్తారు. వృద్ధులు పడిపోతే కంపెనీకి అలర్ట్ పంపుతుంది. కంపెనీ వెంటనే వైద్యులను ప్రమాద బాధితుల ఇంటికి పంపుతుంది. చేతికి ధరించే ‘విబ్బీ డిటెక్టర్’ కూడా వృద్ధులు ప్రమాదంలో ఉన్నప్పుడు అలర్ట్ పంపుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవారికి ఇది బాగా ఉపకరిస్తుంది. ‘హీట్ అలారమ్’ అనేది వైర్లెస్ ఇండోర్ సెన్సర్. లాకెట్‌లా మెడలో ధరించవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిస్తుంది. తక్కువ బరువుతో ఉండే ‘మైఎమీ’ లాకెట్ వృద్ధులు ఇల్లు దాటి బయటికి వెళ్లినప్పుడు ఉపయోగపడుతుంది. ఆపద సమయంలో సహాయం కోసం దీనిపై ఉన్న బటన్‌ను నొక్కాలి...‘స్మార్ట్‌కేర్’ ఉత్పత్తుల్లో ఇవి కొన్ని మాత్రమే.‘స్మార్ట్‌కేర్’ నలభై హాస్పిటల్స్‌తో కలిసి పనిచేస్తోంది. కోల్కత్తా, ముంబై, చెన్నై, దిల్లీ, బెంగళూరు నగరాలకు కూడా కంపెనీ విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. -
అవి అవ్వ-తాతల సంఘాలు.. కొడుకు, కోడళ్లతో ఎలా మెలగాలో చెబుతాయి..
జీవితాంతం కనాకష్టం చేసి.. చరమాంకంలో తమకంటూ ఏమీ మిగుల్చుకోని స్థితి వృద్ధులది. పెద్దలు చెప్పింది పిల్లలు వినరు. ‘అత్త మూతి విరుపు... మామ చాదస్తం’ అంటారు. అలాగే పిల్లల చేతలు పెద్దలకు నచ్చవు. ‘కొడుకు పట్టించుకోడు.. కోడలు సూటి పోటి మాటలు’ అని పుట్టడన్నీ ఫిర్యాదులు. ఇలా చిన్నచిన్న ఇబ్బందులతో మొదలైన మాటలు పంచాయతీ దాకా వస్తుంటాయి. చివరికి పెద్ద మనుషులనో, పోలీసు స్టేషన్ల నో ఆశ్రయించాల్సిన పరిస్థితి చాలా కుటుంబాలది. అయితే కామారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఈ సీన్ కనిపించదు. అక్కడ పండుటాకులంతా సం ఘటితమయ్యారు. వృద్ధాప్యంలో ఒకరికొకరై, అందరూ ఒకటై... ఆపద వస్తే ధైర్యాన్నిస్తారు. తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలకు బుద్ధి చెబుతారు. సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని మోతె గ్రామంలో వృద్ధులు గాంధీ మహాత్ముని స్ఫూర్తితో 2009లో ‘తాత సంఘం’స్థాపించారు. 60 ఏళ్లు పైబడిన 60 మందితో మొదలైన సంఘం ఇప్పుడు 108 మందికి చేరింది. ప్రతి నెల రూ.పది చొప్పున జమ చేస్తారు. సంఘం కోసం షెడ్డు నిర్మించుకున్నారు. గాంధీ విగ్రహంతోపాటు అందరి పేర్లతో రూపొందించిన శిలాఫలకాన్నీ పెట్టుకున్నారు. ఏవైనా సమస్యలుంటే పరిష్కరించుకుంటారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్ల తో ఎలా మెలగాలనేది చర్చించుకుంటారు. చదవండి: తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా కోమట్‌పల్లిలో తాత, అమ్మల సంఘం లింగంపేట మండలం కోమట్‌పల్లిలో 2018లో ‘తాత, అమ్మ’ల సంఘం ఏర్పాటైంది. ఇందులో 93 మంది సభ్యులున్నారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సంగయ్య సహకారంతో సంఘాన్ని బలోపేతం చేసుకున్నారు. సభ్యులు ప్రతినెల ఒక్కొక్కరూ రూ. 50 సంఘంలో జమ చేస్తారు. ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉంటారు. సమస్య వస్తే కలిసి పరిష్కరించుకుంటున్నారు. చదవండి: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు దేమికలాన్‌లో వయో వృద్ధుల సంఘం తాడ్వాయి మండలం దేమికలాన్‌లో 2017లో ‘పార్వతీ దేవి వయో వృద్ధుల సంక్షేమ సంఘం’ఏర్పాటైంది. 40 మందితో మొదలైన సంఘం ఇప్పు డు 80 మందికి చేరింది. ఇందులో పది మంది మహిళలు ఉన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన ప్రతి ఒక్కరూ రూ.పది తీసుకుని సమావేశానికి వస్తారు. సంఘం సభ్యుల విరాళాలు, ప్రభుత్వ నిధులతో కలిపి రూ.5 లక్షలతో భవనం నిర్మించుకున్నారు. అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సహాయం తో ఫర్నీచర్‌ను సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ అక్కడకు వచ్చి సాదకబాధకాలు పంచుకుంటారు. -
చనిపోతున్న వారిలో వృద్ధులే అధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 78,357 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటితో దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 37,69,524 కు చేరింది. కరోనా రోగుల్లో ఇప్పటివరకు 29,01,909 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 8,01,282 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితో కోవిడ్ బారిన పడుతున్న వారిలో 18-44 ఏళ్ల వారే అధికంగా ఉన్నట్లు డేటా వెల్లడిస్తుంది. మొత్తం కరోనా కేసుల్లో వీరి సంఖ్య 54శాతంగా ఉంది. ఇక మరణాలను పరిశీలిస్తే.. వైరస్ బారిన పడి చనిపోతున్న వారిలో వృద్ధులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కోవిడ్ మరణాల్లో 51శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు డాటా తెలుపుతోంది. (చదవండి: కోవిడ్ విపత్తువేళ డ్యూక్స్ ఔదార్యం) #IndiaFightsCorona 54% #COVID19 cases are in the 18-44 years age group but 51% deaths are in the 60 years and above age group. pic.twitter.com/9ToEzUigYI — Ministry of Health (@MoHFW_INDIA) September 2, 2020 ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించాల్సిందిగా ప్రజలను కోరుతుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం, చేతులను తరచుగా శుభ్రం చేసుకోవడం.. సామాజిక దూరం పాటించడం వంటి నియమాలను ఆచరిస్తేనే మహమ్మారి బారిన పడకుండా ఉండగలం అంటుంది. అంతేకాక ‘దేశ ప్రజలంతా మాస్క్ ధరించి.. సామాజిక దూరం పాటించడం వంటి వాటిని కఠినంగా ఆచరిస్తే.. ఈ ఏడాది డిసెంబరు నాటికి 2 లక్షల మరణాలు సంభవించకుండా ఆపవచ్చని సర్వేలు వెల్లడిస్తున్నాయి. కనుక ప్రజలంతా ఈ నియమాలను తప్పక పాటించాలని’ కోరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.02 శాతంగా ఉంది. అలాగే మరణాల రేటు 1.76 శాతంగా ఉంది. కాగా, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4.43 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటించింది. #CoronaVirusUpdates: 📍Total #COVID19 Cases in India (as on September 02, 2020) ▶️76.98% Cured/Discharged/Migrated (29,01,908) ▶️21.26% Active cases (8,01,282) ▶️1.76% Deaths (66,333) Total COVID-19 confirmed cases = Cured/Discharged/Migrated+Active case Deaths#StaySafe pic.twitter.com/EWN8YG2eOy — #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 2, 2020 -
పండుటాకుల గుండె కోత!
సాక్షి, హైదరాబాద్ : మల్కాజిగిరికి చెందిన రాఘవరావు, సుశీల (పేర్లు మార్చాం) దంపతులు ఎనభై ఏళ్లకు చేరువైన వృద్ధ దంపతులు. ఇంట్లో ఇద్దరే ఉంటున్నారు. ఇద్దరికీ మధుమేహం, హైబీపీ వంటి జబ్బులు ఉన్నాయి. దాంతో పాటు ఆమె కొంతకాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్లను సంప్రదించేందుకు అవకాశం లేదు. చాలా వరకు ఆసుపత్రులు ఓపీ సేవలను నిలిపివేశాయి. ప్రభుత్వ దవాఖానాలకు వెళ్లాలంటే కరోనా ఉంటే తప్ప అక్కడ వైద్యం లభించే అవకాశం లేదు. ‘ఇల్లు వదిలి బయటకు అడుగు పెడితే ఎక్కడ కరోనా అంటుకుంటుందోనని భయమేస్తోంది. అలాగని ఇంట్లోనే ఉంటే రోజు రోజుకు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. ఆమెకు ఆస్తమా బాధ కూడా ఎక్కువవుతోంది. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు టెలీమెడిసిన్ ద్వారా వైద్యసేవలను అందజేస్తున్నాయి. ఫీజులపైన కనిపించే శ్రద్ధ రోగుల బాధలపైన కనిపించడం లేదు’ అని రాఘవరావు ఆందోళన వ్యక్తం చేశారు. (అడకత్తెరలో పోకచెక్క... భారత్) ఒంటరిగా ఉంటున్న ఆ వృద్ధ దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. కానీ ఇద్దరూ ఢిల్లీ, బెంగళూర్లలో ఉండగా, ఒకాయన అమెరికాలో స్థిరపడ్డారు. 3 నెలల క్రితం వరకు ప్రతి రోజు ఇద్దరు పనిమనుషులు వచ్చి అన్ని పనులు పూర్తి చేసి వెళ్లేవారు. కానీ కరోనా కారణంగా పనిమనుషులూ రావడం లేదు. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పనిభారం ఆ వృద్ధ దంపతులను బాగా కుంగదీస్తున్నాయి. నిజానికి ఇది ఒక్క రాఘవరావు దంపతులు ఎదుర్కొంటున్న సమస్య మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్‌లోని లక్షలాది మంది వయోధికులను కరోనా కష్టాలు సుడిగుండలా చుట్టుకున్నాయి. ఇల్లు దాటి బయటకు వెళ్లేందుకు అవకాశం లేక, వైద్య సదుపాయాలు అందక, ఆదుకొనే వాళ్లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు అటు తమ కుటుంబాల నుంచి, ఇటు సమాజం నుంచి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. హెల్పేజ్ ఇండియా వంటి స్వచ్ఛంద సంస్థల అంచనాల ప్రకారం హైదరాబాద్ జనాభాలో 18 లక్షల మంది 70 ఏళ్లు దాటిన వయోధికులు ఉండగా, వారిలో సుమారు 8 లక్షల మందికి పైగా ఒంటరి దంపతులే కావడం గమనార్హం. కుటుంబాలతో కలిసి ఉంటున్న వాళ్లు ఒకరకమైన వివక్షను ఎదుర్కొంటుండగా, ఒంటరి వృద్ధులు మరో రకమైన బాధల్ని అనుభవించాల్సి వస్తోంది. ఈ నెల 15వ తేదీన అంతర్జాతీయ వృద్ధులపై వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆదుకునేవారేరీ.. లాక్డౌన్ వల్ల ఇళ్లల్లో పనిచేసే కార్మికులంతా సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. దీంతో ఇంటి పని భారం వృద్ధులపైన పడింది. ప్రత్యేకించి ఒంటరి వృద్ధులు çసర్వెంట్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇంటిపనితో పాటు, తమ అవసరాలు చూసుకోవడం పెద్ద సమస్యగా మారింది. ఇరుగు పొరుగు నుంచి కూడా ఎలాంటి సహాయం అందకపోవడం వల్ల ఒంటరి వృద్ధులు తమ ఇళ్లల్లో నిస్సహాయంగా బిక్కు బిక్కుమంటూ గడిపేస్తున్నారు. దీంతో చాలా మంది డిప్రెషన్‌కు గురవుతున్నారు. ఒకవైపు అనారోగ్యం వల్ల, మరోవైపు పనిభారం వల్ల బాధపడుతున్న వారికి కరోనా ముప్పు మరింత కలవరపెడుతుంది. ‘విదేశాల్లో ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. మేం అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేదు. కరోనా కారణంగా బంధువులో, చుట్టుపక్కల వాళ్లో వచ్చి ఆదుకునే అవకాశం కూడా లేదు. ఇలా బతకగలిగినంత కాలం బతకాల్సిందే...’ అని హబ్సిగూడకు చెందిన ఒక పెద్దాయన ఆవేదన వ్యక్తం చేశారు. (నగరంలో దడపుట్టిస్తున్న కరోనా) ఆసుపత్రులకు వెళ్లలేక.. వృద్ధుల్లో చాలా మంది మధుమేహం, హై బీపీతో బాధపడుతున్నారు. కనీసం 2 నెలలకు ఒకసారైనా షుగర్ లెవల్స్, బీపీ లెవల్స్ పరీక్షించి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ కరోనా కారణంగా చాలా వరకు ఆసుపత్రుల్లో ఓపీ సేవలను నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపుల తరువాత కొన్ని ఆసుపత్రులలో పరిమితంగా సేవలు ప్రారంభమైనా ఇల్లు దాటి వెళితే కరోనా సోకుతుందేమోననే భయం వెంటాడుతుంది. ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చినా వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లోనూ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల హై రిస్క్‌లో ఉన్న వృద్ధులకు తమను తాము కాపాడుకోవడం పెద్ద సవాల్‌గా మారింది. తరచుగా డయాలసిస్ అవసరమైన వాళ్లు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ‘వయోభారం వల్ల న్యుమోనియా, ఆస్తమా వంటి జబ్బులను కరోనాతో ముడిపెడుతున్నారు. గాంధీకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు టెలీమెడిసిన్ సేవలను ప్రారంభించాయి. కానీ వయోధికులకు వాటివల్ల పెద్దగా ఉపయోగం లేదు.’అని హెల్పేజ్ ఇండియా ప్రతినిధి శ్యామ్ విస్మయం వ్యక్తం చేశారు. భారంగా పోషణ... తుకారాంగేట్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులకు ఇద్దరు కొడుకులు. ఆ దంపతులు నెల రోజులు పెద్ద కొడుకు దగ్గర ఉంటే మరో నెల చిన్న కొడుకు దగ్గర ఉండాలి. కానీ నెల రోజులు మాత్రమే ఉండాల్సిన తల్లిదండ్రులు లాక్డౌన్ కారణంగా గత 3 నెలలుగా తన వద్దే ఉండడంతో పెద్ద కొడుకు కుటుంబానికి వారు భారంగా పరిణమించారు. దీంతో తమ సొంత ఇంట్లోనే తాము తీవ్ర వేధింపులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దంపతులే కాకుండా నగరంలో చాలా మంది వృద్ధులు కొడుకులు, కూతుళ్ల వల్ల తీవ్ర వేధింపులకు గురవుతున్నారు. కరోనా , లాక్డౌన్ పరిణామాల్లో ఆ వేధింపులు మరింత పెరిగాయని స్వచ్ఛంద సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
‘ఆసరా’ అవస్థలు
ఆసిఫాబాద్‌రూరల్ : గత మూడు నెలలుగా రాని పింఛన్ ఇప్పుడు వచ్చిందనే ఆశతో ఉదయం 9 గంటలకే పోస్టాఫీసుకు వచ్చిన వృద్ధులు, వికలాంగుల ఆశ నిరాశ అవుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా వట్టి చేతులతోనే ఇంటికి పోవాల్సి వచ్చింది. ఆదివారం మండలంలోని బూర్గుడ గ్రామంలో పోస్టాఫీస్ కేంద్రంలో వేలి ముద్ర మిషన్, సిగ్నల్ పని చేయడం లేదని నేనేం చేయాలని సంబంధిత సిబ్బంది అంటున్నారు.ఇప్పటికే రెండు రోజుల నుంచి వచ్చి తిరిగి పోతున్నామని, మిషన్ పని చేస్తలేదని చెబుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మా కష్టాలను గుర్తించి మాకు న్యాయం చేయాలని ఆసరా లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ ఎప్పుడు వస్తుందోనని బెంగ పెడుతున్నారు. -
సిక్స్ హిడెన్ ట్రిక్స్...
ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి ఓల్డేజ్ పీపుల్ వరకు అందరి చేతుల్లో ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అందులో వాట్స్ యాప్ ఉండనే ఉంటుంది. అందరూ సులువుగా ఈ యాప్‌ను ఉపయోగించుకుంటున్నారు.. కానీ చాలామంది యూజర్లకుతెలియని ఆరు విషయాలు... మెసేజ్ చూసిన టైమ్.. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రెండు బ్లూ టిక్స్ కనిపిస్తే అవతలి వారు మనం పంపిన మెసేజ్‌ను చూసినట్టు లెక్క. కానీ వారు ఏ సమయానికి చూశారో తెలుసుకోవాలంటే పంపిన మెసేజ్‌ని లాంగ్ ప్రెస్ చేసి ‘జీ’ ఐకాన్‌ను ప్రెస్ చేస్తే ఏ టైమ్‌కు మెసేజ్ చూశారో తెలిసిపోతుంది. ఆర్చీవ్ చాట్స్.. ఇది మీ సంభాషణను హైడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తితో కానీ గ్రూప్‌తో కానీ చాట్ చేసిన సంభాషణను దాచాలంటే ఎవరిదైతే హైడ్ చేయాలనుకుంటున్నారో వారి అకౌంట్‌ను లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఆర్చివ్ చాట్ ఉంటుంది. గ్రూప్ మొత్తం అయితే చాట్ సెట్టింగ్స్‌కు వెళ్లి ఆర్చివ్ ఆల్ చాట్స్ అని ప్రెస్ చేయండి. అంతే! ఇక మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. దీనివల్ల మీ చాటింగ్ కన్వర్సేషన్ డిలీట్ అవ్వదు. మ్యూట్ గ్రూప్ చాట్స్.. గ్రూప్ చాట్స్‌లో ఎవరో ఎవరితోనో చాట్ చేసినా మీకు డిస్టర్బెన్స్ అవుతుంది. అలాంటప్పుడు ఏ గ్రూప్ నోటిఫికేషన్లు ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రూప్ ఓపెన్ చేసి మెనూలోకి వెళ్లి మ్యూట్ ఆప్షన్ ప్రెస్ చేస్తే అక్కడ ఎంత టైమ్ వరకు నోటిఫికేషన్లు మ్యూట్‌లో పెట్టాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవచ్చు. లాస్ట్ సీన్ై టెమ్ హైడ్.. ఈ యాప్‌లో ఎవరు ఏ టైమ్‌కు ఆఖరిగా వాట్స్‌యాప్ చూశారో తెలుస్తుంది. కానీ మీ లాస్ట్ సీన్ టైమ్ ఎవరికీ తెలియకూడదనుకుంటే సెట్టింగ్స్/అకౌంట్/ప్రైవసీ లోకి వెళ్లి లాస్ట్ సీన్ దగ్గరకు వెళ్లి నోబడీ అని సెలెక్ట్ చేసుకుంటే చాలు. అలా చేస్తే వేరే వారి లాస్ట్ సీన్ మీకు కనిపించదు. హోం స్క్రీన్‌పై షార్ట్‌కట్.. తరచూ మీరు ఒకే వ్యక్తితోనే ఎక్కువగా చాట్ చేస్తున్నారనుకోండి. వారు పంపిన మెసేజ్‌ను క్షణం ఆలస్యం కాకుండా చూడాలనుకుంటే షార్ట్‌కట్‌ను వాడుకోండి. ఎవరి అకౌంట్‌ను అలా చేయాలనుకుంటే వారి చాట్ మెనూలోకి లేదా గ్రూప్ పై లాంగ్ ప్రెస్‌చేసి యాడ్ చాట్ షార్ట్‌కట్ అని సెలెక్ట్ చేసుకోండి. అంతే! వారి అకౌంట్ మీ ఫోన్ స్క్రీన్‌పైకి వచ్చేస్తుంది. నెట్ డేటా సేవింగ్.. ఎక్కడెక్కడి ఫొటోలు, ఆడియోలు, వీడియోలు డౌన్లోడ్ అవుతూ, మీ డేటా స్వాహా కాకుండా ఉండాలంటే సెట్టింగ్స్/చాట్ సెట్టింగ్స్ /మీడియా ఆటో-డౌన్లోడ్లోకి వెళ్లి అక్కడ మొబైల్ డేటా, వైఫై, రోమింగ్... ఇలా మీకు ఎప్పుడు ఆటోడౌన్లోడ్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా డేటా సేవ్ చేసుకోవచ్చు.