facing problems
-
టమోటా రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
-
రోడ్లు లేక రైతుల అవస్థలు
-
కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ మిగలలేదు..
-
నిలిచిపోయిన ఓపి సేవలు.. రోగుల ఇబ్బందులు..
-
తిరుపతి రుయా హాస్పిటల్లో సమస్యల తిష్ట
-
వైద్య సౌకర్యాలు లేక విశాఖ KGHలో రోగుల అవస్థలు
-
బాబు కుట్రలు..పెన్షన్ కష్టాలు
-
ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బులిస్తేనే సేవలు
-
వణుకుతూ..కునుకు లేక
కళ్లముందున్న రెక్కల కష్టం.. రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన ఆనందం కళ్లముందే ఆవిరవుతోంది. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి రోజులు, వారాలు గడుస్తున్నా కొనుగోలు చేయక.. పగలూరాత్రి కాపలా కాయాల్సి వస్తోంది. అటు యాసంగి పంటల పనులు చేసుకోలేక.. ఇటు భార్యాబిడ్డలతో గడపలేక.. ఆవేదనలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి ఇదే. మంగళవారం రాత్రి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుల ఇబ్బందులెన్నో వెలుగుచూశాయి. దీనిపై ప్రత్యేక కథనం.. ఈ ఫొటోలో ధాన్యం బస్తాల వద్ద గొంగళి కప్పుకుని కూర్చున్న రైతు పేరు గట్టన్న. వనపర్తి జిల్లా మదనాపురంలోని కొనుగోలు కేంద్రానికి 15 రోజుల కింద ధాన్యం తీసుకొచ్చాడు. ఐదు రోజుల క్రితం తూకం వేశారు. కానీ ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు లారీలు రాలేదు. ధాన్యం మిల్లుకు చేరేదాకా రైతుదే బాధ్యత అని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పడంతో.. పగలు, రాత్రి ధాన్యం బస్తాల వద్దే కాపలా ఉంటున్నాడు. కారు చీకట్లో రెక్కల కష్టం మంగళవారం రాత్రి కామారెడ్డి జిల్లా లింగారెడ్డిపేటలోని కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం కుప్పలపై పడుకున్న రైతులు వీరు. తాము ధాన్యం తెచ్చి సుమారు 20 రోజులు అవుతోందని, రోజూ ఇలా కాపలా కాయాల్సి వస్తోందని వారు వాపోయారు. ఇంటిదగ్గర భార్యాపిల్లలు ఆందోళన చెందుతున్నారని, త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడే కాదు.. జిల్లాలోని చాలా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి. ‘‘పోయిన నెల 15న వడ్లను కొనుగోలు కేంద్రానికి తెచ్చిన. అప్పుడు పడ్డ వానలతో వడ్లు తడిసినయి. ఆరబెడుతూనే ఉన్నం. ఎప్పుడు కాంటా వేస్తారో’’ అని సదాశివనగర్‌కు చెందిన పోలబోయిన నర్సింలు వాపోయాడు. ధాన్యం కుప్పల వద్దే తిండీతిప్పలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లి రోజులు గడుస్తున్నా తూకం వేయక.. తూకం వేసినా మిల్లులకు తరలించక.. ఆందోళన చెందుతున్నారు. పొద్దున కోతుల నుంచి, మధ్యాహ్నం–సాయంత్రం పశువుల నుంచి, రాత్రిపూట దొంగల నుంచి, కురిసే మంచు నుంచి ధాన్యాన్ని కాపాడుకోవాల్సిన పరిస్థితిలో.. చలికి గజగజ వణుకుతూ వరికుప్పల వద్దే పడిగాపులు పడుతున్నారు. నిద్రకూడా పట్టక చలి మంటలు వేసుకుని కునికిపాట్లు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మంగళవారం రాత్రి ‘సాక్షి’ నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో రైతుల అవస్థలెన్నో వెలుగుచూశాయి. –సాక్షి నెట్వర్క్ 15 రోజులుగా.. నిండు చలిలో.. మహబూబాబాద్ జిల్లా మైలారంలోని కొనుగోలు కేంద్రంలో మంగళవారం రాత్రి నిద్రిస్తున్న రైతులు వీరు. ఇక్కడ గ్రామానికి కిలోమీటర్ దూరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 రోజుల క్రితం సుమారు 70 మంది రైతులు ధాన్యం తెచ్చిపోశారు. ఇప్పటివరకు ఒక్క గింజ కూడా కొనలేదు. రోజూ ధాన్యాన్ని ఆరబెట్టడం, తిరిగి టార్పాలిన్లు కప్పిపెట్టడం, రాత్రిళ్లు కాపలా కాయడంతోనే సరిపోతోంది. ‘‘మూడెకరాల్లో పండిన ధాన్యాన్ని తెచ్చిపోశాను. మొదట తేమశాతం ఎక్కువగా ఉందన్నారు. తర్వాత దుబ్బ ఉందన్నారు. 15రోజులుగా రాత్రిళ్లు చలిలో కాపలా ఉంటున్నాం. ఎప్పుడు కొంటారనేది ఇంకా తేలడం లేదు’’ అని మైలారం గ్రామానికి చెందిన బానోత్ రమాకాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ, బచ్చన్నపేట మండలం బండనాగారంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. 60 ఏళ్ల వయసులో అరిగోస నిండు చలిలో ధాన్యం కుప్ప దగ్గర నిద్రిస్తున్న ఈ రైతు పేరు బోళ్ల పాపిరెడ్డి. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం నారాయణపురానికి చెందిన ఆయన.. పదిరోజుల కింద కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చాడు. ఇంకా కాంటా వేయలేదు. 60 ఏళ్ల వయసు దాటిన ఆయన.. పగలు ధాన్యం ఆరబెడుతూ, రాత్రిళ్లు కాపలాగా పడుకుంటూ అవస్థ పడుతున్నాడు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణిలోనూ 264 మంది రైతులు 50రోజుల క్రితం ధాన్యం తెచ్చారు. కొనుగోళ్లు మొదలై నెల గడుస్తున్నా.. 52 మంది వద్ద ధాన్యాన్ని తీసుకున్నారు. మిగతా రైతులకు పగలు, రాత్రి కాపలా తప్పట్లేదు. దొరికింది తిని.. కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లోని ధాన్యం కొనుగోలు కేంద్రంలోని చిన్న హోటల్ వద్ద మంగళవారం రాత్రి అల్పాహారం తింటున్న రైతులు వీరు. కొనుగోళ్లలో జాప్యంతో నెల రోజుల నుంచి రైతులు పగలూరాత్రి అక్కడే పడిగాపులు పడుతున్నారు. దీనితో స్థానిక మహిళ ఒకరు తోపుడు బండిపై చిన్నపాటి హోటల్ పెట్టారు. ఇక్కడే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో చాలా చోట్ల రైతులు కొనుగోలు కేంద్రాల్లో అవస్థలు పడుతున్నారు. పది రోజులుగా... మంగళవారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట మండలం ఎల్కపల్లిలో ధాన్యానికి కాపలా ఉన్న రైతులు వీరు. కొనుగోళ్ల కోసం పది రోజులుగా ఎదురుచూస్తున్నామని, రాత్రిపూట ఇలా ధాన్యానికి కాపలా ఉంటున్నామని వారు చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్, లక్ష్మణచాంద మండలం రాచాపూర్, వడియల్ కొనుగోలు కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. 55 రోజుల్నుంచి కావలి ఉన్నా.. ధాన్యం కుప్ప పై నిద్రిస్తున్న ఈ రైతు సంగారెడ్డి జిల్లా అందోలు గ్రామానికి చెందిన చాకలి బేతయ్య. 55 రోజుల క్రితం పంట కోతలు పూర్తయ్యాయి. ఆయనతోపాటు మరో 40 మంది రైతులు ఇక్కడ గతేడాది కొనుగోలు కేంద్రం పెట్టిన స్థలంలో ధాన్యాన్ని కుప్పపోశారు. కానీ ఇటీవలి వరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడంతో ధాన్యానికి కాపలా కోసం అవస్థలు పడుతూ వచ్చారు. ‘‘55 రోజులుగా పగలూ రాత్రి కాపలా ఉంటున్నాం. రాత్రిళ్లు చలికి వణికిపోతున్నాం.’’ అని బేతయ్య వాపోయాడు. మెదక్ జిల్లా రేగోడ్ మండలం రేగోడ్, కొత్వాన్‌పల్లి గ్రామాల్లో రైతులు ధాన్యం కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. కరెంట్ లేక చీకట్లో ఇక్కట్లు.. సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లిలో మంగళవారం అర్ధరాత్రి ధాన్యాన్ని జల్లి పడుతున్న రైతులు వీరు. జల్లి యంత్రాలు తక్కువగా ఉండటం, ఉన్నవి పాడైపోవడంతో.. రైతులు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. రాత్రిపూట కూడా ఇలా తా లు తీస్తున్నారు. విద్యుత్ సౌకర్యం సరిగా లేక చీకట్లోనే పని చేసుకోవాల్సిన పరిస్థితి. రాత్రిపగలూ ధాన్యం వద్దే.. ఈ ఫొటోలో ధాన్యం కుప్పల పక్కనే నిద్రిస్తున్న మహిళా రైతు పేరు మనెమ్మ. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్గొండకు చెందిన ఆమె.. వారం కింద ధాన్యాన్ని కొను గోలు కేంద్రానికి తెచ్చింది. రెండు రోజుల కిందే కొనుగోళ్లు మొదలయ్యాయి. తమ వంతు ఎప్పుడొస్తుందా అని ఆ మహిళా రైతు వేచిచూస్తోంది. రాత్రిళ్లు ధాన్యం వద్దే నిద్రపోతున్నానని వాపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లా అనంతపురం గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్.. 23 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. రోజూ కాపలా ఉండాల్సి వస్తోందని వాపోయాడు. రైతులు చెప్పిన సమస్యలేంటి? ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి వారా లు గడుస్తున్నా తూకం వేయట్లేదు. కొన్నిచోట్ల నెల రోజులకుపైగా వేచి చూస్తూనే ఉన్నారు. చాలాచోట్ల కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు లేవు. మంచినీళ్లు, విద్యుత్ వంటివేవీ లేవు. రైతులు నీళ్లు, తిండి తెచ్చుకుంటున్నా.. రాత్రిపూట చీకట్లోనే గడపాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో చాలా వరకు ఊరవతల ఉండటంతో పాములు, విష పురుగుల భయంతో గడుపుతున్నారు. చలికాలం కావడంతో రాత్రిపూట మంచుకురుస్తోంది. ధాన్యంలో తేమ శాతం పెరిగే పరిస్థితి. దీనితో రైతులు పగలంతా ధాన్యాన్ని ఆరబోసి, సాయంత్రానికి కుప్పలు చేయాల్సి వస్తోంది. గన్నీ సంచులు లేక, మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాక.. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేయలేని పరిస్థితి ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. ధాన్యాన్ని తూకం వేశాక కూడా రైతులకు తిప్పలు తప్పడం లేదు. ధాన్యాన్ని మిల్లులకు తరలించి, అక్కడి నుంచి ట్రాక్‌షీట్ వచ్చేవరకు రైతులే బాధ్యత వహించాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. దీనితో రైతులు బస్తాలకు కాపలా ఉండాల్సి వస్తోంది. ధాన్యం అమ్ముకునేదెలా? ఈ చిత్రంలో ధాన్యానికి కాపలాగా ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు రైతు తాళ్లూరి నరసింహారావు. కొద్దిరోజుల క్రితమే పంటకోతలు పూర్తయినా.. ధాన్యాన్ని పొలంలోనే ఉంచుకుని కాపలా కాస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాలా? ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోవాలా అన్న సందిగ్ధంలో ఉన్నట్టు చెప్తున్నాడు. కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? నల్లగొండ రైతులతో గవర్నర్ మాటామంతి నల్లగొండ రూరల్/రామగిరి (నల్లగొండ): ‘‘ఎంత ధాన్యం పండింది? ఎన్నిరోజుల కింద తెచ్చారు?’’ అంటూ గవర్నర్ తమిళిసై రైతులను అడిగారు. ఏవైనా సమస్యలుంటే చెప్పాలని కోరారు. రైతులు చెప్పిన అంశాలు, చేసిన విజ్ఞప్తులను విని.. సానుకూలంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. బుధవారం నల్లగొండ శివారులోని ఆర్జాలబావి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్ సందర్శించారు. చర్లపల్లికి చెందిన రైతు మధుసూదన్‌రెడ్డి, పాన్‌గల్‌కు చెందిన మహిళా రైతు మల్లమ్మను పలకరించారు. పది రోజుల కింద కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చామని వారు గవర్నర్‌కు వివరించారు. యాసంగిలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. గడిచిన 27 గంటలలో రికార్డు స్థాయిలో.. 20 సెంమీల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గత 19 ఏళ్లలో ఇంత భారీ వర్షం ఎప్పుడు నమోదు కాలేదని ఐఎండీ అధికారులు తెలిపారు. కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: US Study: ఆయుః ప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా పడిపోతోంది! -
మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నా: శ్రుతిహాసన్
మూడేళ్లుగా సమస్యల్లో ఉన్నట్టు నటి శ్రుతిహాసన్ పేర్కొన్నారు. ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టినట్టు చెప్పే నటి శ్రుతిహాసన్. నటిగా, సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆ మధ్య నటనకు దూరంగా ఉన్నారు. తాజాగా తమిళం, తెలుగు భాషల్లో నటిస్తూ కథానాయకిగా బిజీగా ఉన్నారు. కాగా తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ వార్తల్లో ఉంటున్నారు. లాక్డౌన్ కాలంలో ఇటీవల ఒక వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను మూడేళ్లుగా మానసిక సమస్యను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. కరోనా కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఆగిపోతుందన్నారు. ఇది ప్రకృతికి విరుద్ధమైన పరిస్థితి అన్నారు. ఇది ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అందులో ఒకటి మానసిక సమస్యగా పేర్కొన్నారు. ఇదే ముఖ్యమైన సమస్యగా తాను భావిస్తున్నట్లు అన్నారు. సాధారణంగా ప్రజలు హెచ్చరికగానే ఉంటారన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం బయటకు చెప్పటానికి సంతోషిస్తున్నారన్నారు. తాను కూడా మూడేళ్లుగా మానసిక సమస్యతో బాధపడుతున్నానని చెప్పారు. అయితే అందుకు చికిత్స కూడా పొందుతున్నట్టు తెలిపారు. దీనికి ధ్యానం, యోగ, వ్యాయామం వంటివే చికిత్స అని తెలిపారు. తాను నిత్యం క్రమం తప్పకుడా వీటిని పాటిస్తున్నట్టు తెలిపారు. అదే విధంగా సంగీతాన్ని వినడం, పుస్తక పఠనం, రాయడం వంటివి చేసుకుంటానని తెలిపారు. చదవండి: ఆ కష్టం తెలుస్తోంది! -
ఇజ్రాయిల్‌లో మనోళ్లకు కష్టాలు
ఆర్మూర్: ఉపాధి కోసం ఇజ్రాయిల్ వెళ్లిన తెలుగు వారు కరోనా వైరస్ కారణంగా ఇక్కట్లు పడుతున్నారు. ఇజ్రాయిల్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ నిబంధనల ప్రకారం ఉపాధి కోసం వెళ్లిన తెలుగు వారి సంఖ్య వెయ్యికి పైగా ఉండగా భారతీయులు మొత్తం పది వేల మందికి పైగా ఉంటారు. అనధికారికంగా విజిట్ విసాపై వెళ్లి అక్కడే ఉపాధి వెతుక్కుంటున్న వారి సంఖ్య సైతం అధికంగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్ విస్తరిస్తున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు ‘సాక్షి’తో తమ కష్టాలను పంచుకున్నారు. కరోనా వైరస్ ఇజ్రాయిల్‌లో సైతం విస్తరిస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా షాపింగ్ మాల్స్, థియేటర్లు, హోటళ్లు, బేకరీలు మూసివేసింది. బస్సులను సైతం నిలిపి వేశారు. కార్యాలయాల్లో విధులు నిర్వహించే వారికి హోంటు వర్క్‌కు అవకాశం కల్పించారు. కానీ అధికంగా తెలుగు వారు ఇక్కడ ఇళ్లలో కార్మికులుగా, వృద్ధులను, వికలాంగులను చూసుకొనే కేర్ టేకర్లుగా పని చేస్తుంటారు. వారం రోజులుగా వీరిని పనుల్లోకి రావద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. వారి గదుల్లోనుంచి బయటకు రావొద్దని సూచించారు. దీంతో వారం, పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి గదులకే పరిమితమయ్యామని వారు ఆదేవన వ్యక్తం చేస్తున్నారు. తాము ప్రతి నెల డబ్బులను ఇంటికి పంపిస్తామని, ఇప్పుడు డబ్బులు లేక తమకు రోజు గడవడమే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. -
రెండు రోజులుగా విమానాశ్రయంలోనే..
రణస్థలం: కరోనా ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. దీని విజృంభణకు విదేశాలకు వెళ్లిన భారతీయులంతా తిరిగి స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఉన్నత విద్య కోసం ఫిలిప్పీన్స్ వెళ్లిన 400 మంది విద్యార్థులు తిరిగి దేశానికి రాలేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఎవరి దేశాలకు వారు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించడంతో ప్రయాణాలకు సిద్ధపడిన విద్యార్థులు విమాన సర్వీసులు రద్దయిపోవడంతో రెండు రోజులుగా మనీలా విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. రణస్థలం మండలం జేఆర్ పురానికి చెందిన జి.సాయినిఖిల్, లావేరు మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన ఎం.నరేష్ కూడా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. కరోనా నేపథ్యంలో ఇక్కడ పడుతున్న ఇబ్బందులను ఇలా వివరించారు..(ఏపీలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు) ‘ఫిలిప్పీన్స్‌లో మన దేశానికి చెందిన 400 మంది విద్యార్థులం ఎంబీబీఎస్ చదువుతున్నాం. నాలుగేళ్లుగా అక్కడే ఉంటున్నాం. ఇందులో 85 మంది తెలుగు వారే. మూడు రోజుల కిందట ఫిలిప్పీన్స్ ప్రభుత్వం విదేశీయులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని ఆదేశించింది. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఇండియా వచ్చేందుకు విమాన టికెట్లు తీసుకుని అంతా మనీలా ఎయిర్‌పోర్టుకు వచ్చాం. కానీ రెండు రోజులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ విమానాశ్రయం మూసేస్తున్నట్లు ప్రకటించారు. విమాన సరీ్వసులు రద్దు చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో మాకేమీ పాలు పోవడం లేదు. టికెట్ రూ. 30వేలు పెట్టి కొన్నాం. రిఫండ్ వస్తుందో రాదో తెలీడం లేదు. ఉండేందుకు వసతులు లేవు. తిరిగి రూములకు వెళ్లిపోదామంటే ఉండేందుకు డబ్బులు లేవు. ఇక్కడి ప్రభుత్వం మాకేమీ సహకరించడం లేదు.’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి రాక కోసం గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అధికారులు, ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు. (తాత్కాలికంగా శ్రీవారి దర్శనం రద్దు) ప్రభుత్వమే రప్పించాలి విమాన టికెట్లు బుక్ చేసుకొని విమానాశ్రయానికి చేరుకుంటే విమానాలు రద్దు చేస్తున్నాం, విమానాశ్రయమే మూసేస్తున్నాం అని చెబితే చదువు కోసం వెళ్లిన విద్యార్థులు ఏం చేయగలరు..? భోజనాలు కూడా దొరకడం లేదంట. ప్రభుత్వమే వారిని రప్పించే ఏర్పాట్లు చేయాలి. – కల్యాణకుమార్ రాజా, విద్యార్థి నిఖిల్ తండ్రి ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మూడు రోజులు గడువిచ్చి స్వదేశాలకు వెళ్లిపొమ్మంది. ఈ లోగానే విమాన సరీ్వసులు రద్దయిపోయాయి. మనీలా విమానాశ్రయం మూసేస్తున్నారని మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు. కరోనా వల్ల వారు ఏం ఇబ్బందులు పడుతున్నారో..? ప్రభుత్వం చొరవ తీసుకుని వారిని రప్పించాలి.– ఎం.గోవిందరావు, విద్యార్థి నరేష్ తండ్రి -
ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్సీక్వెన్సెస్, క్యూర్’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని, మరీ ముఖ్యంగా.. మనకు సందర్భోచితంగా ఉండటంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు. -
కృష్ణా జిల్లా రైతాంగాన్ని వెంటాడుతున్న కష్టాలు
-
మృత్యువుతో పోరాడి...
సాక్షి, పొదలకూరు(నెల్లూరు) : రెక్కాడితే గానీ డొక్కాడని గీత కార్మిక కుటుంబం వారిది. కల్లు గీసుకొని ఉన్నంతలో సంతోషంగా జీవించే వారు. విధి వెక్కిరించి కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది. ఉన్నదంతా ఊడ్చిపెట్టి, గ్రామంలో అప్పులు చేసి, గ్రామస్తుల సాయం పొందినా ఇప్పటికీ ఆ కుటుంబం కోలుకోలేకపోతోంది. సీఎం సహాయనిధి నుంచి సాయం కోసం ఎదురుచూస్తోంది. కాటేసిన విద్యుత్ తీగలు మండలంలోని మర్రిపల్లికి చెందిన అయితా శివశంకర్ (30) కల్లుగీత కార్మికుడు. సీజన్లో కల్లుగీసి కుటుంబాన్ని పోషిస్తుంటారు. ఏడాది క్రితం వివాహం కూడా చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం తాటిచెట్టెక్కి కల్లు గీస్తున్న సమయంలో చెట్టుకు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో చెట్టుపై ఉన్న శివశంకర్ విద్యుదాఘాతానికి గురై చెట్టుకే అతుక్కుపోయారు. సమీపంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు గమనించి అతికష్టంపై తాళ్లు, కర్రలతో శివశంకర్‌ను కిందికి లాగారు. దీంతో చెట్టుపై నుంచి యువకుడు కిందపడిపోయారు. విద్యుదాఘాతంతో చేతులు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. విద్యుదాఘాతం తగిలిన ప్రతి చోటా మాడిపోయి నల్లగా మారింది. వెంటనే నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా, చెన్నై తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. కుటుంబసభ్యులు చెన్నైలోని విజయా ఆస్పత్రిలో చేర్పించి మూడు నెలల పాటు అక్కడే ఉంచారు. విద్యుదాఘాతంతో శరీరమంతా ఇన్ఫెక్షన్ సోకడంతో శివశంకర్‌కు మొత్తం ఆరు శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. కుడిచేయి వేళ్లు పనిచేయకపోవడంతో వాటిని తొలగించారు. దీని కోసం రూ.10 లక్షల వరకు ఆ పేద కుటుంబం వెచ్చించింది. బిడ్డను బతికించుకునేందుకు తల్లిదండ్రులు, సోదరి అప్పులు చేశారు. చికిత్స పొందుతున్న సమయంలోనే శివశంకర్‌కు ఆడపిల్ల జన్మించింది. కుమార్తెను చూసేందుకు సైతం వీల్లేకుండా ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి రావడంతో ఆ యువకుడు కుమిలిపోయారు. సీఎం సహాయనిధి నుంచి సాయం అందేలా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యే కాకాణి దృష్టికి తీసుకెళ్లాం గ్రామానికి చెందిన గీత కార్మికుడు శివశంకర్ కష్టాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వెంటనే స్పందించి సీఎం సహాయ నిధి కోసం యత్నిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా గౌడ సంఘం ద్వారా కొంత మొత్తాన్ని సాయంగా అందజేశాం. చిన్న వయస్సులో శివశంకర్ మంచానికే పరిమితం కావడం ఆవేదన కలిగిస్తోంది. – కోసూరు సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మర్రిపల్లి -
రూ.120 కోట్లు కావాలి !
సాక్షి, ఆదిలాబాద్ : జిల్లాలోని సర్కారు బడుల్లో సమస్యలు వేధిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అనేక పాఠశాలల్లో అదనపు తరగతి గదుల కొరత, ప్రహరీలు లేకపోవడం, మరుగుదొడ్లు, నీటి సౌకర్యం తదితర సమస్యలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏటా సరిపడా నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందగా ఉన్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల పరిష్కారం కోసం, వసతుల కల్పనకు జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. 2019– 20 విద్యాసంవత్సరానికి అవసరం అయ్యే నిధుల కోసం అధికారులు ప్రణాళిక తయారు చేసి ఇటీవల ప్రభుత్వానికి పంపించారు. రూ.120 కోట్లతో ప్రతిపాదనలు జిల్లాలో 1,282 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 970 ప్రాథమిక పాఠశాలలు, 122 ప్రాథమికోన్నత, 195 ఉన్నత పాఠశాలలు ఉన్నా యి. వీటిలో 94,737 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాగా విద్యాశాఖ అధికారులు విద్యాసంవత్సరంలో పాఠశాలల నిర్వహణ, వాటిలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పనకు అవసరమయ్యే నిధుల కోసం కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి రూ.120.55 కోట్ల ప్రతిపాదనలు పంపిం చారు. ఏయే అవసరాలకు ఎన్ని లక్షల నిధులు అవసరమవుతాయనే వివరాలతో సమగ్ర నివేదికను తయారు చేశారు. ఇటీవల హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి నివేదిక పంపారు. ఈ నివేదికను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ ఆమోదిస్తే నిధులు విడుదల అవుతాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వాటా కలిపి నిధులు విడుదల చేస్తుంది. నిధులు మంజూరు కాగానే పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర అభివృద్ధి కార్యక్రమాలను విద్యాశాఖ అధికారులు చేపడుతారు. కాగా అధికారులు ప్రతిపాదనలు పంపిన వాటిలో పాఠశాలల బలో పేతం కోసం రూ.40 కోట్లు, విద్యార్థుల రవాణాభత్యం కోసం రూ.37లక్షలు, ఉచిత పాఠ్యపుస్తకాల కోసం రూ.2.36 కోట్లు, వసతిగృహల నిర్వహణ కోసం రూ.46 లక్షలు, గుణాత్మక విద్యకురూ.18 కోట్లు, స్కూల్ గ్రాంటు కోసం రూ.4 కోట్లు, డిజిటల్ తరగతులు, ఉపాధ్యాయుల శిక్షణ, మధ్యాహ్న భోజ న పథకం, ఉచిత యూనిఫాం, మౌలిక వసతులు కోసం ప్రణాళిక తయారు. అలాగే కేజీబీవీల కోసం రూ.37.44 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. వేధిస్తున్న సమస్యలు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో సమస్యలు వేధిస్తున్నాయి. పాఠశాలల్లో వంట గదులు లేకపోవడంతో నిర్వాహకులు వర్షాకాలంలో వంట చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మరుగుదొడ్లు ఉన్నా నీటిసౌకర్యం లేకపోవడంతో మరుగుదొడ్లు నిరుపయోగంగా మారాయి. కొన్ని పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం కూడా లేదు. అదేవిధంగా ప్రహరీలు లేవు, కొన్ని పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేకపోవడంతో చెట్ల కింద చదువులు సాగుతున్నాయి. గతంలో ఆర్వీఎం పథకం ద్వారా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అధిక మొత్తంలో విడుదలయ్యేవి. ఈ నిధులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, తదితర కార్యక్రమాలు నిర్వహించే వారు. అయితే ఆర్వీఎంను సమగ్ర శిక్ష అభియాన్ పథకంలో విలీనం చేయడంతో తక్కువ మొత్తంలో నిధులు విడుదల అవుతున్నాయి. విద్యాశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనల్లో దాదాపు 60 శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో పాఠశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. కాగా ఈ విద్యాసంవత్సరం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,644 కోట్ల విడుదల చేసిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే జిల్లాకు రూ.70కోట్ల నిధుల వరకు విడుదల అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రతిపాదనలు పంపించాం విద్యావార్షిక ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాం. రూ.120కోట్లతో ప్రతిపాదనలు పంపించాం. విడుదలైన నిధులతో పాఠశాలలో మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు శిక్షణ, యూనిఫాం, విద్యార్థులకు వసతులు కల్పిస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు విడుదలైన నిధులు ఖర్చు చేస్తాం. – రవీందర్‌రెడ్డి, డీఈవో -
వేళకురాని వైద్యులు..రోగుల ఎదురుచూపులు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది. సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు తూట్లు వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
నిప్పుల కొలిమి!
సాక్షి, వనపర్తి : వేసవి కాలం మొదలవడంతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు జయటకు రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్,, అంబేద్కర్‌చౌరస్తా, బస్టాండ్, కమాన్, వివేకానందచౌరస్తా తదితర కాలనీల్లో శీతలపానీయాల దుకాణాలు వెలిశాయి. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు అంబలి, చెరుకురసం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. పనిమీద బయటకు వెళ్లేవారు గొడుగులు, రుమాళ్లు, హెల్మెంట్, ఇతర వాటిని ధరించి వెళ్తున్నారు. ఎండకాలం రావడంతో కూలర్లు, ప్రిజ్‌లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో చల్లటి నీళ్లు తాగేందుకు మట్టికుండలను కొనుగోలు చేస్తున్నారు. ఎండలో తిరుగొద్దని, తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఉన్నా.. లేనట్లే!
సాక్షి, తిమ్మాజిపేట: రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన తిమ్మాజిపేట ఆర్టీసీ బస్టాండ్ వృథాగా మారింది. మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ.12 లక్షలతో నిర్మించిన బస్టాండ్‌ను అప్పటి ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ 2001 మేలో ప్రారంభించారు. కొంతకాలం పాటు బస్సులు బస్టాండ్‌లోకి రాకపోకలు కొనసాగించాయి. ఆ తర్వాత బస్సులు బస్టాండ్‌లోకి వెళ్లకపోవడంతో ప్రయాణికులు సైతం బస్టాండ్‌లోకి వెళ్లడం లేదు. దీంతో రోడ్డుపైనే బస్సులు ఆపడంతో ప్రయాణికులు సైతం అక్కడే ఎక్కుతున్నారు. అధికారుల హడావుడి.. గత ఏడాది ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు హడావుడి చేశారు. బస్టాండ్‌కు రంగులు వేయించి అవరణను శుభ్రం చేయించారు. నేల రోజుల పాటు బస్సులను బస్టాండ్‌లోకి వచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ సిబ్బందిని సైతం నియమించి బస్సుల రాకపోకలకు సాగేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం సిబ్బందిని తొలగించడంతో బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా ఆర్టీసీకి ఆదాయం గండి పడుతుంది. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బస్సులను బస్టాండ్‌లోకి వెళ్లే విధంగా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇబ్బంది పడుతున్నాం బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్డుపైనే బస్సుల కోసం నిల్చుని ఎదురుచూస్తున్నాం. వర్షాకాలంలో, వేసవి కాలంలో రోడ్డుపైనే ఉండాల్సి వస్తుంది. అధికారులు చొరవ తీసుకుని బస్టాండ్‌లోకి బస్సులు వెళ్లే విధంగా చూడాలి. – కృష్ణ, కోడవత్ తండా -
పురాతన భవనంలో ‘గ్రంథాలయం’
సాక్షి, దేవరకద్ర రూరల్ : దేవరకద్రలోని శాఖ గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతుంది. దీంతో పాఠకులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నప్పటికీ గ్రంథాలయం విషయంలో గ్రామస్థుల తలరాత మారడంలేదు. కొన్నేళ్లుగా గ్రంథాలయం పురాతన భవనంలో కొనసాగుతున్న అడిగే నాథుడే కరువయ్యాడు. భవనం పై కప్పుకున్న సిమెంట్ రేకులకు రంధ్రాలు కావడంతో వర్షాకాలంలో పాఠకులు పడే అవస్థలు వర్ణణాతీతం. అన్నిటికీ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని అన్న చందంగా గ్రంథాలయం పరిస్థితి మారిపోయింది. పాఠకులకు కావల్సిన పుస్తకాలు అన్ని ఉన్నప్పటికీ భవనం శిథిలావస్థకు చేరడంతో వాటికి భద్రత లేకుండా పోయింది. కొన్నేళ్లుగా గ్రామస్థులు పలు సార్లు సమస్యను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లిన లాభం లేకుండా పోయింది. ఎన్నికలప్పుడు హామీలిస్తున్న పాలకులు ఎన్నికలైపోయాక వాటి ఊసే ఎత్తడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు వివిధ కార్యాలయాలకు వెళ్లే అధికారులు , ప్రజాప్రతినిధులు గ్రంథాలయం భవనం ముందు నుంచే వెళ్తారు. కానీ ఏ ఒక్కరోజు కూడా గ్రంథాలయం గురించి పట్టించుకొనే నాథుడే లేకుండా పోయారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు పలు గ్రామాలకు కూడలిగా ఉన్న గ్రంథాలయ భవనం ఈ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు. కావున ఇప్పటికైనా పాఠకుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రజాప్రతినిధులు, అధికారులు తగు చొరవ చూపి శి«థిలావస్థకు చేరిన గ్రంథాలయ భవనాన్ని నూతన భవనంగా మార్చేలా కృషి చేయాలని పాఠకులు కోరుతున్నారు. నెరవేరని చైర్మన్ హామీ.. దేవరకద్ర శాఖ గ్రంథాలయ భవనానికి కొత్త భవనం మంజూరుజేస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ హామీ ఇచ్చారు.ఇటీవల గ్రంథాలయ భవనాన్ని చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్ సందర్శించి పరిశీలించారు. అప్పుడు పాఠకులు సమస్యను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.త్వరలో కొత్త భవనం మంజూరుచేస్తామని హామీ ఇచ్చారు. కాని ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. నిర్లక్ష్యం తగదు గ్రంథాలయ భవనం విషయంలో నిర్లక్ష్యం తగదు. భవనం పక్షులకు నిలయంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. అయినా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధకరం. ఈ విషయంలో నాయకులు తగు చొరవ చూపితే బాగుంటుంది. –నిరంజన్‌రెడ్డి, దేవరకద్ర -
అక్కడ అసమ్మతి రాగం, ఇక్కడ ఆత్మవిశ్వాసం
సాక్షి, పాడేరు: సార్వత్రిక ఎన్నికల తేదీని ప్రకటించడంతో పాడేరు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. 2019 ఎన్నికల బరిలో నిలిచేందుకు వైఎస్సార్ సీపీ,టీడీపీ బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి గిరిజన సంక్షేమ మంత్రి పదవిని కూడా నిర్వహించిన పసుపులేటి బాలరాజు 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఈ సారి అనూహ్యంగా జనసేన పార్టీలో చేరి పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేం దుకు సిద్ధం కావడం తాజా పరిణామం. అలాగే గత ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో ఈ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన లోకులగాంధీ ఈ సారి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ పార్టీ టికెట్ కోసం బీజేపీ సీనియర్ నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, నందోలి ఉమామహేష్ కూడా దరఖాస్తు చేశారు. మాజీ మంత్రి బాలరాజు కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరిన నియోజకవర్గంలోని పలువురు సీనియర్ నాయకులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. ఇందులో ముఖ్యంగా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి గా పోటీ చేసి ఓటమి చెందిన తమర్భ కృష్ణవేణి, సీదరి మంగ్లన్నదొరతో పాటు మరో సీనియర్ నాయకుడు స్వాముల సుబ్రహ్మణ్యం పాడేరు కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసి బరిలో దిగేందుకు నిరీక్షిస్తున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది పార్టీ ఫిరా యించిన సిటింగ్ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేరును పాడేరు టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసింది. గానీ అధికారికంగా ప్రకటించలేదు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిని ఖరారు చేయవలసి ఉంది. రాజకీయ ముఖచిత్రం : నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్సీపీదే నియోజకవర్గంలో పైచేయిగా ఉంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లోనూ బూత్‌స్థాయిలో ఈ పార్టీ బలోపేతంగా ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 26వేల పైచిలుకు మెజార్టీతో గెలుపొందిన గిడ్డి ఈశ్వరి పార్టీఫిరాయించిటీడీపీలో చేరి నప్పటికి కేడర్ పార్టీకి దూరం కాలేదు. ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాల్లో వైఎస్సార్సీపీ కేడర్ విస్తరించి ఉంది. 15 ఏళ్ల తర్వాత టీడీపీ పోటీ : పాడేరు నియోజకవర్గంలో 15ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపుతోంది. 2009లో నియోజకవర్గం పునర్విభజన తర్వాత కూడా పాడేరు నుంచి టీడీపీ అసెంబ్లీకి ఇప్పుడే పోటీ చేస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ ఆరుసార్లు పోటీ చేయగా మూడుసార్లు గెలుపు, మూడు సార్లు ఓటమి చెందారు. రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత పాడేరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థులు వరుసగా 1983, 1989, 2004లో జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందగా 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో సీపీఐ పొత్తుతోను, 2014లో బీజేపీతో పొత్తుతోను టీడీపీ ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు దూరంగా ఉంది. దీంతో గత 15 ఏళ్లుగా టీడీపీ అభ్యర్థులు బరిలో లేకపోవడంతో నియోజకవర్గంలో ఈ పార్టీ బలహీనపడింది. ఫిరాయింపు ఎమ్మెల్యేతో మరింత అసమ్మతి : వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన గిడ్డి ఈశ్వరికి పాడేరు టికెట్ కేటాయించడంతో తెలుగుదేశం పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నేతల్లో అసమ్మతి వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారితో పాటు నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిలుగా ఉన్న సీనియర్ నాయకులు బొర్రా నాగరాజు, ప్రస్తుత జీసీసీ చైర్మన్ ఎంవీవీఎస్ ప్రసాద్ కూడా పాడేరు టీడీపీ టికెట్‌ను ఆశించారు. దీంతో ఈ ముగ్గురు సీనియర్లు అధి ష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. గతంలో కూడా సీపీఐ, బీజేపీ పొత్తుతో సీట్లు దక్కక నిరాశతో ఉన్న ఈ నేతలకు ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మూలంగా భంగపాటు తప్పలేదు. సీటు దక్కకపోవడంతో నియోజకవర్గంలోని సీనియర్ నేతలు పార్టీ అధినేత చంద్రబాబు వద్ద, మంత్రుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినా ఫలితం లేకపోవడంతో అలకపాన్పు ఎక్కారు. అలాగే మరికొందరు సీనియర్ నేతలు కూడా అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీలో చేరి సాధించిన అభివృద్ధి ఏమి లేకపోగా, పార్టీ నేతలు కలిసి రాకపోవడంతో టీడీపీ అభ్యర్థి పరిస్థితి అయోమయంగా ఉంది. జనసేన పార్టీ అభ్యర్ధి పసుపులేటి బాలరాజుకు పవన్ కళ్యాణ్ అభిమానులు తప్ప నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణాత్మకంగా విస్తరించకపోవడం ప్రతీకూల అంశంగా ఉంది. మిత్రపక్షమైన సీపీఐ మద్దతుతో నెగ్గుకు రావచ్చునని బాలరాజు బరిలో నిలిచారు. ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణగా బీజేపీ నేతలు కేంద్రప్రభుత్వ పథకాల్ని ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి ఆ పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతి, సామాజిక వర్గంలో తగ్గిన ఆదరణ, పార్టీ ఫిరాయింపు వల్ల ఓటర్లలో ఏర్పడిన వ్యతిరేకత, అభివృద్ధిలో వివక్ష ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ప్రధానపార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీల మధ్యే ప్రధాన పోరు సాగనుంది. -
నర్సీపట్నంలో టీడీపీ ఎదురీత
సాక్షి, నర్సీపట్నం : ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్ల నియోజకవర్గంలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మంత్రి అయ్యన్నపాత్రుడు అభివృద్ధి చేసినా అదేస్థాయిలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో జనం విసిగిపోయారు. అర్హులకు పథకాలు అందకుండా అడ్డుకున్నారు. అందినంత దోచుకున్నారు. దీంతోపాటు గతంలో ఎన్నడూలేని విధంగా మంత్రి కుటుంబంలో బయటపడిన కలహాల ప్రభావం ఎన్నికలపై చూపనుంది. ఈ పరిస్థితులన్నీ టీడీపీకి వ్యతిరేకం కాగా వైఎస్సార్సీపీకి అనుకూలించవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. రచ్చకెక్కిన విభేదాలు మంత్రి అయ్యన్నపాత్రుడు, సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ సన్యాసిపాత్రుడు టీడీపీ ఆవిర్భావం నుంచి వీరు సఖ్యతగానే ఉండేవారు. ఇందుకు భిన్నంగా రెండేళ్ల నుంచి ఆ రెండు కుటుంబాల మ«ధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. మంత్రి తనయుడు విజయ్ వ్యవహార శైలిపై బాబాయ్ సన్యాసిపాత్రుడు స్వయంగా పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీని ప్రభావం కూడా ఎన్నికల్లో చూపనుంది. జన్మభూమి కమిటీలతో విసిగిన జనం మంత్రి అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో అభివృద్ధి చేసినప్పటికీ అదేస్థాయిలో జన్మభూమి కమిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి అందినంత దోచుకున్నాయన్న విమర్శలున్నాయి. గ్రామస్థాయిలో ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల రుణాలు, కాలనీ ఇళ్లు కేటాయింపులో జన్మభూమి కమిటీలు కమీషన్ల పేరుతో అవినీతికి పాల్ప డ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కమిటీ సభ్యుల చేతివాటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రెండింటి మధ్యే పోటీ ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యే పోటీ ఉన్నప్పటికీ జనసేన, కాంగ్రెస్ పార్టీలు కూడా ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే జనసేన, కాంగ్రెస్ నుంచి పోటీచేసే అభ్యర్థులపై ఇంకా స్పష్టత లేదు. ఆకర్షిస్తున్న నవరత్నాలు గత ఎన్నికల్లో చంద్రబాబు భారీ స్థాయిలో హామీలిచ్చినా అవి క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాల రుణ మాఫీ కానందున అప్పులు పాలయ్యారు. ఈ విషయంలో వారిలో ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. రైతు రుణ మాఫీ విషయంలో సైతం ఇంకా చివరి రెండు విడతల నిధులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. వారంతా కూడా టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు. ఇలా గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు సక్రమంగా లేకపోవడంతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల ప«థకాలతో అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందని ప్రజలు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు తక్కువ మెజారిటీతో గెలుపొందారు. అప్పటికన్నా గ్రామస్థాయిలో వైఎస్సార్సీపీ మరింత బలపడింది. ఇవన్నీ టీడీపీ ఎదురీతకు కారణం కానున్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
పోలీసులకు సవాల్..
సాక్షి, వనపర్తి క్రైం: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నెలరోజులుగా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వ్యాపార దుకాణాలు, ఆలయాలు, ఇళ్లు తేడా లేకుండా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ప్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు దగ్గరవుతున్న పోలీస్ యంత్రాంగం చోరీల విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో రోజురోజుకు వారిపై ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతోంది. చోరీల పర్వం ఇలాగే సాగితే.. పోలీస్ శాఖపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. దొంగతనం జరిగినప్పుడే హడావుడి.. దొంగతనం జరిగినప్పుడే క్లూస్ టీం, ఇతర పోలీస్ అధికారులు హడావుడి చేయడం, ఆ తర్వాత ఆ ఊసే మరిచిపోవడంతో చోరీలు యధావిధిగా కొనసాగుతున్నాయి. తరుచూ జరుగుతున్న దొంగతనాలను చేధించడంలో పోలీసులు విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. చిన్న చిన్న చోరీలను పోలీసులు నామమాత్రంగా వదిలేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నా.. దొంగతనాలు మాత్రం ఆగడం లేదు. రాత్రివేళలోనే కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ ఆనవాళ్లు దొరకకుండా విజృంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిత్యం ఏదో ఒకచోట దొంగతనం జరుగుతూనే ఉంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చోరీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తే అరికట్టవచ్చని ప్రజలు అంటున్నారు. దేవాలయాల్లో.. చోరీలకు అలవాటుపడిన కొందరు దేవాలయాలను కూడా వదలడంలేదు. ఆలయాల్లోకి చొరబడి మరీ హుండీలను పగలగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుస హుండీల దొంగతనాలు పోలీసులకు సవాల్‌గా మారింది. ఫిబ్రవరి 27 వనపర్తి మండలం నాగవరం కోదండరామస్వామి ఆలయం, రాజనగరం అయ్యప్ప దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు ఆలయంలోని హుండీలను పగులగొట్టి నగదును ఎత్తికెళ్లారు. ఈ నెల 1న అర్ధరాత్రి చిన్నచింతకుంట మండలం కురుమూర్తిస్వామి ఆలయంలో హుండీని పగులగొట్టి నగదును దోచుకెళ్లారు. మంగళవారం కొత్తకోట మండల శివారులోని వెంకటగిరి, పట్టణంలోని సాయిబాబ, కోట్ల ఆంజనేయస్వామి ఆలయాల్లో హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. అదేవిధంగా వెంకటగిరి ఆలయంలో శఠగోపంతోపాటు తీర్థం పోసే పాత్ర ఎత్తుకెళ్లారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస హుండీల చోరీలతో ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతుంది. -
ఇరుకు గదులతో ‘వంట’కు తంటా!
సాక్షి, మదనాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఆరుబయటే వండుతున్నారు. ఆరుబయట కట్టెలపొయ్యిపై వండుతుండంతో విద్యార్థుల కళ్లు మండుతున్నాయి. చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. మధ్యాహ్న భోజనం వండేందుకు ప్రత్యేక వంటగదులు కట్టించాలని, సిలిండర్లు సరఫరా చేయాలని వంట ఏజెన్సీలు కోరుతున్నాయి. మండలంలో ఇదీ పరిస్థితి.. మండలంలో 19 ప్రాథమిక పాఠశాలు 4జిల్లా పరిషత్ పాఠశాలలు, 1 యూపీఎస్ పాఠశాల, 1 కస్తూర్బాగాందీ బాలికాల పాఠశాల, 1 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలు ఉన్నాయి. మొత్తం 2110 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకు రావాలన్న ఆలోచనతో ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆచరణలో సమగ్రంగా అమలు చేయడం లేదు. ఆరు బయటే వంట.. ప్రధానంగా మదనాపురం మండల కేంద్రంతో పాటు దుప్పల్లి ద్వాకరనగరం ,నర్సింగపురం కరివెన, తదితర గ్రామాల్లో వంట గదులు చిన్న గా ఉండటం తో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వంట చేసే సమయం లో వంట చెరుకు వలన వచ్చె పొగ బయటకు పోక పోవడంతో ఆగది పోగతో కమ్ముకుంటుందని చెబుతున్నారు.దీంతో తాము గదుల్లో వంట చేయడం లేదని నిర్మాణ సమయంలో సరిౖయెన పారదర్శకాలు పాటించ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో గత్యంతరం లేక బయట వంట చేసి కొన్ని సమయాల్లో ఆరు బయటనే అన్నము వడ్డిస్తున్నామని పలువరు అంటున్నారు. కుక్కల స్వైరవిహారం పాఠశాల లో ప్రహరీ లేని చోట మదనాపురం పీఎస్ సంతబజార్, గోపన్‌పేట పీఎస్, కరివెన పీఎస్, గోవిందహళ్లీ పీఎస్, బౌసింగ్తండాపీఎస్, పెద్దతండా పీఎస్ తదితర పాఠశాలల్లో మధ్యాహన భోజన సమయంలో పందులు, కుక్కలు సైర విహారం చేస్తాయి. ఈ విషయమై విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబందిత అధికారులు స్పందించి ఆరు బయట వంట చేయకుండా నిర్వాహకులకు అవగాహన కల్పించా లని విద్యావంతులు కోరుతున్నారు.