నిర్మానుష్యంగా మారిన రాజీవ్‌చౌరస్తా
సాక్షి, వనపర్తి : వేసవి కాలం మొదలవడంతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు జయటకు రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్,, అంబేద్కర్‌చౌరస్తా, బస్టాండ్, కమాన్, వివేకానందచౌరస్తా తదితర కాలనీల్లో శీతలపానీయాల దుకాణాలు వెలిశాయి.
ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు అంబలి, చెరుకురసం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. పనిమీద బయటకు వెళ్లేవారు గొడుగులు, రుమాళ్లు, హెల్మెంట్, ఇతర వాటిని ధరించి వెళ్తున్నారు. ఎండకాలం రావడంతో కూలర్లు, ప్రిజ్‌లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో చల్లటి నీళ్లు తాగేందుకు మట్టికుండలను కొనుగోలు చేస్తున్నారు. ఎండలో తిరుగొద్దని, తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment