humidity
-
ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?
మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్ ఇండెక్స్’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్ కోడింగ్ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్ ఇండెక్స్’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే.. ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్ హ్యూమిడిటీ) కూడా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమటపడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి ఏమిటి సంబంధం? మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మామూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు. ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? - ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. - 26 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. - ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్ ఇండెక్స్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఏమిటి దీనితో ప్రయోజనం? ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్ ఇండెక్స్’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది. ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశాఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ. ఇప్పటికే ‘ఫీల్స్ లైక్’పేరిట.. ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్ లైక్’, ‘రియల్ ఫీల్’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోని వెదర్ యాప్స్‌లో కూడా ఈ హీట్ ఇండెక్స్ అంచనాలను చూడవచ్చు. - ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్ ఇండెక్స్ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్ ఇండెక్స్’ను నిర్ధారించాల్సి ఉంటుంది. ‘హీట్ ఇండెక్స్’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. – సాక్షి సెంట్రల్ డెస్క్. ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు -
హైదరాబాద్ లో దడ పుటిస్తున ఎండలు
-
వాటర్ జనరేటర్లు: గాల్లోంచి తాగు నీరు ఎలా వస్తుందంటే..
మంచి నీటి ఎద్దడిని తట్టుకునేందుకు తట్టుకునేందుకు యూఏఈ, టెక్నాలజీ సాయం తీసుకుంటోంది. వాటర్ జనరేటర్ల సాయంతో తేమ నుంచి నీటిని తయారు చేసుకుంటోంది. అదీ పర్యావరణానికి ఎలాంటి భంగం కలిగించకుండానే!. ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కాగా.. త్వరలో అధికారికంగా ఈ సెటప్‌ను దేశవ్యాప్తంగా లాంఛ్ చేయనుంది. విశేషం ఏంటంటే.. తాగు నీరు కోసం జరిగిన ప్రయోగాల్లో ఇదే భారీ సక్సెస్ కూడా. అబుదాబి: పూర్తిగా సోలార్ పవర్‌తో నడిచే ప్రాజెక్ట్ ఇది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా.. హైపర్-డెహూమిడీఫైయర్స్ అనే జనరేటర్ల(20 జనరేటర్ల దాకా) సాయంతో రోజూ 6,700 లీటర్ల తాగు నీటిని తయారు చేశారు. పైగా ఇది నిరంతర ప్రక్రియ కావడం విశేషం(ప్రపంచంలోనే ఈ తరహా ప్రయోగం మొదటిది ఇదే). ఇవి ఎలా పని చేస్తాయంటే.. సోలార్ ప్యానెల్స్- భారీ ఫ్యాన్లు-పైపులను అనుసంధానించి ఈ వాటర్ జనరేటర్ల సెటప్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యాన్లు వాతావరణంలోని తేమను లాక్కుని.. అనుసంధానంగా ఉన్న పైపుల ద్వారా జనరేటర్ సెటప్‌లకు చేరవేస్తాయి. ఈ మధ్యలో పైపుల గుండా తేమకు ప్రత్యేకమైన లిక్విడ్(చల్లబరిచేవి) చేరుస్తారు. తద్వారా ఆ తేమ పోయే కొద్దీ నీటి బిందువులుగా మారతాయి. ఆపై ఆ తేమ నీరు బొట్టు బొట్టుగా పెరిగి.. ఆ నీరు దశలవారీగా ఫిల్టర్ అవుతుంది. ఫైనల్‌గా ఈ వాటర్ జనరేటర్లు తాగు నీటిని బయటకు వస్తుంది. కండిషన్స్ అప్లై ఇలా గాల్లో తేమ నుంచి నీటిని ఉత్పత్తి చేయడం కొత్తేం కాకపోవచ్చు. అయితే అవి అవసరాల కోసమే తప్పించి.. మంచి నీటి కోసం ఉత్పత్తి చేసేవి లేవు. యూఏఈ పరిశోధనలు మాత్రం భారీ లెవల్లో నీటిని ఉత్పత్తి చేయడం, అదీ తాగు నీటి అవసరాల కోసం చేయడం ప్రపంచంలో తొలిసారి. ఇక 26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద.. అదీ గాల్లో 60 శాతం తేమ శాతం ఉన్నప్పుడు ఈ వాటర్ జనరేటర్లు పనిచేశాయి(పైలట్ దశలో ఇదే తేలింది). త్వరలో అబుదాబి ఎయిర్పోర్ట్ దగ్గర్లోని మస్దర్ సిటీలో దీనిని లాంఛ్ చేయనున్నారు. సుమారు 54 ఎకరాల్లో సుమారు తొంభై వేల సోలార్ ప్యానెల్స్ ద్వారా ఈ సెటప్ ఏర్పాటు చేయబోతున్నారు. -
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
కరోనా వ్యాప్తిపై వేసవి ప్రభావం తక్కువ
వాషింగ్టన్: ఉత్తరార్ధగోళంలోని అధిక వేసవి ఉష్ణోగ్రతలు కరోనా వైరస్ వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేసే అవకాశం లేదని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం అధ్యయనం తెలిపింది. ఈ మేరకు సైన్స్ జర్నల్‌లో ఓ నివేదికను విడుదల చేసింది. గత కొన్ని నెలలుగా నిర్వహించిన అనేక అధ్యయనాలు వాతావరణం, కరోనా వైరస్ మధ్య సంబంధం ఉన్నట్లు తెలిపాయి. ఎక్కువ వేడిగా ఉన్న ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందడానికి తక్కువ అవకాశం ఉన్నట్లు ఈ అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఇవన్ని ప్రాథమిక దశలోనే ఉండటంతో వాతావరణం, కోవిడ్-19 మధ్య ఖచ్చితమైన సంబంధం గురించి పూర్తిగా తెలియడం లేదు.(కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ప్రిన్స్టన్ అధ్యయనం ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దీనిలో వాతావరణం, వైరస్ వ్యాప్తి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పూర్తిగా తోసిపుచ్చలేదు. అయితే వైరస్ వ్యాప్తిపై వాతావరణం ప్రభావం చాలా పరిమితంగా ఉంటుంది అని ఈ అధ్యయనం తేల్చింది. అంతేకాక సమర్థవంతమైన నియంత్రణ చర్యలు లేకుండా కేవలం వాతావరణ పరిస్థితుల మీద నమ్మకం ఉంచడం క్షేమం కాదని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని .. వేసవి వాతావరణం మహమ్మారి వ్యాప్తిని గణనీయంగా పరిమితం చేస్తుందని భావించవద్దని సూచించింది.(సెప్టెంబర్ నాటికి మూడుకోట్ల డోస్‌లు!) అంతేకాక మహమ్మారి ప్రారంభ దశలో ఎక్కువ వెచ్చని లేదా ఎక్కువ తేమతో కూడిన వాతావరణం వైరస్ వ్యాప్తిపై ఎలాంటి ప్రభావం చూపించలేదని తాము గర్తించినట్లు ప్రిన్స్టన్ ఎన్విరాన్మెంటల్ ఇన్స్టిట్యూట్ (పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ అసోసియేట్) రాచెల్ బేకర్ అన్నారు. ఫ్లూ జాతికి చెందిన వైరస్ల వ్యాప్తిలో తేమ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ కోవిడ్ 19 వ్యాప్తిపై పరిమాణం వ్యాప్తిపై వాతావరణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా.. అధిక జనాభా కారణంగానే వైరస్ త్వరగా వ్యాపిస్తుందని బేకర్ అన్నారు.(‘డబ్ల్యూహెచ్ఓకి నిధులు పూర్తిగా నిలిపివేస్తాం’) బ్రెజిల్, ఈక్వెడార్ మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలలోని అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు వైరస్ వ్యాప్తిపై చాలా తక్కువ ప్రభావం చూపాయని బేకర్ తెలిపారు. వాతావరణం వైరస్ వ్యాప్తిని నియంత్రిస్తుందని ఖచ్చితంగా చెప్పలేమన్నారు. బలమైన నియంత్రణ చర్యలు, వ్యాక్సిన్ లేకుండా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం సాధ్యపడదన్నారు. వైరస్ వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి వివిధ వాతావరణ పరిస్థితల్లో దాని వ్యాప్తి ఎలా ఉందనే అంశంపై తాము ఈ పరిశోధనలు కొనసాగించినట్లు బేకర్ తెలిపారు. -
గాలిలోని తేమతో విద్యుత్తు!
గాల్లోని తేమను నీటిగా మార్చే యంత్రాల గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు విని ఉంటారు. ఇవి మారుమూల ప్రాంతాల్లోనూ ఎడారుల్లోనూ ప్రజల దాహార్తిని తీర్చగల సామర్థ్యం ఉన్నవి. అయితే గాల్లోని ఈ తేమను నీటిగా కాకుండా విద్యుత్తుగా మార్చవచ్చునని అంటున్నారు మసాచూసెట్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఎయిర్ జెన్ అని పిలుస్తున్న ఈ కొత్త టెక్నాలజీలో నానోస్థాయి తీగలున్న పలుచటి పొరలాంటిది ఉంటుంది. మిల్లీమీటర్లో పదివేల వంతులు తక్కువ సైజుండే పొరకు ఇరువైపులా రెండు ఎలక్ట్రోడ్లు ఏర్పాటు చేస్తారు. ఒకవైపున ఉన్న ఎలక్ట్రోడ్ పొరలో కొంతభాగం మాత్రమే ఉంటే మిగిలినది గాల్లో ఉంటుంది. మరోవైపు జియోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రొటీన్లతో తయారైన నానో తీగలు విద్యుత్తు వాహకాలుగా పనిచేస్తాయి. ఈ యంత్రంలోకి గాలి ప్రవేశించినప్పుడు అందులోని తేమ, నానోతీగలపై ఉండే సూక్ష్మ రంధ్రాల కారణంగా రెండు ఎలక్ట్రోడ్ల మధ్య కరెంటు పుడుతుంది. శాస్త్రవేత్తలు తయారు చేసిన నమూనా పరికరం ద్వారా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను పనిచేయించవచ్చునని, సహారా వంటి ఎడారి ప్రాంతాల్లోనూ ఇది సాధ్యమని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డెరెక్ లవ్లీ తెలిపారు. తాజాగా తాము ఈ–కోలీ బ్యాక్టీరియా ద్వారా మరింత ఎక్కువ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేయగలిగామని, దీనిద్వారా స్మార్ట్ఫోన్లలోని బ్యాటరీలకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేయవచ్చునని అంచనా వేస్తున్నట్లు డెరెక్ తెలిపారు. అంతిమంగా భారీసైజున్న విద్యుదుత్పత్తి పరికరాలను తయారు చేయడం తమ లక్ష్యమన్నారు. -
నిప్పుల కొలిమి!
సాక్షి, వనపర్తి : వేసవి కాలం మొదలవడంతో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. దీంతో ఎండవేడికి తట్టుకోలేక ప్రజలు జయటకు రావాలంటే జంకుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా పాట్లు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌చౌక్,, అంబేద్కర్‌చౌరస్తా, బస్టాండ్, కమాన్, వివేకానందచౌరస్తా తదితర కాలనీల్లో శీతలపానీయాల దుకాణాలు వెలిశాయి. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు అంబలి, చెరుకురసం, కొబ్బరినీళ్లు, పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ తాగుతున్నారు. పనిమీద బయటకు వెళ్లేవారు గొడుగులు, రుమాళ్లు, హెల్మెంట్, ఇతర వాటిని ధరించి వెళ్తున్నారు. ఎండకాలం రావడంతో కూలర్లు, ప్రిజ్‌లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లో చల్లటి నీళ్లు తాగేందుకు మట్టికుండలను కొనుగోలు చేస్తున్నారు. ఎండలో తిరుగొద్దని, తప్పనిసరి అయితే జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. -
ఉక్కపోత .. ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మెదక్ రూరల్: వేసవి ఆరంభంలోనే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోజూవారి పనులలో భాగంగా జనం బయటకు వెళ్లాలంటేనే మండుటెండలను చూసి జంకుతున్నారు. వేసవి ఆరంభంలోనే ఇంత తీవ్రత ఉంటే ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు ఏమేర ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. ఎండవేడి తట్టుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఏటా వేసవిలో మెదక్ జిల్లా ప్రజలు అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతారు. గతంతో పోలిస్తే ఈసారి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో జనం విలవిలలాడిపోతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ ఎక్కువగా ఉంటోంది. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, పండ్ల రసాలను సేవిస్తున్నారు. అలాగే ఎండలకు వడదెబ్బ తగులకుండా తలకు రక్షణగా టోపీలు ధరిస్తున్నారు. రుమాళ్లను చుట్టుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు గొడుగులు వేసుకుని వెళుతున్నారు. నీటి కష్టాలు మొదలు వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో చెరువులు, కుంటలు వట్టిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో నీటి మట్టం తగ్గిపోయింది. దీంతో బోర్లు నీళ్లు పోసే సామర్థ్యాన్ని కోల్పోతున్నాయి. సాగు నీరు లేకపోవడంతో పంటసాగు విస్తీర్ణం ఈసారి గణనీయంగా తగ్గింది. చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడంతో పశువులు దాహం తీర్చుకునేందుకు అల్లాడుతున్నాయి. ఇప్పటికే ఆయా గ్రామాల్లో ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. నీళ్ల కోసం బిందెలు పట్టుకొని సమీప ట్యాంకులు, పొలాలకు పరుగులుపెడుతున్నారు. సింగూరులో నీటి మట్టం తగ్గిపోవడంతో మిషన్ భగీరథ నీటి సరఫరా కొద్ది రోజులుగా నిలిచిపోయింది. ఈసారి తాగు, సాగు నీటికి గడ్డుకాలమేనని పలువురు చర్చించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నీటి ఎద్దడి అధికారులకు సవాల్‌గా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఊపందుకున్న సీజనల్ వ్యాపారాలు జ్యూస్ స్టాల్స్, శీతల పానీయాలు, టోపీలు, గొడుగులు వంటి వ్యాపారాలు ఇప్పటికే ప్రధాన రహదారుల వెంట వెలిశాయి. మట్టి కుండలు, రంజన్లను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక వేసవి తాపాన్ని తగ్గించేటువంటి కూలర్లు, ఏసీల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. -
చల్లని ఉపశమనం
వేసవిలో వాతావరణంలో మార్పుల వల్ల గాలిలో తేమ తగ్గిపోయి చమటపట్టి చల్లదనం కోరుకుంటాం. ఇంట్లోనూ, ఒంట్లోనూ చల్లదనంతో ఉపశమనం పొందాలంటే... ♦ ఎండవేళలో చాలామంది పదే పదే ఫ్రిజ్ డోర్ తీసి చల్లని నీళ్లు తీసుకుంటూ ఉంటారు. దీంతో ఫ్రిజ్ మోటార్‌పై మరింత భారం పడుతుంది. మిగతా కాలాలతో పోల్చితే ఎండాకాలం నీళ్లు, పదార్థాలు చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. పదే పదే డోర్ తీయడం వల్ల విద్యుత్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. ♦ వేడి తక్కువ ఉండే ఉదయం, సాయంత్రాలు వంటలు చేయడం ముగించాలి. స్టౌ, ఓవెన్లు పగటి వేళలో ఉపయోగిస్తే ఇంట్లో వేడి శాతం పెరుగుతుంది. గ్రిల్, బొగ్గుల కుంపటి వంటివాటి మీద వండాలంటే బయట ఖాళీ స్థలాన్ని ఎంచుకోవాలి. ♦ కిటికీలు, రూఫ్ మీద సోలార్ స్క్రీన్లను ఏర్పాట్లు చేసుకుంటే ఇంట్లో విద్యుత్ వాడకం తగ్గుతుంది. చల్లదనమూ పెరుగుతుంది. ♦ బయటివైపు కిటికీల మీద నుంచి ఏటవాలుగా ప్లాస్టిక్, కలప వంటి షీట్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల సూర్య కిరణాలు నేరుగా ఇంటిలోకి రాకుండా అడ్డుకోవచ్చు.