
పుల్లయ్య
ఆసరా పెన్షన్ కోసం ఓ వ్యక్తి ఏడాది క్రితం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వం ఈ నెల 15 నుంచి 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో ఆ వ్యక్తి గురువారం తన దరఖాస్తును పరిశీలింగా చనిపోయినట్లు చూపడంతో ఒక్కసారిగా కంగుతున్నాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) మండల కేంద్రంలో జరిగింది.
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన పాతనబోయిన పుల్లయ్య చనిపోయినట్లు చూపడంతో గత ఏడాది గ్రామ పంచాయతీ కార్యదర్శికి అందజేశాడు. కానీ ఆన్‌లైన్‌లో పుల్లయ్య చనిపోయినట్లు చూపిస్తోంది. బతికి ఉన్న తనను ఏకంగా రికార్డుల్లో తప్పుగా నమోదు చేíసి చంపేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
–తిరుమలగిరి (నాగార్జునసాగర్)